మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలపై ప్రజాగ్రహం ఎందుకంటే?

Publish Date:Jul 25, 2026

Advertisement

దేశ రాజధాని హస్తిన వేదికగా  కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సాగుతున్న జెన్ జెడ్  ఉద్యమ కవరేజ్ సందర్భంగా పలు ప్రధాన స్రవంతి మీడియా ప్రతినిధుల తీరు ప్రజాగ్రహాన్ని మూటగట్టుకుంటోంది. ఇప్పటికే ఆ ప్రజాగ్రహ జ్వాలల సెగ మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రతినిధులకు సోకింది కూడా.  అందుకు కారణమేంటంటే.. మెయిన్ స్ట్రీమ్ మీడియా..  కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఏకపక్ష వార్తలు ప్రసారం చేస్తున్నాయని జనం భావించడమే. ఆ ఆగ్రహంతోనే ఉద్యమకారులు జర్నలిస్టులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఒకానొక సందర్భంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల ప్రతినిధులపై అంటే ఆయా సంస్థలలో పని చేసే జర్నలిస్టులపై దాడులకు కూడా పాల్పడ్డారు. అటువంటి సంఘటనల్లో కొందరు విలేకరులు గాయపడ్డారు. ఇక సోషల్ మీడియాలో అయితే అటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలపైనా, ఆయా సంస్థల విలేకరులపైనే ఓ రేంజ్ లో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. నెటిజనులు ఆయా మీడియా సంస్థల ప్రతినిధులను బదరిస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు.  

జులై 20న జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన ప్రదర్శనను కవర్ చేసేందుకు వెళ్లిన  టైమ్స్ నౌ విలేకరి పై కొందరు   దౌర్జన్యానికి దిగారు. గుంపుగా వచ్చిన నిరసనకారులు ఆయనపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. నీళ్ల సీసాలు విసిరారు. కాలితో తన్నారు.  ప్రదర్శనకారుల ఆగ్రహానికి ఆయన అక్కడ నుంచి వెళ్లిపోక తప్పలేదు.  అలాగే.. పార్లమెంట్ దిశగా సాగిన విద్యార్థుల ప్రదర్శనపై పోలీసులు తీవ్రంగా వ్యవహరించారని, అయితే.. టైమ్స్ నౌ కవరేజీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉందనీ, పోలీసుల దౌర్జన్యాలను హైలైట్ చేయలేదన్నది నిరసన కారుల ఆరోపణ. అందుకే ఆ మీడియా సంస్థ ప్రతినిథిపై దాడి జరిగిందని పరిశీలకులు సైతం విశ్లేషణలు చేశారు. 

అలాగే రిపబ్లిక్ టీవీ  ప్రిన్సిపల్ కరస్పాండెంట్ కూడా నిరసనకారుల ఆగ్రహాగ్నిని చవిచూశారు.  మీడియా సంస్థలు అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరిపై నిరసనకారుల ఆగ్రహానికి ఇవి నిదర్శనలుగా పరిశీలకులు చెబుతున్నారు.  ఆ రెండు మీడియా సంస్థలే కాదు, ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా  జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుస రిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే   మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.  

మోడీ అనుకూల వైఖరితో ప్రసారాలు, ప్రచురణలు చేస్తున్న మెయిన్ స్ట్రీమ్  మీడియా సంస్థలను నెటిజనులు గోడీ మీడియాగా సంబోధిస్తూ నెటిజనులు తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్న సంగతి విదితమే.   ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా సంస్థలు తమ వార్తా ప్రసారాలు, ప్రచురణల్లో నిష్పాక్షికతకు ప్రాధాన్యత ఇవ్వకపోతే.. ప్రజాగ్రహానికి గురి కావలసివస్తుందన్న విషయం తేటతెల్లమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ప్రజాస్వామ్య వ్యవస్థలో  కీలక పాత్ర పోషించాల్సిన ఫోర్త్ ఎస్టేట్  మీడియా ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితులు కొని తెచ్చుకోకుండా, ఇక నుంచైనా నిష్పాక్షితకు, వాస్తవాల ప్రసార, ప్రచురణలకు ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే గోడీ మీడియాపై ప్రజా వ్యతిరేకత మరింత పెచ్చరిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు.  

Jantar Mantar protests, Attacks on Journalists, Partiality, News Coverage

By
en-us Political News

  
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, దూషణలతో చెలరేగిన వల్లభనేని వంశీ తాజా లేఖలో మాత్రం చంద్రబాబుకు గౌరవం ఇస్తూ అయ్యా చంద్రబాబుగారూ అని మర్యాదగా సంభోధించారు. అంతే కాకుండా చంద్రబాబు చొరవను, రైతుల పట్ల ఆయనకు ఉన్న అక్కరనూ ప్రశంసలతో ముంచెత్తారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది. అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.