కోదండ రాం..రాం..

Publish Date:Mar 20, 2021

Advertisement

ప్రొఫెసర్ కోదండరాం సార్. తెలంగాణ ఉద్యమ కాలంలో ఫుల్ క్రేజ్. కేసీఆర్‌కు సమస్థాయి, సమఉజ్జీ. ఆ రోజుల్లో.. ఆయన జోరు అదో తీరు.  ఉద్యమం ముగిసింది. కేసీఆర్‌తో చెడింది. ఇక అంతే. అప్పటి వరకూ ఓ వెలుగు వెలిగిన ప్రొఫెసర్.. అప్పటి నుంచి ఆయన ప్రభ మసక బారిపోయింది. పాపం.. పెద్ద సారు. పెద్దల ఆటలో అరటిపండు అయ్యారు. తాజా ఎమ్మెల్సీ ఎన్నికలతో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. 
 
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు ప్రొఫెసర్ కోదండరాం. ఖమ్మం- నల్లగొండ- వరంగల్‌ పట్టభద్రుల బరిలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రధాన పోటీ దారుగా భావించారు అంతా. కానీ, మల్లన్నను సైతం చేరుకోలేక మూడో స్థానినికి పడిపోయారు. అయితే, జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లను అధిగమించడం చిన్న విషయమేమీ కాదు. 

ఎన్నికలు ఎదుర్కోవడం కోదండరాంకు కొత్తే. రాజకీయ ఎత్తులు, ప్రచార జిత్తులు, పోల్ మేనేజ్‌మెంట్‌లాంటి విషయాల్లో ఆయన పెద్దగా ఆరి తేరలేకపోయారు. కొంతకాలం క్రితం తెలంగాణ జన సమితి పార్టీని స్థాపించినా ఆ పార్టీ ఇప్పటి వరకూ ఉనికే చాటుకోలేకపోయింది. 2018లో కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ కూటమితో కలిసి పోటీ చేసినా.. ఏ ఒక్క చోటా బోణీ కొట్టలేదు. టీజేఎస్‌ మనుగడే ప్రశ్నార్థకంగా మారిన సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన కోదండరాంకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. పట్టాభద్రుల నియోజక వర్గం కావడం.. ఉన్నత విద్యావంతుల్లో ప్రొఫెసర్ కోదండరాంకు ఆదరణ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటం.. ఉద్యమ ఖిల్లాలైన వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో పోటీ చేస్తుండటంతో.. కోదండరాంకు విజయావకాశాలు ఎక్కువగానే ఉంటాయనుకున్నారు. కానీ జరిగింది వేరు. ఓ మోస్తారు ఓట్లు సంపాదించి.. మూడో స్థానం దగ్గరే ఆగిపోయారు. మధ్యలో మల్లన్న కనుక లేకపోయి ఉంటే.. కోదండరాం సార్‌దే విజయం అంటున్నారు అంతా. 

తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానెల్‌తో నిత్యం ప్రభుత్వంపై పోరాడుతుండటం, కేసీఆర్‌ను ఎప్పటికప్పుడు నిప్పులతో కడిగేస్తుండటంతో జనాల్లో మల్లన్నకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. కోదండరాం విషయంలో అలా జరగడం లేదు. మల్లన్న మాస్ లీడర్ అయితే.. కోదండరాం క్లాస్ పొలిటిషియన్. మల్లన్న మాటల్లో వాడీ వేడీ సూటి పోట్లు ఉంటే.. కోదండరాం స్పీచ్‌ మేథావి మాటల్లా.. నీట్‌గా క్లాస్‌గా ఉంటాయి. అంత మంచి, మర్యాదకరమైన విమర్శలు ఇప్పటి జనాలను అంత ఈజీగా ఆకట్టుకోవు. మరోవైపు, గతంలో కోదండరాం కాంగ్రెస్‌తో జతకట్టడం.. టీడీపీతో చేతులు కలపడం కూడా ప్రజలకు నచ్చలేదంటున్నారు. కోదండరాం సార్ అంటే తెలంగాణ ఉద్యమ సమయంలోని సంఘటనలే గుర్తుకొస్తుంటాయి కానీ.. తెలంగాణ ఏర్పడ్డాక.. కేసీఆర్‌పై, ప్రజా సమస్యలపై ఆ స్థాయిలో పోరాడిన సందర్భాలు తక్కువనే అంటున్నారు. అందుకే, కోదండరాం రాజకీయం ఓటర్లను అంతలా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఆయన నిబద్దతను, చిత్తశుద్ధిని ఏ ఒక్కరూ తప్పుబట్టక పోవచ్చు. సార్ అంటే ఇప్పటికీ చాలా మందికి గౌరవమే. అందుకే, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకంటే కోదండరాంకే ఎక్కువ ఓట్లు వేసి మూడో స్థానంలో నిలబెట్టారు. మధ్యలో మల్లన్న లేకపోతే.. కోదండరామే ఎమ్మెల్సీ అయ్యే వారేమో...
 

By
en-us Political News

  
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో సంచలన నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించారు.
దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని. ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని, మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు.
సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా, అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు.
రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తీవ్రస్థాయిలో ఎండగట్టారు మంత్రి నారా లోకేష్. గత ఐదేళ్లలో సీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తూ జగన్ ఈ ప్రాంతానికి క్యాన్సర్ గడ్డలా మారారని విమర్శించారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదైంది. టీవీ డిబేట్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
నెల్లూరు జిల్లాలో నిర్వహించనున్న 2026 మహానాడును స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించాలని టీడీపీ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ సీనియర్ నేతలే కూటమి కట్టడం హాట్ టాపిక్‌గా మారింది.
గత కొంత కాలంగా ప్రదాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ లో పనితీరు సరిగా లేని వారికి ఉద్వాసన పలికి, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలే అంటున్నాయి. ఆ మేరకు ఇప్పటికే కసరత్తు పూర్తయ్యిందని కూడా చెబుతున్నారు.
కూటమిలో వైరుధ్యాలు లేవని, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నివాసాలకు వెళ్లి విలువైన సమయం గడపడమే ఇందుకు నిదర్శనమని అప్పసాని రాజేష్ అన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర మాటలను తాకట్టు పెట్టి, వారు విసిరే ఎంగిలి మెతుకుల కోసం కొందరు కిరాయి రాజకీయ విశ్లేషకులుగా మారారని నాగేశ్వర్ ఉద్దేశించి అప్పసాని రాజేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.