ప్రేమ, వేధింపులు, మోసం..డ్యాన్సర్ రేణుక జీవిత విషాద గాథ..!

Publish Date:Jul 5, 2026

Advertisement

 

తెలియని వయసులో ప్రేమ.. భర్త వేధింపులు..!

నమ్మిన వారి మోసం..ఓ పబ్ డ్యాన్సర్ కన్నీటి గాథ..!

హైదరాబాద్‌లో ఓ యువతి జీవితం విషాదాంతమైంది. చిన్న వయసులో ప్రేమ పేరుతో మొదలైన బంధం.. పెళ్లి తర్వాత భర్త వేధింపులు.. ఒంటరితనం.. నమ్మిన వారి మోసం.. ఇలా వరుసగా ఎదురైన కష్టాలు ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. చివరకు ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రాండ్ లాడ్జిలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. అల్వాల్‌కు చెందిన రేణుక (26) చిన్నతనంలోనే చదువు మానేసి ఉపాధి కోసం ఓ హోటల్‌లో పనిచేయడం ప్రారంభించింది. ఆ సమయంలో పాతబస్తీకి చెందిన శివ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారడంతో పదేళ్ల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. 

పెళ్లి తర్వాత రేణుక గర్భం దాల్చగా.. పిల్లలు వద్దని, అబార్షన్ చేయించుకోవాలని భర్త ఒత్తిడి చేశాడు. అయితే కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవాలని నిర్ణయించుకున్న రేణుక భర్తకు దూరంగా వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమెకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భర్తతో విడిపోయిన తర్వాత తల్లిదండ్రులు కూడా దూరం పెట్టడంతో.. కొడుకును పోషించేందుకు గత నాలుగేళ్లుగా కూకట్‌పల్లి లోని ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తోంది. ఈ క్రమంలో గోల్కొండకు చెందిన ఫారూఖ్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తనకు అండగా ఉంటానని నమ్మించిన ఫారూఖ్‌తో ఆమె సన్నిహితంగా మెలిగింది. అయితే తనను పలువురు కేవలం ఉపయోగించుకుని మోసం చేస్తున్నారనే భావనతో రేణుక తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. 

తన మానసిక బాధను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని స్నేహితులతో తరచూ చెప్పేదని విచారణలో వెల్లడైంది. జులై 2న రేణుక, ఫారూఖ్ కలిసి లంగర్‌హౌస్‌లోని గ్రాండ్ లాడ్జిలో గది తీసుకుని మద్యం సేవించారు. రాత్రి ఫారూఖ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్న రేణుక అర్ధరాత్రి తన స్నేహితురాలు సత్యవాణికి ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపింది. మొదట ఆమె మాటలను సీరియస్‌గా తీసుకోని సత్యవాణి.. అనంతరం వీడియో కాల్‌లో ఫ్యాన్‌ను చూపిస్తూ "నేను చనిపోతు న్నాను" అని చెప్పడంతో వెంటనే ఫారూఖ్‌కు సమాచారం ఇచ్చింది. 

హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫారూఖ్.. రేణుక ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండటాన్ని గుర్తించాడు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనుమానా స్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫారూఖ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు.. కాల్ డేటా ఆధారంగా రేణుక మరో ఏడుగురు వ్యక్తులతో కూడా సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. ఆమెను ఎవరైనా బ్లాక్‌మెయిల్ చేశారా.. లేక మానసికంగా వేధించారా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. స్నేహితురాలు సత్యవాణి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేస్తున్నారు. రేణుక జీవితం విషాదాంతం కావడంతో ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు తల్లిని కోల్పోయి అనాథగా మిగిలాడు.

By
en-us Political News

  
సినీ నటుడు ప్రకాష్ రాజ్‌పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పూణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యతో తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబాన్ని మరో దుఃఖం వెంటాడింది.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్ రెడ్డి వ్యవహారంలో దర్యాప్తు వేగం పెంచిన ఏసీబీకి కీలక ఆధారాలు లభించాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
కోస్టుగార్డు, నేవీ నౌకలతో గాలింపు చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది
భారీ వర్షాలకు దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరం చిగురుటాకులా వణికి పోతున్నది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ధాటికి దేశ ఆర్థిక రాజధాని జలమయమైంది. ఆకాశానికి చిల్లు పడిందా అనే రీతిలో కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు సముద్రాన్ని తలపిస్తున్నాయి.
కాగా వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన వారిని విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన చిన్న, గరగయ్య, అప్పలరాజు, కె.చిన్నయ్య, సీతోడు, అలాగే.. భీమిలి మండలం పెదనగమయ్యపాలేనికి చెందిన బండయ్య, విశాఖపట్నానికి చెందిన చిన్న అమ్మోరుగా గుర్తించారు.
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు సాధించింది. ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, అభిషేక్ శర్మ 43 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 10 బంతుల్లో 14 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్ లోనే.. బెదురూ బెరుకూ లేకుండా జోఫ్రా అర్చర్ బౌలింగ్ లో సిక్సర్ బాది ఔరా అనిపించాడు.
హైదరాబాద్‌లో అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ప్రమాదకర బాడీ సప్లిమెంట్ల విక్రయాలపై కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది.
ఆరు దశాబ్దాలుగా భూమి కోసం ఎదురుచూస్తున్న కంగుంది గ్రామంలోని 322 కుటుంబాల నిరీక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు తెర దించారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టైన ప్రముఖ సోషల్ మీడియా యాక్టివిస్ట్
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.