అనుచిత వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం!

Publish Date:Jun 20, 2022

Advertisement

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతాయుతంగా మాట్లాడితే బాగుంటుంది. అంతే కానీ, బాధ్యతలను మరిచి నోరు జారితే, అందుకు మూల్యం చెల్లించక తప్పదు. ఇదేదో, చట్టబద్దమైన హెచ్చరికలా  అనిపించినా, కాదు. నడుస్తున  చరిత్ర చెపుతున్న నిజం. ప్రస్తుతం అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పథకం మంచి చెడుల గురించి అనేక కోణాల్లో చర్చ జరుగుతోంది.

ఇంకా లోతైన చర్చ జరగవలసిన అవసరం కూడా వుంది. నిజానికి ఈ చర్చ ఏదో ప్రకటనకు ముందే జరిగి ఉంటే ఇంత అశాంతి, అలజడి, విధ్వంసం, ఇంత ఆస్థి నష్టం జరిగి ఉండేది కాదేమో. అన్నిటినీ మించి సైన్యంలో చేరి దేశసేవ చేసేందుకు సిద్దమైన ఎన్నోవేల మంది యువకులు, ఆందోళనలో పాల్గొన్న కారణంగా సైన్యం చేరేందుకే కాదు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులయ్యారు. ఎవరో రగిలించిన జ్వాలకు యువత తమ జీవితాలను ప్రశ్నార్ధకం చేసుకుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఇది నిజం, ఆందోళనలకు రాజకీయ పార్టీలా, శిక్షణ సంస్థల యాజమాన్యాలా ఎవరు బాధ్యులు అనే విషయం పక్కన పెడితే, ఈ ఆందోళనల వలన నష్ట పోయింది , పోతోంది మాత్రం సైన్యంలో చేరేందుకు సిద్దమైన యువకులే, ఇది కాదన లేని నిజం.   

అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాల (ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌) ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే విషయం స్పష్టం చేశారు.  సైన్యంలో చేరాలనుకునే ప్రతి అభ్యర్ధి తాను ఎన్నడూ ఎలాంటి ఆందోళనలు, దాడుల్లో పాల్గొనలేదని ప్రతిజ్ఞ చేయాలని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పూరీ.. స్పష్టం చేశారు. అగ్నివీరులుగా ఎంపికయ్యే సమయానికి పోలీసు వెరిఫికేషన్‌ జరుగుతుందని వెల్లడించారు. అంటే, గత  నాలుగైదు రోజుల్లో జరిగిన హింసాత్మక సంఘటనలో పాల్గొన్న యువకులు సైన్యంలో కాలు పెట్టే అర్హతను కోల్పోయారు.  

అదలా ఉంటే, అగ్నిపథ్‌ పథకం పై రాజకీయ నాయకులు, ముఖ్యంగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పద మవుతున్నాయి. అధికార పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు, అగ్నివీరులను తమ పార్టీ ఆఫీసుకు సెక్యూరిటీగా గార్డులుగా పెట్టుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో.. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ సర్ది చెప్పుకొనే ప్రయత్నం చేశారు. నిజమే కావచ్చును, సెక్యూరిటీ సిబ్బందిగా, పనిచేయడం చిన్నతనం కాదు. కానీ ఇలాంటి సమయంలో అలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదు. అదే విధంగా  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అదే విధమైన అనాలోచిత వ్యాఖ్యలు చేశారు. 

ఇదే అదనుగా కైలాష్‌ విజయ్‌ వర్గీయ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ, శివసేన, ఎంఐఎం మండిపడ్డాయి.ప్రభుత్వం సైన్యాన్ని అవమానిస్తోందని ఆరోపించాయి. దీంతో ‘అగ్ని’కి ఆజ్యం తోడైంది. మరోవంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంక వాద్రా, అసలు విషయాన్ని పక్కన పెట్టి, యువత మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. పిలుపు నిచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది.  
మరోవంక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంక వాద్రా, అసలు విషయాన్ని పక్కన పెట్టి, యువత మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని. పిలుపు నిచ్చారని బీజేపీ ఆరోపిస్తోంది. అగ్నిపథ్‌పై ఓ వైపు ఆందోళనలు కొనసాగుతుండగా..  మరోవైపు దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటూ ప్రభుత్వం  పథకం ఉద్దేశాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్న సమయంలో నోరు జారి వివాదాలు సృష్టించడం విజ్ఞత అనిపించుకోదని, విజ్ఞులైన పెద్దలు సూచిస్తున్నారు.

