Publish Date:Aug 25, 2022
బ్యాడ్మింటన్ చరిత్రలో పీవీ సింధు కృషి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒలింపిక్స్ లో పతకాలు, కామన్వెల్త్ లో గోల్డ్ సాధించి భేష్ అనిపించుకుంది. ప్రస్తుతానికి లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఎన్నో కబుర్లు చెప్పింది సింధు. కొన్నిటికి క్లియర్ గా జవాబులు ఇచ్చింది. పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి బయటికి వచ్చేయడంపై ఒక క్లారిటీ ఇచ్చింది. గోపి సర్ అకాడమీలో చాలా ఏళ్ళు ఆడాను. ఐతే ఆ అకాడమీలో జరిగిన కొన్ని విషయాలు నాకు వ్యక్తిగతంగా నచ్చలేదు..నాకు సెట్ కావనిపించి వచ్చేసాను. ఒలింపిక్స్ లో ఆడాలంటే కాన్సంట్రేషన్ చాలా అవసరం. ఇలాంటి విషయాలు ఆలోచిస్తే గేమ్ సరిగా ఆడలేను అనిపించింది.
ఈ అకాడమీలో నేను ఎంతో మంది కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నా" అని చెప్పింది సింధు. అలాగే తన లైఫ్ లో జరిగిన ఒక బాడ్ ఇన్సిడెంట్ కూడా చెప్పింది సింధు. “2015 లో కాలి నొప్పితోనే ఆరు నెలల పాటు గేమ్ ఆడాను. డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలన్నారు. కానీ నేను ఒలింపిక్స్ లోకి వెళ్ళాలి . వెళ్లాలంటే నేను టాప్ - 16 లో ఉండాలి. కానీ అప్పటికి నేను టాప్ - 13 లో ఉన్నా. ఒలింపిక్స్ నా లక్ష్యం కాబట్టి నొప్పిని భరించి ముందుకెళ్లా. ఆడిన తొలి ఒలింపిక్స్ లోనే పతకం నెగ్గడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.” కష్టడితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అప్పుడు అర్ధమయ్యింది అని చెప్పింది సింధు. అలాగే ఓనమాలు నేర్పింది ఎవరు అనే ప్రశ్నకు.. “మహబూబ్ అలీ నాకు బ్యాడ్మింటన్ లో ఓనమాలు నేర్పించారు.
తర్వాత ఆరిఫ్, గోవర్థన్, గోపీగారి దగ్గర ట్రైన్ అయ్యాను. ప్రతి ఒక్క కోచ్ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకుని నా గేమ్ ని ఇంకా మెరుగుపరుచుకున్నాను . ఇండోనేషియా, కొరియాకు చెందిన కోచ్ ల దగ్గర కూడా నేను ట్రైనింగ్ తీసుకున్నా. ఆపొనెంట్ కి నేను టఫ్ కాంపిటీషన్ ఇస్తాను. మెడల్ గెలిచినప్పుడు పోడియంపై నిల్చుని జాతీయ జెండాను చూస్తూ.. జాతీయ గీతం వింటున్నప్పుడు నాలో కలిగే ఆనందం మాటల్లో చెప్పలేను. వేరే దేశంలో మన దేశపు జెండా ఎగరడం చాలా గొప్ప విషయం కదా" అంటూ ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పింది సింధు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pv-sindhu-says-quitting-gopichand-academy-39-142623.html
వచ్చినది పోగాకు రైతుల కష్టాలు విని, వారికి అండగా ఉన్నానని సంఘీభావం తెలపడం. అయితే ఈ పర్యటనలో జనగ్ రైతులను కలవడం, వారి కనీస హామీ ధర డిమాండ్ల కోసం పోరాడటం కంటే, బల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇచ్చారు. ఇక తన ప్రసంగం కూడా పరమ రొట్టకొట్టుడు పద్ధతిలో సాగింది.
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.