బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలిగా పురందేశ్వరి.!

Publish Date:Aug 17, 2026

Advertisement

బీజేపీ తన జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. కాగా జాతీయ కార్యవర్గంలో రాజమహేంద్ర వరం ఎంపీ పురంధేశ్వరికి స్థానం దక్కింది. ఆమెను జాతీయ  ఉపాధ్యక్షురాలిగా నియమించింది.  రానున్న ఎన్నికలు, పార్టీ  విస్తరణ వ్యూహాలకు అనుగుణంగా  బిజెపి అధిష్టానం  కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది.

ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 

అదేవిధంగా, పార్టీ నిర్వహణలో  కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శుల జాబితాలో మాజీ మంత్రి స్మృతి ఇరానీకి చోటు దక్కింది.   ఈ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా  బీజేపీ అగ్రనాయకత్వం..  మహిళా నేతలకు, అనుభవజ్ఞులకు పదవుల్లో ప్రాముఖ్యత ఇచ్చింది. 

ఇక పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరి..  కేంద్ర మాజీ మంత్రిగా, సీనియర్ పార్లమెంటేరియన్‌గా అనుభవం ఉన్న నాయకురాలు. ఆమె బీజేపీ గూటికి చేరిన నాటి నుంచీ  జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా కూడా పని చేశారు. ఈ నేపథ్యంలో ఆమె   అనుభవానికి గుర్తింపునిస్తూ.. అధిష్టానం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది.  తెలుగు రాష్ట్రాలలో, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బిజెపి బలోపేతానికి ఈ నియామకం   తోడ్పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

Purandeswari,  BJP Vice President, Rajahmundry MP,  BJP National Executive Committee, Smriti Irani BJP General Secretary, BJP National Office Bearers, Purandeswari National Politics, TeluguOne

By
en-us Political News

  
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
G.D. Naidu, known as the “Edison of India,” was an Indian inventor, industrialist and pioneer of innovation. This article explores his remarkable life, curiosity, self-learning, experimentation and practical approach to technology, and the lessons his journey offers to Millennials, Gen Z and Gen Alpha.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.