By
en-us Political News

  
దాదాపు ఏడేళ్ల తరువాత ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఏం జరుగుతోంది?  ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్ కోణంలో ఈడీ ఎలాంటి కీలక ఆధారాలు సేకరించబోతోంది? అన్న విషయంపై ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు, ఏపీ కమ్మకార్పొరేషన్ చైర్మన్ అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 
వివాహ వేదిక దాదాపుగా వైసీపీ మినీ ప్లీనరీ జరుగుతోందా అనిపించేలా ఉంది.  ఈ వివాహ కార్యక్రమం దాదాపుగా పార్టీ అంతర్గత సమావేశాన్ని తలపింప చేసేదిగా మారిపోయింది.  ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఈ స్థాయిలో ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటి సారి.
ఇప్పటికే టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి దక్కిన సంగతి తెలిసిందే. సామాజిక, ప్రాంతీయ సమీకరణాలతో పాటు  రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయనకు ఆ అవకాశం కల్పించారు.
ఈ ఫ్లెక్సీల్లో  జగన్ తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి బేగంపేట, పంజాగుట్ట, రాజ్‌భవన్ రోడ్డు, ఖైరతాబాద్ తదితర కీలక కూడళ్లలో ఇవి దర్శనమిస్తున్నాయి.
యితే లోకేష్ తనను తాను మేకోవర్ చేసుకోవడానికి ఆ ట్రోలింగ్ ను ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వైసీపీయులకు లోకేష్ విషయంలో పన్నెత్తి మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. అందుకు భిన్నంగా వైసీపీ అధినేత జగన్ తన ప్రెస్ మీట్లలో అడ్డంగా దొరికిపోతూ విపరీతంగా ట్రోల్ అవుతున్నారు.
తమిళనాడు సీఎం విజయ్ కి   సన్నిహితుడు,  ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడు అయిన  రికీ రాధన్ పండిట్ వెట్రివేట్ తో భేటీ అయ్యారు. హైదరాబాద్ వచ్చిన ఆయన  కవితతో భేటీ అయ్యారు.
ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై  కీలక  వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా  సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్  నిర్ణయించారు. 
మాజీ సీఎం జగన్‌కు ఏపీపీఎస్సీ అంటే తెలియదు, డీఎస్సీ అంటే ఏంటో అసలు తెలియదు.. రెండూ ఒకటే అంటున్నారని ఎద్దేవా చేశారు.    పరీక్షా విధానంపై ఆయనకు ఉన్న ఈ స్థాయి జ్ఞానం వల్లే ఆయన ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్కటంటేఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేకపోయారని ఎద్దేవా చేశారు.
సుస్మిత పటేల్ కంటే ముందు పార్టీ సీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మాజీ ముఖ్యమంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి నేతలు కూడా రేవంత్  ప్రభుత్వ పనితీరు, హామీల అమలుపై బహిరంగంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయాన్నిగుర్తు చేశారు.
దేవినేని ఉమాకు కూటమి సర్దుబాట్లలో భాగంగ 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ దక్కలేదు. పార్టీ క్లిష్ట సమయాల్లో ముందుండి పోరాడిన దేవినేని ఉమాకు ఈ సారి ఎమ్మెల్సీ ఖాయమన్న భావన ఆయన అనుచరుల్లో బలంగా వ్యక్తమౌతోంది. మరోవైపు వంగవీటి రాధా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ఇటీవలి ఎన్నికల రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేసే అవకాశం రాని ఆయనకు, ఈసారి ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు ఆశిస్తున్నారు.
విద్యాహక్కు చట్టం  నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో బలహీన వర్గాలు, పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు పాతిక శాతం సీట్లను తప్పనిసరిగా కేటాయించే ప్రక్రియను రాష్ట్రంలో   సమర్థవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.