పెమ్మసానికి ప్రమోషన్.. కింజరాపుకు శాఖ మార్పు?.. కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై మోడీ కసరత్తు

Publish Date:Mar 28, 2026

Advertisement

ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరించాలని భావిస్తున్నారా? మంత్రుల శాఖల్లో భారీ ఎత్తున మార్పులతో పాటు.. కొందరికి ఉద్వాసన, మరొ కొందరికి చోటు కల్పించనున్నారా? అంటే ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ఔననే వినిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ క్యాబినెట్ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆరంభించినట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా మోడీ తన కేబినెట్ విస్తరణలో శాఖల మార్పు ఉండే మంత్రులలో తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందిన కేంద్ర మంత్రులకు మరింత ప్రాధాన్యత ఉన్న శాఖలను అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  కాగా వచ్చే నెలలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు చెబుతున్నారు.  మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీకి చెందిన మంత్రులు పెమ్మసాని, కింజారపు రామ్మోహన్ నాయుడుల శాఖలను మార్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలాగే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖను సైతం మారుస్తారని చెబుతున్నారు. 

ప్రస్తుతం కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ కు ప్రమోషన్ ఖాయమంటున్నారు. ఆయనకు స్వతంతర హోదా కల్పించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇక పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడికి శాఖ మార్చి అంతకంటే ప్రాధాన్యత ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖను కేటాయించే యోచనలో ప్రధాని మోడీ ఉన్నట్లు చెబుతున్నారు.  ఇక ఏపీ నుంచి అదనంగా మరో ఇద్దరికి కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. కొత్తగా కేబినెట్ లో చోటు దక్కించుకునే వారిలో రాజమహేంద్రవరం ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి, అలాగే  లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు, అమలాపురం ఎంపీ హరీష్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. 

ఇక ఇప్పటికే . బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం దాదాపు ఖరారైందని చెబుతున్నారు. ఆయన ఇటీవలే రాజ్యసభకు ఎంపికైన సంగతి తెలిసిందే.  అదలా ఉంచితే కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు సిట్టింగ్ మంత్రులకు ఉద్వాసన తప్పదని కూడా తెలుస్తోంది. అలా ఉద్వాసన పలికిన మంత్రులకు పార్టీ పదవులు అప్పగించాలని మోడీ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

By
en-us Political News

  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
ఏకంగా 21 పెళ్లిళ్లు చేసుకున్న బెగ్గర్.!
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల సంఘం (సీఈసీ) జ్నేಶ್ కుమార్ రాజీనామా డిమాండ్ కలకలం రేపుతోంది.
ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో పవర్ బ్యాంక్‌లో మంటలు చెలరేగడం కలకలం రేపింది.
గోవా కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌ దందా హైదరాబాద్‌ వరకు విస్తరించినట్లు పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో రోడ్డెక్కింది మేమే.. డిప్యూటీ సీఎం.!
పాత కరెన్సీ నోట్లకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తామంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చి అమాయకులను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్ల
దేశ రాజధానిలో నిరసనల నేపథ్యంలో విధించిన కఠిన నిబంధనలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకున్న ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
ఆడుతూ పాడుతూ గడపాల్సిన వయసులోనే ఐదేళ్ల చిన్నారి అరేలియా జీవితం విషాదాంతమైంది.
భర్త మంచానికే పరిమితమయ్యాడు.. కుటుంబ బాధ్యతలు ఓవైపు.. జీవితంలో ఎదురైన కష్టాలు మరోవైపు
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.