యూపీలో ప్రియాంక ఫస్ట్.. 'ఉన్నవో' అత్యాచార బాధితురాలి తల్లికి టికెట్
Publish Date:Jan 13, 2022
Advertisement
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ట్యాలీ సింగల్ డిజిట్ దాటదని, ఇప్పుడున్న ఏడు సీట్లు గెలవడం కూడా కష్టమే అని సర్వేలు చెపుతున్నాయి. అయితే , పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా,ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే పట్టుదలతో మెడకు సాగుతున్నారు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా, పటు వదలని విక్రమార్కునిలా పోరాట పటిమను చూపుతున్నారు. అందుకే గెలుపు ఓటములు ఎలా ఉన్నా, ప్రియాకా వాద్రా పట్టుదలను మాత్రంఆమె రాజకీయ ప్రాథేయర్థులు కూడా మెచ్చుకుంటున్నారు. నిజానికి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి, బీజేపీ, ఎస్పీ, బీఎస్పీల కంటే కాంగ్రెస్ పార్టీ అనేక విషయాల్లో ఒకడుగు ముందే ఉంది. ఇతర పార్టీ ఏవీ ఎన్నికల ప్రచారం గురించి ఆలోచించక ముందే ప్రియాంక పాదయాత్రలతో ప్రచారం ప్రారంభించారు. ఆడపిల్లలకు స్కూటీలు, మహాళలకు మరొకటి ఇలా మహిళల ను ఆకట్టుకునే విధంగా మినీ మ్యానిఫెస్టో విడుదల చేశారు. మహిళలకు 40 శాతం టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు.ఇక ఇప్పుడు ఎన్నికల షెడ్యూలు విడుదలై న నేపథ్యంలో డిజిటల్ ప్రచారానికి కూడా ప్రియాంకే .. ముందుగా శ్రీకారం చుట్టారు. ఇక ఇప్పుడు అభ్యర్థుల ప్రకటనలోనూ ప్రియనక ఫస్ట్ ఉన్నారు. ఆమె ఈరోజు (గురువారం)ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశాను .తొలి జాబితాలో మొత్తం 125 మంది అభ్యర్థులను ప్రకటించగా, వీరిలో 50 మంది మహిళలు, 50 మంది యువత ఉన్నారు. కాగా, ఈ సందర్భంగా ప్రియాంక మహిళలకు 40 శాతం, యువతకు 40 శాతం స్థానాలను ఇచ్చినట్లు తెలిపారు. ఈ చరిత్రాత్మక చర్య ద్వారా రాష్ట్రంలో నూతన తరహా రాజకీయాలను తీసుకురాగలమని ఆశిస్తున్నట్లు చెప్పారు. నిజం రాజకీయాలు నేరమయమవుతున్ననేపధ్యంలో మహిళలు, యువతకు పెద్ద పీట వేయడం నిజంగా స్వాగతించదగిన పరిణామంగానే పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే, ఉన్నావ్ శాసన సభ నియోజకవర్గం నుంచి ఓ అత్యాచార బాధితురాలి తల్లిని పోటీలో నిలుపుతున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించిన పూనం పాండేను షాజహాన్ పూర్ నుంచి పోటీ చేయిస్తున్నట్లు తెలిపారు. ఉత్తర ప్రదేశ్‌లో న్యాయం కోసం పోరాడినవారిని తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించామని చెప్పారు. అటువంటివారు ముందుకు వచ్చి, రాష్ట్రంలో అధికారంలో భాగస్వాములు కావాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? అని మీడియా అడిగినపుడు ప్రియాంక గాంధీ వాద్రా సమాధానం చెప్పలేదు. ఈ ఎన్నికల్లో నెగెటివ్ ప్రచారం చేయబోమని, ఉత్తర ప్రదేశ్ భవిష్యత్తు కోసం పాజిటివ్ ప్రచారం చేస్తామని అన్నారు. మహిళలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నవో అత్యాచారం కేసు యూపీ ఎన్నికల్లో మరోసారి చర్చనీయాంశంగా మారనుంది. యూపీలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్నవో అత్యాచార బాధితురాలి తల్లికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది.కుల్దీప్ సింగ్ సెంగార్ ఓ బాలికపై అత్యాచారం చేశాడు.ఈ ఘటనలో నిందితుడైన బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ జైలు పాలయ్యారు. అత్యాచార బాధిత బాలికను హతమార్చేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుట్ర పన్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధిత బాలికకు సుప్రీం అండగా నిలిచింది. 403 స్థానాలున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.
http://www.teluguone.com/news/content/priyanka-gandhi-active-role-in-up-politics-39-130178.html





