పుతిన్- ది రూలర్.. సీక్రెట్ ఏజెంట్ నుంచి ప్రెసిడెంట్ వరకూ.. ఫుల్ డీటైల్స్
Publish Date:Mar 2, 2022
Advertisement
వామ్మో ..వాడు మామూలోడు కాదు, అంటారు చూడండి.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్’ కూడా అంతే.. మనిషిని చూస్తే అలానిపించరు కానీ, మామూలోడు మాత్రం కాదు. పుతిన్ ఆలోచనలకు ఆరంభమే కానీ, అంతమనేది ఉండదని అంటారు. ఇదీ కాకపోతే అది ఏదో ఒక విధంగా గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా పుతిన్ ఆలోచనలు పరుగులు తీస్తాయని, సమకాలీన అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెపుతుంటారు. అంతే కాదు,పుతిన్ ఆలోచనలు ప్రపంచ ఆలోచనలకంటే ఓ పదడుగులు ముందుంటాయి. అంటే పుతిన్ పదేళ్ళు ముందుకు వెళ్లి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని అంటారు.అలాగే, తీసుకున్న నిర్ణయాలను అమలుచేయడంలో ఆయన వైఫల్యాలు, ఎదురు దెబ్బలను లెక్కచేయరు. ఎక్కడా లెక్క తప్పకుండా అడుగులు వేయడంలో ఆయనకు ఆయనే సాటి. అందుకే కేజీబీ సీక్రెట్ ఏజెంట్‌గా రాజకీయ, జీవన ప్రస్థానాన్ని ప్రారంభించిన, పుతిన్ అనతికాలంలో దేశాధ్యక్షుడిగా ఎదిగారు. పుతిన్ ఏమిటో అర్థం కావాలంటే, ‘రష్యా లేని భూగోళం మరుభూమితో సమానం’ అని ఆయన ప్రవచించే నిత్య సూక్తి ఒక్కటి చాలు. ఇది పుతిన్ దూకుడు తత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. అందుకే, పుతిన్ ‘అణు’ యుద్ధం వరకు వెళతారా అంటే, రష్యా అధ్యక్షుడిగా అయన పెంచుకున్న అపరిమిత అధికారాలు, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ లేని వ్యవస్థల నిర్మాణం వంటి చర్యలను గమనిస్తే, ‘అణు’ ముప్పు లేకపోలేదనే ఆందోళనను రక్షణ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అంటే పుతిన్’ రష్యా కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు వెనకాడరని రంగ నిపుణులు చెప్పకనే చెపుతున్నారు. అలాగే, అణు స్థావరాలను నిర్వీర్యం చేస్తే ఉక్రెయిన్’ భూమిని ఆకమించే ప్రయత్నం చేయమని, ఎప్పటికీ యుద్ధం చేయమని ఇచ్చిన మాట తప్పడం ప్రపంచమంతా తప్పుగా భావించ వచ్చును కానీ, పుతిన్ మాత్రం అది తప్పని అనుకోవడం లేదు.అదే విధంగా పుతిన్ ఉక్రెయిన్’ పై తమ దేశం సాగిస్తున్న ‘సైనిక చర్య’ ను పుతిన్ సంర్దిచుకోవడమే కాదు. ఈ విషయంలో బయట నుంచి ఎవరైనా జోక్యం చేసుకోవాలనుకుంటే చరిత్రలో వారు ఎన్నడూ ఎదుర్కోనంత భయంకరమైన విపరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, గట్టి హెచ్చరిక కూడా చేశారు. ఆ విధంగా సైనిక చర్యకు ముందే పుతిన్ దేశ ప్రయోజనాల విషయంలో ఎవరికీ తలోగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలను హెచ్చరించారు. ఈ పరిణామాలు ప్రకటనలను గమనిస్తే, పుతిన్ ఏమిటో అర్థమవుతుందని, ఆయన దృష్టిలో ‘రష్యా’ ఒక్కటీ ఒకెత్తు అయితే, మిగిలిన ప్రపంచం అంతా ఒకెత్తు. రష్యా ఫస్ట్ అండ్ రష్యా లాస్ట్’ అనేది పుతిన్ విధానం, విశ్వాసం. అందుకోసం ఆయన ఎంతటి ముప్పును అయినా లెక్క చేయరు. అందుకే అమెరికా సహా అనేక దేశాలు ఆర్ధిక అంక్షలు విధించినా పుతిన్ తొణకలేదు బెణక లేదు.