రోడ్డు ప్రమాదంలో నిర్మాత ఆర్బీ చౌదరి కన్నుమూత

Publish Date:May 5, 2026

Advertisement

 సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్నిఘటన చోటు చేసుకుంది.  . ప్రముఖ  నిర్మాత, సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత  ఆర్బీ చౌదరి మంగళవారం (మే 5)   రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు.  దశాబ్దాలుగా దక్షిణ భారత సినీ రంగానికి అపార సేవలు అందించిన ఈ దిగ్గజ నిర్మాత అకస్మాత్తుగా మృతి చెందడం సినీ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచేసింది.

రాజస్థాన్ లోని   పర్యాటక నగరంఉదయ్ పూర్  సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఆర్బీ చౌదరి  ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు  ప్రాథమిక సమాచారం. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. 

ఆర్.బి. చౌదరి పూర్తి పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. ఆయన స్థాపించిన  సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో 90కి పైగా చిత్రాలను నిర్మించి అనేక విజయాలు సాధించారు ఆర్బీ చౌదరి. మంచి కథలు, కుటుంబ విలువలు, భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇచ్చే చిత్రాలు నిర్మించడం ఆయన ప్రత్యేకత. కొత్త దర్శకులు, నటులకు అవకాశాలు ఇవ్వడంలో ఆయన ముందుండేవారు. చాలా మంది హీరోలు, దర్శకులు ఆయన బ్యానర్ ద్వారా సినీ రంగంలో గుర్తింపు పొందారు. 

సూర్యవంశం, సుస్వాగతం,రాజు, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, గాడ్ ఫాదర్ వంటి విజయవంతమైన సినిమాలను ఆర్బీ చౌదరి అందించారు.  ఆర్.బి. చౌదరికి నలుగురు కుమారులు ఉన్నారు. వారిలో ప్రముఖ తమిళ నటుడు జీవా సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు. కుటుంబ సభ్యులు కూడా సినీ రంగంతో అనుబంధం కొనసాగిస్తూ ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆర్.బి. చౌదరి మరణ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తూ   సంతాపం వ్యక్తం చేశారు.  దశాబ్దాల పాటు నాణ్యమైన సినిమాలు అందించిన నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటుగా తమ సంతాప సందేశాలలో పేర్కొన్నారు.  

By
en-us Political News

  
పలావు ఫ్లాగ్‌తో ప్రయాణిస్తున్న ఎంటీ సెట్టెబెల్లో అనే చమురు ట్యాంకర్ 24 మంది భారతీయ సిబ్బందితో గల్ఫ్ ఆఫ్ ఒమన్ గుండా వెళుతోంది. ఇరాన్ చమురు రవాణాపై అమెరికా విధించిన ఆంక్షలను ఈ నౌక ఉల్లంఘించిందనే నెపంతో, యూఎస్ సెంట్రల్ కమాండ్ కు చెందిన యుద్ధ విమానాలు ఈ నౌకపై దాడి జరిపాయి.
ఖమ్మంలో కీచకుడి దాడిలో గాయపడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు.
పశ్చిమ బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ (TMC) చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన రాజకీయ సంక్షోభంలో మునిగిపోయింది.
గతంలో సిట్ కేవలం సాధారణ అవినీతి నిరోధక చట్టాల కింద విచారణ జరపగా, ఈడీ ఎంట్రీ తో కథ కొత్త మలుపు తిరిగింది. మద్యం సిండికేట్లు, వివిధ షెల్ కంపెనీల ద్వారా సేకరించిన దాదాపు 3,500 కోట్ల రూపాయల భారీ ముడుపులు ఎక్కడెక్కడికి చేరాయి? హవాలా మార్గాల ద్వారా విదేశీ ఖాతాల్లోకి ఎలా తరలిపోయాయి? అనే మనీ ట్రయిల్ గుట్టును పూర్తిగా రట్టు చేసేందుకు ఈడీ సిద్ధమైంది.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సాధారణంగా తనదైన దూకుడు రాజకీయ శైలితో, వాడీవేడి వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ షాక్ ఇచ్చింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రూట్ ఎందుకు ఆలస్యం కానుంది? రియల్ ఎస్టేట్‌పై చూపే ప్రభావం, రాజకీయ దుమారం పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తనిఖీల్లో అర్హత లేని వ్యక్తులు వైద్య సేవలు అందిస్తున్నట్లు, సరైన అనుమతులు లేకుండానే చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఈ దాడుల్లో అధికారులు పలు క్లినిల్ లను పరిశీలించి, రికార్డులు, వైద్య సిబ్బంది అర్హతలు, చికిత్సల విధానాలపై సుదీర్ఘంగా విచారణ చేశారు.
ఇరాన్-అమెరికా ఉద్రిక్తతలతో హార్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. వాణిజ్య నౌకలు కనిపిస్తే పేల్చేస్తామన్న హెచ్చరికలతో గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు సంక్షోభంలో పడ్డాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వేదాంత 5 విడి విడి కంపెనీలుగా మారిన తర్వాత షేర్ హోల్డర్లకు వచ్చే డివిడెండ్ల పరిస్థితి ఏంటి? అల్యూమినియం, జింక్ వ్యాపారాల విభజనతో ఇన్వెస్టర్లకు లాభమా నష్టమా? మార్కెట్ నిపుణుల విశ్లేషణ పూర్తి వివరంగా ఇక్కడ చూడండి.
రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది.
రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఆర్‌ఐ ఎఫ్‌సీఎన్‌ఆర్ (FCNR-B) డిపాజిట్లపై హెడ్జింగ్ ఖర్చులను ఆర్‌బీఐ భరించనుండటంతో, బ్యాంకులు ఇప్పుడు 6% పైగా భారీ వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యూహం పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
దేశంలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్ నేపథ్యంలో ఎన్‌టీపీసీ, అదానీ పవర్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ వంటి ప్రముఖ పవర్ స్టాక్స్‌పై అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మెక్వారీ సంచలన నివేదికను విడుదల చేసింది. రేటింగ్స్, టార్గెట్ ధరల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
గత ఏడాది కాలంలో 280% పైగా పెరిగిన ఎంటీఏఆర్ టెక్నాలజీస్ (MTAR Tech) షేర్లు హఠాత్తుగా 9% కుప్పకూలాయి. అమెరికా క్లయింట్ బ్లూమ్ ఎనర్జీ మరియు OpenAI డేటా సెంటర్ ప్రాజెక్ట్ నిలిచిపోవడమే దీనికి కారణమా? పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.