పులివెందుల.. ఒక పేరు కాదు.. మూడు లక్షల మంది గుండె చప్పుడు.!

Publish Date:Jul 18, 2026

Advertisement

దేశంలోని ప్రతి పట్టణానికీ ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి నేలకీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి ఊరికీ తనదైన ప్రత్యేక గౌరవం ఉంటుంది. కానీ.. దురదృష్టవశాత్తూ పులివెందులకు మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాలుగా సినిమాలు, రాజకీయ వేదికలు, టెలివిజన్ చర్చలు, 
వార్తాపత్రికల శీర్షికలు, ఇప్పుడు సోషల్ మీడియా..ఇలా అన్నీ కలిసి పులివెందులను ఇవన్నీ కలిసి పులివెందులను ఒక మనిషిగా చూపించాయి.
ఒక కుటుంబంగా చూపించాయి. ఒక రాజకీయ గుర్తింపుగా మార్చేశాయి.

కానీ పులివెందుల ఎవరో ఒకరి ఇంటి పేరు కాదు.. పులివెందుల మూడు లక్షల మంది మనుషుల నివసించే ఊరిపేరు.  ఈ నేల మీద ప్రతి ఉదయం  రైతు నాగలి దున్నుతాడు. కూలీ తన స్వేదం చిందించి..  తన పిల్లల ఆకలి తీరుస్తాడు.  తల్లి తన బిడ్డను పాఠశాలకు పంపుతుంది.   విద్యార్థి తన కలల కోసం రాత్రిళ్లు మేల్కొని చదువుతాడు.   వ్యాపారి రేపటి ఆశతో షట్టర్ ఎత్తుతాడు.  వృద్ధుడు దేవాలయానికి వెళ్లి తన ఊరి మంచిని కోరుకుంటాడు. అయితే వారెవరూ   వార్తల్లో కనిపించరు. వాళ్ల పేర్లు చర్చల్లో వినిపించవు. అసలు వారి ఉనికినే ఎవరూ గుర్తించరు. అయితే వాస్తవానికి వాళ్లే పులివెందుల. 

పులివెందుల అంటే అధికారపు అహంకారం కాదు. పులివెందుల అంటే సామాన్యుడి ఆత్మగౌరవం. పులివెందుల అంటే భయం కాదు.
పులివెందుల అంటే బతుకు. పులివెందుల అంటే రాజకీయాలు కాదు. పులివెందుల అంటే ప్రజలు. ఈ దేశ రాజ్యాంగం చెబుతోంది.. ఈ దేశం ప్రజలది అని. ఏ నాయకుడూ ప్రజలకు యజమాని కాదని.. ప్రజలే యజమానులని. అయితే...

పులివెందుల ప్రజలను ఎందుకు ఎవరో ఒకరి సొత్తులా మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ నేలను ఒక కుటుంబం పేరుతో మాత్రమే గుర్తిస్తున్నారు? మూడు లక్షల మంది మనుషుల గౌరవం అంత చౌకైపోయిందా? ఒక పట్టణం చరిత్రను ఒకే రాజకీయ కథలో బంధించడం... ఆ పట్టణానికి చేసే అతిపెద్ద అన్యాయం. ఎందుకంటే..

రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి,  జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం.  అందుకే..  అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి. పులివెందులను మూడు లక్షల మంది మనుషుల హృదయంతో చూడండి.

ఎందుకంటే.. ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డకు తన స్వంత ఆలోచన ఉంది. తన సొంత గౌరవం ఉంది. తన సొంత ఓటు ఉంది. తన సొంత భవిష్యత్తు ఉంది. స్వంత వ్యక్తిత్వం ఉంది. వాళ్లు ఎవరికీ చెందిన వారు కాదు. ఈ నేలకే చెందిన వారు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. కానీ మా నేల గౌరవాన్ని ఎవరి పేరులోనూ.. ఏ ఒక్క కుటుంబంతోనో బంధించడానికి మాత్రం ఒప్పుకోం.

