Publish Date:Oct 15, 2023
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయం హీటెక్కింది. షెడ్యూల్ విడుదలకు ముందే రాష్ట్రంలోని 119 స్థానాలలో 115 స్థానాలలో పార్టీ అభ్యర్థులను ప్రకటంచి దూకుడు ప్రదర్శించిన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. ఆ తరువాత ఎందుకో నెమ్మదించారు. అయితే తాజాగా ఆదివారం (అక్టోబర్ 15) బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను తలదన్నేలా ఈ మేనెఫెస్టోను రూపొందించారు. హ్యాట్రికగ్ గెలుపే లక్ష్యంగా కేసీఆర్ ఈ మేనిఫెస్టోలో కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు ఇవే..
# హైదరాబాదులో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లు
# అనాథ బాలల కోసం అర్బన్ పాలసీ
# అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత
# ఆహాక భద్రత కార్డు హోల్డర్లందరికీ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి.. రూ.5 లక్షలతో బీమా సౌకర్యం...
# సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున పెన్షన్
# తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం
# అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
# పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్
# జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
# ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు
# దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు
# సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తింపు
# తెలంగాణ అన్నపూర్ణ' పథకం తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం...
# ఆసరా పింఛన్ల మొత్తం దశలవారీగా పెంపు
# పింఛన్లు ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు
# రైతు బంధు దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు
# కౌలు రైతులకు ఆర్థిక సహాయం
# వ్యవసాయ స్థిరీకరణ కొనసాగింపు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/promises-in-brs-manifesto-39-163452.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?