ఇందిరమ్మను తలపించిన ప్రియాంక గాంధీ

Publish Date:May 8, 2023

Advertisement

ప్రియాంక వాద్రా తెలంగాణ పర్యటన విజయవంతమైంది. ఆమె మాట, ఆమె తీరు మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని తలపించాయి. ప్రియాంక ప్రసంగం యావత్తూ సూటిగా సుత్తి లేకుండా సాగింది. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, తప్పిదాలను నిర్మొహమాటంగా ఎండగట్టారు. సోమవారం (మే 8) హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ యువ సంఘర్షణ సభకు ప్రియాంక వాద్రా హాజరయ్యారు. ఆమె తన ప్రసంగాన్ని జై బోలో తెలంగాణ అంటూ ఆరంభించారు.  

ఎండలు మండి పోతున్నా సభకు ప్రేమాభిమానాలతో సభకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు అని మొదలు పెట్టారు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతా చారిని ప్రస్తావించి కీర్తించారు.  మిత్రులారా అంటూ తెలుగులో సంబోధించారు.  తెలంగాణ సాకారం కోసం అమరవీరులు, విద్యార్థుల త్యాగాలు ఎనలేనివని, నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఇక్కడివారు ఉద్యమించారని తెలిపారు. ఈ సభలో ప్రియాంక కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.యువత బలిదానాల వల్లే తెలంగాణ సాకారమైందన్నారు. దేశం కోసం తన కుటుంబం కూడా త్యాగాలు చేఃసిందని చెప్పారు.

తన నానమ్మ ఇందిరాగాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని చెప్పారు.  తమ కుటుంబానికి త్యాగాల విలువ తెలుసు అని ఆమె అన్నారు.  తెలంగాణ కోసం వేలాది మంది బలిదానం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం వారి త్యాగాలను ఏ మాత్రం గుర్తించడం లేదు అని ఆమె అన్నారు. ఇక తన తల్లి సోనియా తెలంగాణ ఇచ్చారనీ, సోనియా గాంధీ అధికారం కోరుకోకుండా తెలంగాణా ఇచ్చారని అన్నారు.    సోనియా గాంధీకి తెలంగాణా పట్ల ఉన్న ప్రేమ అభిమానానికి ఇది నిదర్శనం అని అన్నారు.అందుకే ఆమెను ఇక్కడి వారు తల్లిగా భావిస్తున్నారనీ గుర్తు చేసుకున్నారు. అత్యంత కఠినమైన తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకుని సోనియా తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేశారని ప్రియాంక వాద్రా చెప్పారు. అయితే తెలంగాణలో ప్రస్తుత కేసీఆర్ హయాంలో జాగీర్దార్ల పాలన సాగుతోందని విమర్శించారు.  ఇంటింటికీ ఉద్యోగం అన్న హామీని నెరవేర్చారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కాదని ప్రియాంకా వాద్రా అన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన టీఎస్ పీఎస్సీలో ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. ఉద్యోగాల కల్పన అటకెక్కించారు... నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదంటూ విరుచుకుపడ్డారు.  

రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్సిటీలు ఏర్పాటు కావడంలేదు కానీ, ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుతో విద్యార్థులను దోచుకుంటున్నారని విమర్శించారు. జనం తనను నానమ్మ ఇందిరలా ఉన్నావంటున్నారనీ, ఆ మాటలు నాలో బాధ్యతను పెంచుతున్నాయనీ అన్నారు.  తెలంగాణ ప్రజలు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలి. ఎన్నికల వేళ విజ్ఞతతో వ్యవహరించకపోతే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనని చెప్పారు. ఈ సభలో ఆమె యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని చెప్పిన ప్రియాంక గాంధీ.. అలా నెరవేర్చకపోతే కాంగ్రెస్ ను పక్కన పెట్టేయండి.. తనతో ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరినీ నిలదీయండి అని ప్రియాంకా గాంధీ అన్నారు.  ఉద్యోగ నియామకాల కోసం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, నిరుద్యోగులకు నెలకు రూ.4 వేల భృతి అందిస్తాం, యువతీయువకుల కోసం ప్రత్యేకంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామన్నారు.

తెలంగాణా అన్నది నేల కాదని తల్లి అని ఆమె అన్నారు. తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం చూసేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని ప్రియాంకా గాంధీ అన్నారు. తాను ఇందిరమ్మ మనవరాలిననీ తప్పుడు హామీలు ఇవ్వనని  ప్రియాంక గాంధీ అన్నారు.  తన ప్రసంగంలో అనేకసార్లు ఇందిరమ్మను ప్రియాంక తలచుకున్నారు. ప్రియాంక ప్రసంగానికి జనం నుంచి మంచి స్పందన వచ్చింది.   మొత్తం మీద ప్రియాంక వాద్రా హైదరాబాద్ సభ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.