Publish Date:Jul 25, 2025
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పర్యాటక రంగ ప్రగతిని ఇస్తున్న అత్యధిక ప్రాముఖ్యతకు గుర్తింపు దక్కింది. ఏపీ పర్యాటక శాఖకు అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. 10వ అంతర్జాతీయ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు(ఐటీసీటీఏ) సంస్థ ఏపీలో చేపడుతున్న పర్యాటక ప్రాజెక్టులు.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నిశితంగా పరిశీలించి.. ఎమర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డు ను రాష్ట్రానికి ఇచ్చింది. శనివారం(జులై 26) ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును పర్యాటక అభివృద్ది కార్పొరేషన్(ఏపీటీడీసీ) మేనేజింగ్ డైరెక్టర్, ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి అందించనుంది. ఏపీ టీడీసీ ఎండీ అమ్రపాలి ఆ విషయాన్ని స్వయంగా సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత విస్తారమైన తీర ప్రాంతం ఉన్న రోండో రాష్ట్రం. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాన్ని వినియోగించుకుని.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు తెలుగుదేశం ప్రభుత్వం నడుంబిగించింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేసింది. అఖండ గోదావరి ప్రాజెక్టు ద్వారా.. రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించింది.
అదే సమయంలో సీఎం చంద్రబాబు పర్యాటక శాఖకు ‘పరిశ్రమ’ హోదాకల్పించారు. తద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగం ద్వారా.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో పాటు.. ఆదాయం కూడా పెరుగుతుందని అంచనా వేశారు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పర్యాటక రంగానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే వినూత్న విధానాలు, కొత్త పాలసీలు, విప్లవాత్మక సంస్కరణలకు ఆయన పెద్దపీట వేస్తున్నారు.
వీటన్నింటిని గమనించిన ఇంటర్నేషనల్ టూరిజం కాన్ క్లేవ్ అండ్ ట్రావెల్ అవార్డు( సంస్థ.. ఈ సారి మర్జింగ్ కోస్టల్ అండ్ హెరి టేజ్ అవార్డుకు ఏపీని ఎంపిక చేసింది. ఈ అవార్డుతో రాష్ట్ర పర్యాటకం మరింత పుంజుకునేందుకు.. విదేశీ పర్యాటకలు కూడా రాష్ట్రానికి మరింత పెరిగేందుకు అవకాశం ఉందని ఆమ్రపాలి తన పోస్టులో పేర్కొన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prestiegious-award-to-ap-tourism-department-25-202722.html
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.