కన్నుల పండువగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. పోటెత్తిన భక్త జనసంద్రం.!

Publish Date:Jul 16, 2026

Advertisement

ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలో  జగన్నాథ రథయాత్ర గురువారం (జులై 16) వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీకి తరలివచ్చారు.  జగన్నాథుడు, తన సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్ర దేవితో కలిసి గర్భగుడిని వీడి భక్తులకు దర్శనమిచ్చేందుకు వచ్చే ఘట్టమే ఈ రథయాత్ర.  ఏడాదికి ఒకే ఒక్కసారి జరిగే ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు, స్వామివారి రథాల తాడును తాకి పునీతులు అవ్వడానికి దేశ విదేశాల నుంచి భక్తులు పూరీ క్షేత్రానికి లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో పూరీ వీధులన్నీ భక్తజన సంద్రంగా మారిపోయాయి.  జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి కొలువై ఉన్న ఆ భారీ రథాలను లాగేందుకు భక్తులు   పోటీ పడ్డారు.  

ఏడాది పొడవునా ఆలయంలో పూజలందుకునే   దేవతామూర్తులు, రథాలపై ఊరేగుతూ గుండిచా ఆలయంలోని తమ అత్తవారింటికి వెళతారు. పూరీ రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ  సోషల్ మీడియా వేదికగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రథయాత్ర భారతదేశానికి చెందిన మహోన్నత ఆధ్యాత్మిక,  సాంస్కృతిక వారసత్వానికి సజీవ ప్రతీక ప్రధాని మోడీ అభివర్ణించారు. జగన్నాథుడి  కృపాకటాక్షాలతో దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా,  సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

లక్షలాది మంది భక్తులు ఒకే చోటకు చేరే ఇంతటి భారీ ఉత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒడిశా ప్రభుత్వం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భక్తుల రక్షణ కోసం  13 వేల మంది పోలీసు సిబ్బందిని, కేంద్ర బలగాలను  మోహరించారు.  , ఈ  ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 19 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దించింది. అలాగే..  క్షేత్రస్థాయిలో భద్రతను డిజిటల్ రూపంలో పర్యవేక్షించేందుకు పూరీ నగరవ్యాప్తంగా 473 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. రథయాత్రను సుదూరం నుంచి వచ్చే భక్తులు స్పష్టంగా వీక్షించేందుకు వీలుగా నగరంలోని ముఖ్య కూడళ్లలో 65 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.  

Odisha Puri Temple, Lord Jagannath Rathotsavam, Gundicha Temple Festival, Narendra Modi Rath Yatra Wishes

By
en-us Political News

  
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్.. దానినుంచి బయటపడేందుకు డిస్పరేట్ గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. అగ్రరాజ్యం విధించే కఠినమైన వ్యూహాత్మక నిబంధనలకు తలవొగ్గుతూ తన సొంత రక్షణ వ్యవస్థను పరాధీనం చేసుకుంటోందన్నది ఆ కథనాల సారాంశం.
మిడిల్ ఈస్ట్ యుద్ధ ఉద్రిక్తతలు మరియు వంద డాలర్లు దాటిన క్రూడాయిల్ ధరల మధ్య భారత స్టాక్ మార్కెట్లు అద్భుత రికవరీ సాధించాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు పెరగగా, నిఫ్టీ 24100 మార్కును దాటింది. మార్కెట్ తదుపరి గమనంపై విశ్లేషకుల అంచనాలు మీకోసం.
స్విట్జర్లాండ్‌లోని ETH జ్యూరిచ్ శాస్త్రవేత్తలు గిటార్ సూత్రాంతర్భాగంగా పనిచేసే సరికొత్త వేలి గోరు పరిమాణపు క్వాంటం చిప్‌ను ఆవిష్కరించారు. ఈ చిప్ విద్యుదయస్కాంత తరంగాల కంటే 1,00,000 రెట్లు చిన్న శబ్ద ప్రకంపనలను ఉపయోగించి డేటాను భద్రపరుస్తుంది, ఇది క్వాంటం ర్యామ్ (QRAM) పరిశోధనలో ఒక పెద్ద మైలురాయి.
స్కల్‌కాండీ సరికొత్త ప్రీమియం హెడ్‌ఫోన్స్ Crusher 1080 ANC విడుదల చేసింది. బోస్ సంస్థకు చెందిన బెస్ట్ ఇన్ క్లాస్ నాయిస్ క్యాన్సిలేషన్, స్పేషియల్ ఆడియో ఫీచర్లతో, 60 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో సగం ధరకే అందుబాటులోకి వచ్చిన ఈ గ్యాడ్జెట్ పూర్తి వివరాలు చూడండి.
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గోల్ఫ్ టోర్నమెంట్ ది ఓపెన్ 2026 రాయల్ బర్క్‌డేల్‌లో ప్రారంభమైంది. స్కాటీ షెఫ్లర్, రోరీ మెక్‌ఇల్రాయ్ తలపడుతున్న ఈ మెగా ఈవెంట్‌ను మొబైల్ మరియు టీవీల్లో ఉచితంగా ఎలా చూడాలో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికా ఐటీ దిగ్గజం ఐబీఎం (IBM) 25% ఘోర పతనాన్ని చవిచూసినప్పటికీ, మెరుగైన క్యూ1 ఫలితాల అండతో భారతీయ ఐటీ షేర్లు మార్కెట్లో నిలదొక్కుకున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బంగారం మరియు గ్లోబల్ స్టాక్స్ వైపు మళ్లుతున్న భారతీయ పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సిన 5 ప్రధాన రిస్కులు ఇవే. అమెరికా బాండ్ ఈల్డ్స్, క్రూడ్ ఆయిల్ ధరలు మరియు భౌగోళిక ఉద్రిక్తతల వల్ల మీ పోర్ట్‌ఫోలియోపై పడే ప్రభావం గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఫిఫా వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌పై అర్జెంటీనా ఘనవిజయం సాధించిన తర్వాత ఆటగాళ్లు ప్రదర్శించిన లాస్ మాల్బినాస్ సన్ అర్జెంటీనాస్ బ్యానర్ ప్రపంచవ్యాప్తంగా వివాదాస్పదమైంది. 1982 ఫాక్‌లాండ్ యుద్ధ గాయాలను రేపిన ఈ నినాదం వెనుక ఉన్న అసలు కథ, ఫిఫా నిబంధనలు మరియు అర్జెంటీనా జట్టు ఎదుర్కోబోయే చర్యల పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈ 14 దేశాల ఉమ్మడి కూటమికి యూరోపియన్ యూనియన్ పూర్తి మద్దతును ప్రకటించింది. అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని, ఎలాంటి బలవంతపు లేదా సైనిక చర్యలకు పాల్పడకూడదని ఈ ప్రకటనలో ఆ దేశాలు విస్పష్టంగా పేర్కొన్నాయి.
ఐసీసీ వన్డే, టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్లలో భారీ మార్పులను ప్రకటించింది. 2027 వన్డే వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 7 దశ, 2028 టీ20 వరల్డ్‌ కప్‌లో సూపర్‌ 10 దశతో సరికొత్త ఫార్మాట్‌లను తీసుకువచ్చింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
19 ఏళ్ల క్రితం లియోనెల్ మెస్సీ చేతుల్లో పెరిగిన లామిన్ యమాల్, ఇప్పుడు 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్‌లో మెస్సీ అర్జెంటీనా జట్టుకే సవాల్ విసురుతున్నాడు. ఈ అద్భుతమైన ఫుట్‌బాల్ కథనం మీకోసం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.