ప్రోస్టేట్ క్యాన్సర్ ఎవరికి వస్తుంది?
Publish Date:Jul 12, 2022
Advertisement
పురుషులకు అత్యంత కీలక మైన భాగం ప్రోస్టేట్ గ్రంధి ముఖ్యంగా పురుషుడి సంతానోత్పత్తి వ్యవస్థ లో ప్రోస్టేట్ గ్రంధి ఒక భాగం. ఇది మలాశయానికి అడుగు భాగాన మూత్ర నాళా న్ని చుట్టుకుంటుంది .ఆరోగ్యంగా ఉన్న ప్రోస్టేట్ గ్రంధి వీర్యాని కి అవసరమైన జిగురుతోకూడిన ద్రవాన్ని తయారు చేస్తుంది . ఈ ద్రవం మూలం గానే స్కలన సమయం లో వీర్యం పురుషాంగం నుంచి సాఫీగా బయటికి విడుదల అవుతుంది. ముఖ్యంగా ప్రోస్టేట్ గ్రంధి పెరిగితే అది మూత్ర నాళాన్ని నొక్కి పెడుతుంది. అలాంటి సందర్భంలో మూత్రాశయం నుంచి పురుషాంగం లోకి విడుదల అయ్యే మూత్ర ప్రవాహం విధానం అవుతుంది. టెస్టో స్టెరాన్... టెస్టో స్టెరాన్ అనబడే పురుష హార్మోన్ ప్రోస్టేట్ పెరగడానికి దోహదపడుతుంది . పురుష హార్మోన్లు వృషణాల లో తయారు అవుతాయి ఆండ్రినల్ గ్రంధి కూడా టెస్టో స్టెరాన్ ని కొద్ది మొత్తం లో తాయారు చేస్తుంది. ప్రోస్టేట్ గ్రంధిలోని కణాలు అసాధారణంగా ,ఆసాంఖ్యాకంగా వృద్ధి చెందడం ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణం... ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వృద్ధులలో కనిపిస్తుంది.పురుషులకు వయస్సు పెరుగుతున్న కొద్ది వాళ్ళ లోని ప్రోస్టేట్ గ్రంధి పెరిగి మూత్ర నాళాన్ని లేక మూత్రాశయాన్ని నోక్కి పెడుతుంది. దానితో ఆ వ్యక్తికి మూత్రాన్ని పోయటం ఇబ్బందికరంగా తాయారు అవుతుంది.అంతే కాదు ఇలాంటి పరిస్థితిని బినైన్ ప్రోస్టేట్ హైపర్ ప్లేసియా అంటారు. దీనికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రోస్టేట్ గ్రంధి పెరగడం... ప్రోస్టేట్ గ్రంధి పెరగడం అనేది క్యాన్సర్ కాదు గాని దీనిలక్షణాలలాగే ఉంటాయి . ఒక్క బి పి హెచ్ మాత్రమే కాదు ప్రోస్టేట్ గ్రంధి కి సంబంధించి ఇతారాత్రా సమస్యల లక్షణాలన్నీ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలుగా కనిపిస్తాయి. లక్షణాలు... ప్రోస్టేట్ క్యాన్సర్ తొలిదశలో పెద్దగా లక్షణాలు ఏవి కనిపించవు. ఒక వేళ ఉంటే ఈ కింధి విధంగా ఉంటాయి. 1)మూత్రాన్ని ఆలస్యంగా పోయడం. 2)మూత్ర ధార సన్నగా ఉండడం . 3)ఒక్కో సారి అసలు మూత్రమే రాక పోవడం. 4)మాటి మాటి కి మూత్రానికి వెళ్లాలని పించడం. 5)మూత్రానికి వెళ్లినప్పుడు పూర్తిగా పోయలేదనే భావన . 6)రాత్రి పూట మాటి మాటికి మూత్రానికని లేవడం. 7)మూత్రాన్ని కి వెళ్ళి నప్పుడు పూర్తిగా నొప్పి మూత్రం కాలు తున్న ఫీలింగ్. 8)మూత్రం లో రక్తం పడడం. 9) వీర్యం లో రక్తం కనిపించడం. 10)నడుము కింది భాగం -పోత్తికడుపు ,పిరుడలు ,కంటి భాగం,తొడల భాగం ,తొడల భాగం పై భాగం నొప్పి చేయడం. 11)అంగ స్తంబన కాక పోవడం .వంటి లక్షణాల తో పాటు ప్రోస్టేట్ హై పర్ ప్లెసియా లక్ష ణా లు కనిపిస్తాయి .లేదా ప్రోస్టేట్ గ్రంధి ఇన్ఫెక్షన్ కి గురి అయినప్పుడు పైన పేర్కొన్న లకణాలు కనిపిస్తాయి.. ఎవరికి రావచ్చు.... 65 సంవత్సరాల పై బడ్డ వారిలో ప్రోస్టేట్ గ్రంధి అవకాశం ఉంది . చికిత్చ... ప్రోస్టేట్ సర్జరీ ,లాప్రోస్కొపీక్ సర్జరీ ,రోబోటిక్ లాప్రో స్కోపిక్ సర్జరీ ,రేడియేషన్,థెరఫీ హార్మోన్ థెరఫీ,కీమో తెరఫీ వంటి వి చేస్తారు.
http://www.teluguone.com/news/content/prostate-cancer-34-139541.html





