శ్రీరాముడిపై వ్యాఖ్యల వివాదం: నటుడు ప్రకాష్ రాజ్‌పై తిరుపతి కోర్టులో క్రిమినల్ కేసు!

Publish Date:Jun 30, 2026

Advertisement

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి   వివాదంలో చిక్కుకున్నారు. కేరళ సాహిత్య ఉత్సవం  వేదికగా ఆయన శ్రీరాముడు, లక్ష్మణుడు, పవిత్ర గ్రంథం రామాయణంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి, తిరుమల తిరుపతి దేవస్థానం  పాలకమండలి సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి తిరుపతిలోని 4వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో ప్రకాష్ రాజ్‌పై ప్రైవేట్ క్రిమినల్ ఫిర్యాదు దాఖలు చేశారు. దాంతో న్యాయస్థానం ఈ కేసును విచారణకు స్వీకరించింది.

ఈ వివాదానికి  కారణం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాటలే. రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతీయులని, వాళ్లు దక్షిణాదిపై దాడి చేశారంటూ ప్రకాశ్ రాజ్  వ్యాఖ్యానించారు.  వారు దక్షిణాదికి వచ్చి రావణుడి తోటలోని పండ్లను దొంగిలించారంటూ రామాయణాన్ని హాస్యాస్పదంగా, కించపరిచేలా చిత్రీకరించారని భానుప్రకాశ్రెడ్డి తన ఫిర్యాదులో  పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 

కాగా  ఏప్రిల్ నెలలోనే టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తన న్యాయవాది కె. అజయ్ కుమార్ ద్వారా ప్రకాష్ రాజ్‌కు లీగల్ నోటీసులు పంపించారు. తన అనుచిత వ్యాఖ్యలపై కోట్లాది మంది హిందూ సమాజానికి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో  100 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తామని ఆ నోటీసులో హెచ్చరించారు. అయితే, ఈ లీగల్ నోటీసులపై ప్రకాష్ రాజ్   స్పందించక పోవడంతో.. భానుప్రకాశ్ రెడ్డి ఇప్పుడు  తిరుపతి న్యాయస్థానాన్ని ఆశ్రయించి క్రిమినల్ కేసు దాఖలు చేశారు.

ఫిర్యాదుదారు తన పిటిషన్‌లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు మత విద్వేషాలను, ప్రాంతీయ అసమానతలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆరోపించారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఆధారాలు లేని ఆర్య-ద్రావిడ సిద్ధాంతాన్ని తెరపైకి తెస్తూ భారత సాంస్కృతిక, మత ఐక్యతను దెబ్బతీసేందుకు నటుడు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని ఆరోపించారు.  

మరోవైపు ప్రకాష్ రాజ్‌కు చట్టపరమైన సమస్యలు ఒక్క తిరుపతితోనే ఆగడం లేదు. బెంగళూరు కోర్టులో నడుస్తున్న ఓటరు గుర్తింపు కార్డుల  అక్రమాల కేసులో ఆయనకు ఇప్పటికే వరుసగా మూడు సార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఒకే పేరుతో బహుళ ఓటర్ ఐడీలు కలిగి ఉన్నారనే ప్రైవేట్ పిటిషన్ ఆధారంగా ఆ విచారణ సాగుతోంది. కోర్టు సమన్లకు హాజరుకాకపోవడంతో జూన్ 12న బెంగళూరు కోర్టు మూడోసారి అరెస్టు వారెంట్ జారీ చేస్తూ విచారణను జులై 25కు వాయిదా వేసింది.  

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగ సమస్యలు మరింత జటిలంగా మారాయని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ఝార్ఖండ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక అసాధారణ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక వైఖరి
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
భారతదేశ గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు, పేదరిక నిర్మూలనకు అత్యంత కీలకమైన సాధనంగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ
రౌడీషీటర్ కేసు చుట్టూ తిరుగుతున్న ప్రస్తుత పరిణామాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి.
తన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందనీ, ఈ కేసును బలవంతంగా ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నాని అన్నారు. ఒక పోలీసు అధికారి అయి ఉండి, తోటి విభాగాల నుంచే తనకు ప్రాణభయం ఉందంటూ ఆక్ష్న న్యాయస్థానంలో మొరపెట్టుకోవడం సంచలనం రేపింది.
యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు.
లారీలు ఢీకొన్న వేగానికి వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో రెండు లారీల డ్రైవర్లు, క్లీనర్లు సజీవదహనమయ్యారు.
నెట్‌వర్క్ ఆసుపత్రుల నుండి క్యాష్‌లెస్ సౌకర్యాన్ని పూర్తిగా ఉపసంహరించుకున్నారు. అయితే, జూన్ 30, అంతకంటే ముందు ఆసుపత్రులలో చేరిన పాత రోగులకు మాత్రం వారు డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ పథకం కింద చికిత్స కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. జూలై 1 నుండి కొత్తగా ఎలాంటి అడ్మిషన్లను అనుమతించవద్దని అన్ని అనుబంధ ఆసుపత్రులకు, యూనిట్ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన మాధవీలత.. ఇప్పుడు క్రీడా రంగంలో ప్రతిభ చాటారు.
బస్సు అతి వేగంగా వెడుతుండటంతో.. ప్రమాద తీవ్రతకు ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగి చూస్తుండగానే బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు సజీవ దహనమయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.