చర్చలు జరపండి.. ఇండియా, పాక్ ప్రధానులకు ప్రముఖుల లేఖ!

Publish Date:Jul 1, 2026

Advertisement

ఇండియా, పాకిస్థాన్  మధ్య దశాబ్దాలుగా నలుగుతున్న ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలను తొలగించేందుకు ఇరు దేశాల మధ్య శాంతి చర్చల ప్రక్రియను పునఃప్రారంభించాలంటూ ఇరు దేశాలకూ చెందిన ప్రముఖులు ఒక బహిరంగ లేఖ రాశారు. ఇరు దేశాల ప్రధానులకూ రాసిన ఈ లేఖపై ఇరు దేశాలలోని వివిధ రంగాలకు చెందిన 117 మంది   లబ్దప్రతిష్టులైన ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చి, ఇండియా, పాకిస్థాన్ మధ్య  దౌత్య సంబంధాలను పునరుద్ధరించాలంటూ  రాసిన ఆ లేఖను   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,  పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌లకు ఏకకాలంలో పంపించారు. ఈ లేఖ ఇప్పుడు  అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. చాలా కాలంగా ఇరు దేశాల మధ్య నిలిచిపోయిన అధికారిక, అనధికారిక దౌత్య మార్గాలను మళ్లీ తెరిచి, అన్ని సమస్యలపై ప్రత్యక్ష సంప్రదింపులకు తక్షణమే శ్రీకారం చుట్టాలని ఈ ప్రముఖులు ఆ లేఖలో ఇరు దేశాల ప్రముఖులకు విజ్ణప్తి చేశారు. 

సరిహద్దుల మధ్య వారధిగా నిలిచి నేతృత్వం వహిస్తున్న ఢిల్లీకి చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ  సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్  అధినేత ఓపీ షా ఈ  ఇందుకు చొరవ తీసుకున్నారు.  ప్రస్తుతం భారత్, పాకిస్థాన్  మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవని, ఈ   ప్రతిష్టంభన దక్షిణాసియా ఉపఖండంలోని సాధారణ ప్రజల దైనందిన జీవితాలపై,  మరీ ముఖ్యంగా సరిహద్దు ప్రాంత వాసులపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని పేర్కొన్నఓపీ షా ,   రెండు పొరుగు దేశాల మధ్య శాంతి, ప్రాంతీయ స్థిరత్వం,   సాధారణ సత్సంబంధాలు నెలకొంటేనే కోట్లాది మంది ప్రజల ఆర్థిక శ్రేయస్సు, ఉపాధి అవకాశాలు సాధ్యమవుతాయన్నారు.  

గతంలో జరిగిన పాకిస్థాన్ ప్రేరేపిత ఘోర ఉగ్రదాడులైన 26/11 ముంబై దాడులు, పుల్వామా సైనిక కాన్వాయ్‌పై దాడి, మరియు పహల్గామ్ ఉగ్ర ఘటనల నేపథ్యంలో చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించగా, దానికి ఓపీ షా  దేశ భద్రతకు ముప్పుగా మారిన ఉగ్రవాదం మరియు సరిహద్దు రక్షణ వంటి అత్యంత కఠినమైన సమస్యలను కూడా కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే శాశ్వతంగా పరిష్కరించుకోవాలని   సూచించారు.  

ఇటీవల కాలంలో  ఆపరేషన్ సిందూర్   తర్వాత ఉగ్రవాద మూలాలపై భారత్ అనుసరిస్తున్న అత్యంత కఠినమైన సైనిక, రక్షణ వ్యూహాలపై ఆయన స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఎంతటి కఠినమైన చర్యలు చేపట్టినప్పటికీ, అంతిమంగా శాశ్వత శాంతి   చర్చల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.  ఆయన చొరవతో దేశంలో పలు రంగాలకు చెందిన 117 మంది ఏకతాటిపైకి వచ్చి ఈ లేఖపై సంతకాలు చేయడానికి ముందుకు వచ్చారు.   రెండు దేశాల మధ్య నిరంతరాయంగా చర్చలు జరగడం వల్ల మాత్రమే ఒకరి అంతర్గత ఆందోళనలు, భద్రతాపరమైన పరిమితులు మరియు అభ్యంతరాలను మరొకరు క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు వీలవుతుందని, తద్వారా శాశ్వత శాంతికి బలమైన పునాది పడుతుందని ఈ 117 మంది ప్రముఖుల బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. 

By
en-us Political News

  
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం వీబీ జీ రామ్ జీ ఏపీ నుంచి ప్రారంభమై దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది.
కర్ణాటక రాజధాని బెంగళూరు నగర శివార్లలో గురువారం తెల్లవారుజామున ఒక ఊహించని ఘోర విషాదం చోటుచేసుకుంది.
కంచన్ భాగ్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీశ్ రావుతో పాటు ఇతర నేతలను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఐపీఎస్ అధికారి ఏ.కే. ఖాన్ కుమారుడు మొహ్సిన్ ఖాన్‌తో పాటు తబ్రేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పుణేకు చెందిన ప్రముఖ రియల్టర్ కేతన్ అగర్వాల్ దారుణ హత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
శ్రీకాకుళం తీరప్రాంతంలో అపారంగా లభ్యమవుతున్న బీచ్ శాండ్ మరియు హెవీ మినరల్స్ (భారీ ఖనిజాలు) ఆంధ్రప్రదేశ్ రాజకీయ, ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న అంశాలు.
గల్ఫ్ దేశంలో ఉద్యోగాల కోసం 20 మంది మహిళలు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఒమాన్ ఎయిర్‌లైన్స్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న వీరు విమానం ఎక్కబోతుండగా ఇమ్మిగ్రేషన్ అధికారులు వారిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు.
ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో హైదరా బాద్‌తో పాటు మొత్తం 20 ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఎలాంటి సమాచారం బయటకు వెళ్లకుండా అధికారులు అత్యంత గోప్యంగా ఈ సోదాలు చేపట్టాయి.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శతాబ్ద కాలానికి పైగా ఎంతో పవిత్రంగా, చారిత్రక వారసత్వంగా విరాజిల్లుతున్న గురుద్వారాను కొందరు దుండగులు పాక్షికంగా కూల్చివేసి ధ్వంసం చేయడంపై సిక్కు సమాజమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవతావాదులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇండియా కూడా తీవ్రంగా స్పందించి పాకిస్థాన్ తీరును గర్హించింది.
మణిపూర్‌లోని కమ్‌జాంగ్ జిల్లా సరిహద్దు గ్రామాలు బుధవారం (జులై1) హింసాత్మక ఘర్షణలు, పరస్పర దాడులలతో దద్దరిల్లిపోయాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
జడ శ్రవణ్ కుమార్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నాలుక కోసి దానిని నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పార్సిల్ పంపిస్తానంటూ అభ్యంతరకరమైన,అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.
అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారీ స్కోరు సాధించినప్పటికీ, వరుణుడు విరుచుకుపడటంతో మ్యాచ్ ఫలితం తేలకుండానే రద్దయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.
అమెరికా అండతో రెచ్చిపోతున్న ఇజ్రాయెల్‌ను అదుపులో ఉంచాలనీ, లేకుండా తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. అమెరికా గనుక ఇజ్రాయెల్ దేశాన్ని నియంత్రించడంలో విఫలమైతే.. తామ స్పందన తీవ్రాతి తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.