Publish Date:Mar 19, 2025
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ ను పదేళ్ల తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెలుగులోకి తెచ్చింది. అయితే కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడానికి ప్రధాన కారణం ప్రధాన నిందితులు విదేశాల్లో ఉండటమే. వారు తిరిగి వస్తే కానీ దర్యాప్తు ముందుకు సాగదు. ప్రధాన నిందితులైన ఎస్ ఐబి మాజీ ఓ ఎస్టీ ప్రభాకర్ రావు, మరో కీలక నిందితుడు అరువెల్ల శ్రవణ్ రావ్ లకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి .ఇంటర్ పోల్ నుంచి సిబిఐ ద్వారా తెలంగాణ సిఐడికి సమాచారమందడంతో హైద్రాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. వీరిరువురిని అదుపులో తీసుకుని కేంద్రానికి అప్పగించే పనిలో ఇంటర్ పోల్ ఉంది. వారిద్దరిని సాధ్యమైనంత త్వరగా ఇండియా తీసుకురావడానికి కేంద్రం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హైద్రాబాద్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీరిద్దరిని అమెరికాలో తాత్కాలిక (ప్రొవిజినల్ ) అరెస్ట్ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా ఇండియా పంపే అవకాశం ఉంది. ప్రొవిజినల్ అరెస్ట్ ను నిందితులు అక్కడి కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా ప్రొవిజినల్ అరెస్ట్ అని నిందితులు కోర్టులో పిటిషన్ వేసే అవకాశం లేకపోలేదు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/progress-in-phone-tapping-case-red-corner-notices-issued-to-accused-25-194650.html
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్నే టార్గెట్ చేశారు.
తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా అద్వైత్ కుమార్ సింగ్ ఐఏఎస్ పూర్తి అదనపు బాధ్యతలు (FAC) స్వీకరించారు