చివరిగా ఒక మాట... పులివెందులలో ఒక నాయకుడు ఉండొచ్చు... ఒక కుటుంబం ఉండొచ్చు... కానీ పులివెందుల అనేది వాళ్లు కాదు. పులివెందుల అంటే మూడు లక్షల మంది ప్రజల ఆత్మగౌరవం.  మూడు లక్షల మంది ప్రజల గుండె చప్పుడు.. ఆ ఆత్మగౌరవానికి యజమానులు ప్రజలే.. ప్రజలే.. ప్రజలే.

భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి, పులివెందుల

Pulivendula heartbeat of three lakh people, Politics, Oneman, Onefamily

By
en-us Political News

  
లో క‌ల్తీల నిరోధానికి స‌మ‌గ్ర చ‌ట్టాలు ఉన్న దేశాల‌ను సంద‌ర్శించి అక్క‌డి విధానాల‌ను అధ్య‌య‌నం చేయాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. ఆయా అధ్య‌య‌నాల ఆధారంగా ఒక స‌మ‌గ్రమైన నివేదికను త‌యారు చేయాల‌న్నారు.
భూముల్లో రైతులు సాగు చేస్తున్న పంటలకు ఎలాంటి నష్టం కలగకుండా పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు.
ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు.
ఒక్కొక్కరిగా ఐదుగురు మునిగిపో తుండగా చూసిన స్థాని కులు వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో ఐదుగురు జాలర్ల మృతదేహాలను వెలికి తీశారు.
నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు.
సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు. సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.
నీతి ఆయోగ్ ఈ ర్యాంకింగ్స్‌ను కేవలం ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కాకుండా.. గత కొన్ని ఏళ్ల పారిశ్రామిక విధానాల ఆధారంగా లెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి విషయంలో జరిగిన గందరగోళం, పారిశ్రామిక విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను నిలిపివేయడం వంటి చర్యలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీశాయి. పక్క రాష్ట్రాల్లో లాగా పాలసీ కంటిన్యూటీ లేకపోవడం పెట్టుబడిదారుల్లో అపనమ్మకాన్ని కలిగించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
నడిరోడ్డుపై ఆమె దుస్తులు చించేసి, వివస్త్రను చేసి అవమానించారు. బాధితురాలు ఎంతగా వేడుకున్నా కనికరించకుండా పిడిగుద్దుల వర్షం కురిపించారు. స్థానిక మహిళలు అడ్డుకుని బాధితురాలికి దుస్తులు అందించారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
తన భర్త పవన్ కల్యాణ్‌కు ఇటీవల భుజానికి శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, స్వామివారి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అన్నా లెజినోవా కాలినడకన తిరుమల చేరుకుని తిరమలేశుడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడు మార్క్ శంకర్ పవన్ కల్యాణ్ పేరిట అన్నప్రసాదం ట్రస్టుకు 17 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.
వైసీపీ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరి జెత్వానీ, తల్లిదండ్రులపై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ, అక్రమ వసూళ్ల ఆరోపణలతో అక్రమంగా కేసు నమోదు చేశారనేది ప్రధాన ఆరోపణ. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు ఆధారంగా.. కేవలం 24 గంటల వ్యవధిలోనే ముంబై వెళ్లిన ఏపీ పోలీసులు ఆమెను, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి విజయవాడకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ, వాటిని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ఈ యువ సంగ్రామ సభకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పది వేల మందికి పైగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు పార్టీ కార్యకర్తలు హాజరవుతారని బీఆర్ఎస్ అంచనా వేసింది.
ఈ దాడుల్లో ప్రాంగణంలో పెంచుతున్నపాతిక గంజాయి మొక్కలు బయటపడ్డాయి. అంతేకాకుండా, విక్రయానికి సిద్ధంగా ఉంచినట్లు అనుమానిస్తున్న ఎండు గంజాయిని కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు.
1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారత్ తాత్కాలికంగా పక్కన పెట్టడంతో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఆరున్నర దశాబ్దాల క్రితం క్రితం కుదిరిన ఈ ఒప్పందాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, ఆధునీకరించాలని న్యూఢిల్లీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. ఒప్పందంలో మార్పులు జరిగే వరకు పాకిస్తాన్‌కు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్న ఇండియా.. తన సార్వభౌమత్వ పరిధిలోని పనులను వేగవంతం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.