అంతేకాదు, రష్యాకు తానే శాశ్వత అధినేతగా నిలవాలని బలమైన కోరిక కూడా పుతిన్ స్వభావాన్ని స్పష్టం చేస్తుందని అంటారు, అయితే, పుతిన్ జీవిత చరిత్ర రాసిన మాషా జెసెన్, పుతిన్ ఆలోచనలు ఎప్పుడూ ఒకదానితో ఒకటి చాలా జాగ్రత్తగా అల్లుకుని ఉంటాయని అంటారు. అలాగే, పుతిన్ తమ కారియర్ నిర్మాణంలోనూ, చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, అందుకే ఆయన ఆ స్థాయికి చేరారని మాషా జెసెన్, అంటారు. ఇక పుతిన్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, వ్లాదిమిర్ పుతిన్ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో 1952లో సాధారణ కుటుంబంలో జన్మించారు. పుతిన్ లా’ పూర్తిచేసిన తర్వాత సోవియెట్ సీక్రెట్ పోలీసు విభాగం, కేజీబీలో చేరారు. ఆయనకు తూర్పు జర్మనీలోని డ్రెస్‌డెన్‌లో ట్రాన్స్’లేటర్ పోస్టింగ్ ఇచ్చారు. జర్మనీలో ఆయనను కేవలం పేపర్ క్లిప్పింగ్‌ల సేకరణ వంటి చాలా చిన్న చిన్న పనులకే పురమాయించారని మాషా జెసెన్ వివరించారు. జర్మనీలో బెర్లిన్ వాల్ కూల్చిన తర్వాత ఆయన తిరిగి రష్యాకు వచ్చారు. 1990 వరకు ఆయన సీక్రెట్ ఏజెన్సీలోనే అధికారిగా కొనసాగారు. సోవియట్ యూనియన్ పతనంతో క్రెమ్లిన్‌లో కొంతకాలం పని చేశాడు. 1991లో పుతిన్ రాజకీయ ప్రస్థానం మొదలైంది.1999 నుంచి ప్రధానిగా ఏడాదిపాటు.. ఆ మరుసటి ఏడాదిలోనే అధ్యక్షుడిగా పగ్గాల చేపట్టి.. అధికార పదవుల్లో కొనసాగుతూ వస్తున్నారు. 2008 దాకా అధ్యక్షుడిగా కొనసాగి.. ఆపై 2008 నుంచి 2012 వరకు ప్రధానిగా ఉన్నారు. 2012 నుంచి తిరిగి అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. మార్చి 2018లో పుతిన్ నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎంపికయ్యారు.అధ్యక్ష పదవిలో రెండుసార్లు మాత్రమే కొనసాగాలన్న నిబంధన ఉండడంతో దిమిత్రి మెద్వెవ్.. పరస్సరం వాళ్ల స్థానాలు మార్చుకునేవాళ్లు. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగేలా రష్యా రాజ్యాంగానికి సవరణ చేశారు. పుతిన్’కు ల్యూడ్మిలా అలెకస్సాంద్రోనా పుతినాతో 1983లో వివాహంజరిగింది. 2014లో భార్య భర్తలు విడిపోయారు. ఈ జంటకు మరియా, కటేరినా అనే కూతుళ్లు ఉన్నారు. రష్యా మీడియా మొఘల్ రూపర్ట్ మర్డోర్ మాజీ భార్య వెండి డెంగ్‌తో పాటు పలువురు టీనేజర్లతో పుతిన్ డేటింగ్ చేసినట్లు పుకార్లు ఉన్నాయి.ప్రపంచ ధనవంతుల్లో ఒకరిగా ఉన్న పుతిన్ శృంగార పురుషునిగానూ చరిత్ర సృష్టించారు.
పెంపుడు జంతువులంటే మమకారం. మీడియాను మ్యానేజ్ చేయడంలో దిట్ట.పాలనాపరంగా పుతిన్ మీద ఫిర్యాదులు లేకపోయినా.. ఫారిన్ పాలసీలు, ఆయుధ ఒప్పందాల విషయంలో, విదేశీ వ్యవహారాల్లో జోక్యంపై మాత్రం సొంత ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుంటాయి. పుతిన్ ఊహకు అందని వ్యక్తి. ఆయన ముఖకవళిలను అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. హవభావాలతో ఎదుటివాళ్లను బోల్తా కొట్టించడం పుతిన్ నైజం. అందుకే పుతిన్ మామూలోడు కాదు .. మహా ముదురు అంటారు.
http://www.teluguone.com/news/content/putin-life-story-39-132426.html





