ప్రధాని మోదీని కలిసినప్పుడు విద్యార్థులు తల వంచాలనడం విచాకరం : ఒవైసీ
Publish Date:Aug 9, 2026
Advertisement
ప్రధాని ఐఐటీ ఢిల్లీ పర్యటన ఘటనపై అసదుద్దీన్ విమర్శలు..! “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటీ ఢిల్లీ పర్య టన సందర్భంగా చోటు చేసుకున్నట్లు వచ్చిన నివేదికలపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ప్రధాన మంత్రి చేతుల మీదుగా పతకాలు స్వీకరించే సమయంలో విద్యార్థులను తలవంచమని, వేద మంత్రాల పఠనం సమయంలో నిలబడమని సూచించినట్లు వచ్చిన వార్తలను ఆయన ప్రస్తావించారు. ఈ అంశంపై మీడియాతో ఒవైసీ మాట్లాడుతూ.. విద్యార్థులు, విద్యా సంస్థలు పాటించాల్సిన రాజ్యాంగ విలువలపై ప్రశ్నలు లేవనెత్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A(H) ప్రతి పౌరుడిలో శాస్త్రీయ దృక్పథం, మానవ తావాదం, విచారణా స్ఫూర్తిని పెంపొందించా ల్సిన బాధ్యతను పేర్కొం టుందని గుర్తుచేశారు. “శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాల్సిన ఆర్టికల్ 51A(H)ను చెత్తబుట్టలో పడేశారు” అని ఒవైసీ వ్యాఖ్యానిం చారు.అదేవిధంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 28ను ప్రస్తావిస్తూ.. ప్రభుత్వ నిధులతో పూర్తిగా నిర్వహించే విద్యాసంస్థల్లో మత బోధనకు సంబంధించి రాజ్యాంగం స్పష్టమైన నిబంధనలు కలిగి ఉందని పేర్కొన్నారు. విద్యాసంస్థలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయా ల్సిన అవసరం ఉందన్నారు.“ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే జాతీయ ప్రయోజనం” అని విద్యార్థులు గుర్తుంచు కోవాలని ఒవైసీ సూచించారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు ప్రశ్నించే హక్కు, శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా స్వేచ్ఛ, రాజ్యాంగ విలువలు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ఒక విద్యాసంస్థలో విద్యార్థు లను నిర్దిష్ట సూచనలు పాటించమని కోరడం ఈ విలువలకు అనుగుణంగా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. విద్యాసంస్థలు రాజకీయ, మతపరమైన ప్రభావాలకు అతీతంగా శాస్త్రీయ ఆలోచనలను ప్రోత్సహించే వాతావ రణాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని ఒవైసీ అభిప్రాయపడ్డారు. Prime Minister Modi, MP Asaduddin Owaisi, PM visit to IIT Delhi, MIM, IIT Students
http://www.teluguone.com/news/content/prime-minister-modi-36-228459.html





