ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ చేరుకున్నారు. మూడోసారి ప్రధాని అయ్యాక ఆయన రెండోసారి ఎపిలో పర్యటిస్తున్నారు. ఆయన విశాఖకు చేరుకోవడం చర్చనీయాంశమైంది. కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. సిరిపురం చౌరస్తానుంచి ఏయు ఇంజినీరింగ్ కాలేజివరకు ర్యాలీ నిర్వహించారు. ఒకే వాహనంపై ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటిసిఎం పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళ్లడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prime-minister-reached-visakhapatnam-39-191030.html
ఫార్ములా ఈ రేస్ కేసులో తన తప్పేమీ లేదనీ, తాను సుద్దపూసననీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు ఎంత గట్టిగా చెబుతున్నా.. వేళ్లన్నీ మాత్రం ఆయనవైపే చూపుతున్నాయి.
తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్ సూపరింటెండెంట్ రవి కుమార్ వెల్లడించారు. క్షతగాత్రులందరికీ చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
తిరుపతిలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం ( జనవరి 9) తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రుయా, స్విమ్స్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న తొక్కిసలాట బాధితులను పరామర్శిస్తారు.
అనంతపురంలో గురువారం (జనవరి 9) సాయంత్రం జరగాల్సిన డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యింది. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మరణించడంతో ఈ ఈవెంట్ ను బాలకృష్ణ రద్దు చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో బుధవారం (జనవరి 8) రాత్రి పొద్దుపోయిన తరువాత భూమి కంపించింది. ఆ తరువాత మరికొన్ని గంటలకు అంటు గురువారం (జనవరి 9) తెల్లవారు జామున మరో మారు భూ ప్రకంపనలు సంభవించాయి.
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. మరో 48 మంది గాయపడ్డారు. ఇలా ఉండగా తిరుపతి తొక్కిసలాట సంఘటనపై అధికారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో అధికారులు డీఎస్పీ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట చోటు చేసుకుందని పేర్కొన్నారు.
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వేళ విషాదం చోటు చేసుకుంది. వైకుంఠద్వార దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఫార్ములా-ఈ కార్ కేసులో ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన కేటీఆర్ కు ఒకే సమయంలో మోదం; ఖేదం కలిగేలా కోర్టు తీర్పు వెలువరించింది.
ఇప్పటికే ఫార్ములా ఈ రేసు కేసులో చిక్కులు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావుపై మరో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఔటర్ రింగు రోడ్డు టెంటర్లలో అవినీతికి సంబంధించింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఏసీబీ విచారణకు తన వెంట న్యాయవాదిని అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసుకున్న లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు అందుకు నో చెప్పింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ న్యాయవ్యాదులను అనుమతించకపోవడంపై బుధవారం హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. న్యాయవాదులను అనుమతించకపోవడానికి కారణమేమిటని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది
ఎన్నికల వ్యూహకర్త, జనసూరజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ మరోసారి ఆస్పత్రి పాలయ్యారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా ఆయన ఇటీవల ఆమరణ నిరాహార దీక్ష చచే పట్టారు. పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు. అయితే ఆ దీక్ష కారణంగా ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉందన్న సమాచారం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడికి భద్రత పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జడ్ ప్లస్ క్యాటగరి భద్రత ఉన్న చంద్రబాబు సెక్యూరిటీలోకి కొత్తగా కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చి చేరాయి.