ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ కు ప్రధానమంత్రి పురస్కారం
Publish Date:Apr 21, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెడిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ(ఏపీఎస్ డబ్ల్యేఆర్ఇఐఎస్) సెక్రటరీ, ఐఏఎస్ అధికారి ప్రసన్న వెంకటేణ్ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రధానమంత్రి పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి సంబంధించి ఈ పురస్కారాన్ని ఆయన ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అందుకున్నారు. సోమవారం (ఏప్రిల్ 21) 17వ సివిల్ సర్వీస్ డే సంధర్బంగా డిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన వికసిత్ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రధాని నరేందర మోడీ.. పాలనలో ఉత్తమ పనితీరు కనబరిచిన ఐఏఎస్ లకు ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రసన్న వెంకటేష్ జనవరి 2022 నుంచి జూలై 2024 వరకు ఏలూరు జిల్లాకు తొలి కలెకర్ట్ గా పనిచేశారు. ఆ సమయంలో ఆయన ప్రజలకు అందించిన సేవలకు గాను ప్రభుత్వం ఈ అవార్డు అందజేసింది. ఏలూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన సమయంలో ప్రసన్న వెంకటేష్ ప్రభుత్వ పథకాలను విస్సతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల అమలులో భాగంగా మహిళలు, బాలికల్లో రక్తహీనత నివారణకు విశేష కృషి చేశారు. సామాజిక బాధ్యత చొరవ కింద జిల్లాలోని ఏజెన్సీ మండలాల్లో ‘అక్షజ’ అనే కార్యక్రమంతో గర్భిణీలు, ప్రసూతి మహిళల ఆరోగ్య సంరక్షణకు చర్యలు తీసుకుననారు. ఆయన కృషికి గుర్తింపుగా ప్రధాన మంత్రి పురస్కారానికి ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా పది జిల్లాల కలెక్టర్లకు ప్రధాని చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేశారు. ా పది మందితో ప్రసనన వెంకటేష్ ఒకరు. పురస్కారం అందుకున్న సందర్భంగా ప్రసన్న కుమార్ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిచేందుకు శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానన్నారు.
http://www.teluguone.com/news/content/primeminister-award-to-ias-prasanna-venkatesh-25-196684.html





