చిన్నమ్మకే చెల్లింది!

Publish Date:Jul 5, 2023

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా  నియమితురాలైన దగ్గుబాటి పురందేశ్వరి  ఆ పార్టీ గూటికి చేరి దశాబ్దం కాకున్నా.. ఆమె అధ్యక్ష పదవి చేపట్టడం పట్ల.. తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీలోని సీనియర్లు ఔరా.. అంటూ ముక్కన వేలేసుకొంటున్నారు. కేంద్రంలో మోదీ, అమిత్ షా ద్వయం చక్రం తిప్పినా? ఆంధ్రప్రదేశ్‌లో కమలం పార్టీ వికసించేలా చేయడంలో ఈ చిన్నమ్మ సఫలీకృతులవుతారా? అనే ఓ చర్చ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. 

2004 ఎన్నికలకు ముందు.. అంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉండగా.. అదీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ఉండగా.. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే టీడీపీ అధికారంలో ఉండగా.. దగ్గుబాటి పురందేశ్వరి ఇలా హస్తం పార్టీలో చేరి.. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల లోక్‌సభ స్థానం నుంచి బరిలో దిగి ఎంపీగా ఎన్నిక కావడమే కాదు.. మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో కేంద్ర టెక్స్ టైల్స్ శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత అంటే 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా  పోటీ చేసి.. విజయం సాధించి.. మళ్లీ మన్మోహన్ సింగ్ కేబినెట్‌లో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు.

అయితే 2009, సెప్టెంబర్ 2వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మృతి... ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకొన్న   పరిణామాల నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ.. తెలంగాణ  రాష్ట్ర ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేయడమే కాదు.. రాష్ట్ర విభజనకు ముహూర్తం సైతం ఖరారు చేశారు.

సోనియా నిర్ణయాన్ని ఏపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు నిరసన  వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్ తదితరులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. రాజకీయాలకు బై బై గుడ్ బై చేప్పేశారు.  పురందేశ్వరి మాత్రం.. కాంగ్రెస పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. ఆ క్రమంలో ఆమె కడప జిల్లా రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయినా.. ఆమె బీజేపీ తరపున పలు సభలు, సమావేశాల్లో క్రియాశీలంగా పాల్గొంటూ వస్తున్నారు.  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి.. భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు  ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత తన వైద్య వృత్తిని వదిలి.. మామ వెంట నడిచారు. ఆ క్రమంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా  తెలుగుదేశంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు క్రియాశీలంగా వ్యవహరించారు.   1994లో మళ్లీ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం.. అనంతరం చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం.. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. తెలుగుదేశంకు దూరం జరిగి.. సైలెంట్ అయిపోయారు.  అలా తన భర్త సైలెంట్ కావడంతో.. అప్పటి వరకు దుగ్గుబాటి పురందేశ్వరి అనధికారికంగా పసుపు పార్టీలోనే ఉన్నట్లు లెక్క అనే వారు సైతం ఉన్నారు.

ఆ తర్వాత అంటే.. 2004లో పురందేశ్వరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూ... కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందించారు. అలా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె ప్రజా ప్రతినిధిగా పలు పదవులు చేపట్టారు.  అలా చిన్నమ్మ.. ఓ కుమార్తెగా, ఓ భార్యగా, ఓ తల్లిగా, ఉత్తమ పార్లమెంటరీయన్‌గా తాను చేపట్టిన పదవులకే వన్నె తెచ్చే విధంగా వ్యవహరించారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఆ పార్టీలో  దశాబ్దాలుగా ఉంటున్న హేమాహేమీల పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. వారందరిని పక్కన పెట్టి దగ్గుబాటి పురందేశ్వరి వైపే కమలం పార్టీ అధిష్టానం మొగ్గుచూపిందంటే.. ఏ పార్టీలో ఉన్నా.. ఏ పదవి కట్టబెట్టినా.. ఏ పని అప్పగించినా.. అంకితభావంతో పని చేసే గుణం ఆమెలో ఉండటమే కారణమని పరిశీలకులు అంటున్నారు. అందుకే ఏ పార్టీలో ఉన్న ప్రత్యేక గుర్తింపు దక్కిచుకోవడం చిన్నమ్మకు చెల్లిందని చెబుతున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.