రోజాకు టీటీడీ ప్రొటోకాల్ దర్శనం? అసలేం జరుగుతోంది?

Publish Date:Jan 12, 2025

Advertisement

జగన్ ఐదేళ్ల అరాచకపాలనను జనం అసహ్యించుకున్నారు. ఆయన కేబినెట్ లోని కొందరు మంత్రుల తీరును, వారి అసహ్యకరమైన భాషను భరించలేకపోయారు. అందుకే ఎన్నికలలో ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఘోరాతి ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారు. తెలుగుదేశం కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారు. బూతులతో రెచ్చిపోయిన మంత్రులలో ఒక్కరంటే ఒక్కరు కూడా విజయం సాధించలేదంటే.. జనం వారిని ఎంతగా ఏవగించుకున్నారో ఇట్టే అవగతమౌతుంది. ప్రజా తిరస్కారానికి గురైన వైసీపీ నేతల అక్రమాలు, దౌర్జన్యాలపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అంతా భావించారు. భావించడం కాదు.. ఐదేళ్ల పాటు తమను అష్టకష్టాలూ పెట్టిన వైసీపీయుల అరాచకత్వం, దౌర్జన్యం, దుర్మార్గం, అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనే జనం కూటమికి బ్రహ్మరథం పడుతూ తీర్పు ఇచ్చారు.  

వైసీపీ నేతలు కూడా తమ తప్పులకు కూటమి ప్రభుత్వంలో శిక్ష తప్పదని అనుకున్నారు.   దీంతో భయంతో వణికి పోతూ ఈ ఆరు నెలలూ దాదాపు అజ్ణాత వాసం గడిపారు. అధికారం అండతో ప్రత్యర్థులపై బూతులతో రెచ్చిపోయిన వారిలో  రోజా కూడా ఒకరు. ఆమెకు నగరి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. వరుసగా రెండు సార్లు విజయం సాధించిన నగరి నియోజకవర్గం నుంచి ఆమెను ఓడించారు. ఆ ఓటమి ఎంత ఘోరంగా ఉందంటే.. పోలింగ్ రోజునే రోజా తన ఓటమిని అంగీకరించేసి కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయారు. బూతల రోతతో పాటు.. పర్యాటక మంత్రిగా ఆమె కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలూ ఉన్నాయి. వీటన్నిటిపైనా ఆమెపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలుంటాయని అంతా భావించారు. రోజా కూడా అదే భయంతో ఓటమి తరువాత చాలా కాలం ఎవరికీ ముఖం చూపకుండా చెన్నై చెక్కేశారు.

అయితే ఈ ఆరు నెలల కాలంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే రోజా వంటి వారికి ధైర్యం నూరి పోసినట్లుగా వ్యవహరించింది. అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవు. కేసులు లేవు. జగన్ హయాంలోఅధికారం అండతో ఇష్టారీతిగా వ్యవహరించిన వారిపై ఎటువంటి ప్రతీకార చర్యలు ఉండవని స్వయంగా సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ ప్రకటించారు. మాటవరసకైతే ప్రతీకార చర్యలు ఉండవని అన్నారు కానీ, చేతలలో మాత్రం అసలు అటువంటి వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశమే తమకు లేదని చాటారు. దీంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో తమకు వచ్చిన ఇబ్బందేమీ ఉండదని అర్ధం చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి తామే అధికారంలో ఉన్నామన్నట్లుగా ఇష్టారీతిగా వ్యవహరించడం మొదలు పెట్టారు. తెలుగుదేశం కూటమి మెతకతనాన్ని అలుసుగా తీసుకుని  మళ్లీ గతంలోలాగే నోటికి పని చెబుతున్నారు.  వైసీపీ సోషల్ మీడియా కూడా గతంలోలాగే అసభ్య, అశ్లీల పోస్టులతో రెచ్చిపోతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర నాయకులపై అనుచిత ఫొటోలు, వీడియోలతో రెచ్చిపోతోంది. తిరుపతి ఘటనలో వైసీపీ నేతలు వ్యవహరించిన తీరు చూస్తే వారందరికీ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వారికి ఎంత అలుసు ఇచ్చిందో స్పష్టంగా అర్థమౌతోంది.  

ముఖ్యంగా  మాజీ మంత్రి రోజా తిరుపతి తొక్కిసలాట ఘటన జరిగిన తరువాత నుంచీ రోజుకు రెండు మూడు సార్లు మీడియా ముందుకు వస్తూ ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాదు ఆయనది ఐరన్ లెగ్ అంటూ రెచ్చిపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రతి సారీ రాస్ట్రంలో ఇటువంటి విషాద ఘటనలు జరుగుతాయంటూ నోటికొచ్చినట్లు మాట్లాడారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పైనా నోటికొచ్చినట్లు విమర్వలు చేశారు. అటువంటి  రోజా, శనివారం ఉదయం తిరుమల స్వామివారి దర్శనానికి వెళితే, ఆలయ అధికారులు, టీటీడీ సిబ్బంది ఆమెకు ప్రోటోకాల్ మర్యాదలతో బ్రేక్ దర్శనం చేయించి సాగనంపారు. దర్శనం చేసుకు వచ్చిన తర్వాత కూడా ఆమె మళ్ళీ మరోసారి టీటీడీ, సిఎం చంద్రబాబు నాయుడులపై నిప్పులు చెరిగారు. అసలు కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైందన్నదానికి టీటీడీ సమాధానం చెప్పాలి. అసలు ఆమె పేరును ఎవరు సిఫారసు చేశారు? దానిని ఎవరు ఆమోదించారు అన్న విషయం తేలాల్సి ఉంది.  మంత్రిగా ఉన్న సమయంలో రోజా ప్రొటోకాల్ దర్శనం పేరిట వందల మందిని తనతో తీసుకువెడుతూ దర్శనం టికెట్లను సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీసం ఎమ్మెల్యే కూడా కాని రోజాకు తిరుమలలో ప్రొటోకాల్ దర్శనం ఎలా సాధ్యమైంది?  పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వ మెతకతనాన్ని అధికారులు కూడా అలుసుగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయని పరిశీలకులు అంటున్నారు. అసలు ప్రభుత్వానికి యంత్రాం గంపై పట్టులేనట్టు కనిపిస్తోందనీ, ఇప్పటికీ క్షేత్రస్థాయిలో వైసీపీయుల హవాయే నడు స్తోందని అనిపిస్తోందని అంటున్నారు. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.