అదిగో.. హోదా వచ్చేస్తోంది(ట)!

Publish Date:Feb 5, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఒక సారి కాదు, వందసార్లు స్పష్టం చేసింది. అంతే కాదు హోదా ముగిసిన అధ్యాయం, క్లోస్డ్ చాప్టర్ అని కుండ బద్దలు కొట్టేసింది. మళ్ళీ  తెరిచే ప్రశ్నే లేదని ఒకటికి పది సార్లు పార్లమెంట్ వేదికగానే ప్రకటించేసింది. అయినా హోదా హామీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గడచిన నాలుగు సంవత్సరాలలో  కేంద్రాన్ని గట్టిగా అడిగే ‘సాహసం’ చేయలేక పోయింది. 

 అయితే నాలుగేళ్ళ తర్వాత ఇప్పడు వైసీపీ ఎంపీలు  కళ్ళు తెరిచి తగుదునమ్మా అంటూ ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు  పెడతామని ప్రకటించారు. అయితే, వైసీపీ ఎంపీలకు ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు  ప్రత్యేక హోదా ఎందుకు గుర్తుకొచ్చింది? ఎందుకు  వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా ప్రస్తావన చేస్తున్నారు? అంటే, జరగరానిది ఏదో జరగనుందనే ఉప్పందడం వల్లనే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  హోదా అస్త్రాన్ని పైకి తెచ్చారని వైసీపీ నేతలే అనుమానిస్తున్నారు. 

ఓ వంక కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అన్నింటినీ పక్కన పెట్టినా, బడ్జెట్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఉపేక్షించినా, పూర్తిగా విస్మరించినా, ఒక్కటంటే ఒక్కటైనా మేజర్ ప్రాజెక్ట్ ఏదీ ఏపీకి ప్రకటించక పోయినా, ఏమీ చేయలేక చేతులెత్తేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం, విపక్షాల నుంచి వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు హోదా డ్రామాను తెర మీదకు తెచ్చిందని స్వపక్షీయులే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్ని విధాలా అన్యాయమే జరిగింది. విభజ హామీల ఉసెత్తలేదు. ఏ రంగానికి  కనీస కేటాయింపులు లేవు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  అంతగా వాయిస్ లేని ముగ్గురు ఎంపీలను  (రంగయ్య, రెడ్డప్ప, పిల్లి సుభాష్’)  మీడియా ముందుకు పంపారు. 

పార్లమెంట్‌లో సైలెంట్ గా ఉండి.. బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా కనీసం మద్దతు కూడా ఇవ్వని వైసీపీ ఎంపీలు  మీడియా ముందుకు వచ్చి  విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అన్ని అంశాలపై ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లు ప్రవేశపెడతామని గంభీర ప్రకటన చేశారు. ఈ ముగ్గరు ఎంపీల మాటను ప్రభుత్వం సీరియస్ గా తీసు కుంటుందనే నమ్మకం ఇతరులకే కాదు, కనీసం ఆ  ప్రకటన చేసినముగ్గురు ఎంపీలకూ కూడా లేదని వేరే చెప్పనక్కర్లేదని అంటున్నారు. నిజానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  బడ్జెట్ ప్రసంగం ముగిసీ ముగియక ముందే, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి  ‘బడ్జెట్ బ్రహ్మాండం’ అంటూ కితాబు నిచ్చారు. కానీ  ఇప్పడు వైసీపీ ఎంపీలు మాత్రం మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదని.. ఏం అడిగినా పట్టించుకోవడం లేదని చెప్పుకొస్తున్నారు. అలాగే  ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు తెస్తామని, ఉత్తుత్తి ప్రకటనలు గట్టిగా చేస్తున్నారు. అయితే  వైసీపీ ఎంపీలు తమను తాము మోసం చేసుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నామని అనుకుంటున్నారు కావచ్చును. కానీ, ప్రజలు మరీ అంత అమాయకులు కాదని అంటున్నారు.  

నిజానికి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 2019 ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే హోదా విషయంలో చేతులెత్తేశారు. కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో  చేతులెత్తి వేడుకోవడం మినహాయించి చేసేదేమీ లేదని చెప్పేశారు. ఆ తర్వాత గడచిన నాలుగు సంవత్సరాలలో హోదా కోసం చేసిన గట్టి ప్రయత్నం ఏదీ లేదు. కానీ  ఇప్పడు  మెల్లిగా హోదాకోసం ప్రైవేటు బిల్లు పెడతామని ఎంపీలు చెప్పుకోవడం ఆత్మ వంచన తప్ప మరొకటి కాదు. ఆవిషయం వారికీ తెలుసు ... ప్రజలకు తెలుసు.

By
en-us Political News

  
హైదరాబాద్ నగరం సైబర్ నేరాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న తరుణంలో, అమాయకులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న మోసాలు కలకలం రేపుతున్నాయి
బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.