బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన తప్పదా?
Publish Date:Mar 28, 2022
Advertisement
పశ్చిమ బెంగాల్’లో తృణమూల్ పాలనలో శాంతి భద్రతల పరిస్థితి దిన దిన ప్రవర్థమానంగా దిగజారి పోతోంది. దేశంలో ఇప్పుడున్న 29 రాష్ట్ర్లాలలో రాష్ట్రపతి పాలన విధించడానికి అన్ని విధాలా అర్హత, యోగ్యత ఉన రాష్ట్రం ఏదైనా ఉందంటే, అది, మమతా బెనర్జీ ఏలుబడిలోని పశ్చిం బెంగాల్ ఒక్కటే. నిజానికి, గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కూడా రాష్ట్రంలో రాజకీయ హత్యలు నిత్య కృత్యంగా సాగుతున్నాయి. ప్రతి పక్ష బీజేపీ ఎప్పటినుంచో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విదంచాలని కోరుతోంది. నిజానికి బెంగాల్ లో ఎన్నికల అనంతర హింస తాలూకు ఘటనల అంశం చివరకు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. బాధిత కుటుంబాలు దాఖలు చేసిన పిటీషన్’లోనూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బాధితులు కోర్టును కోరారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో, కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్’లో రాష్ట్రపతి పాలన విధించేందుకు, రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా, మరో రెండు మూడు మాసాల్లో బెంగాల్’ లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్ర హోమ్ శాఖ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి, మమతా బెనర్జీకి ముందు నుంచి కూడా బెంగాల్’ హింసకు మారుపేరుగా నిలిచింది. అయితే, గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, చెలరేగిన హింస, రాజకీయ హత్యల పరంపర,రాష్ట్రపతి పాలన అనివార్యతను నొక్కి చెపుతోంది. ఇంకా ఈనాటికీ కొనసాగుతున్న రాజాకీయ హత్యాల పరంపరలో కొద్ది రోజుల క్రితం, తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. భాదు షేక్ అనుచరులు, ఆయన ప్రత్యర్ధుల ఇళ్ళకు నిప్పు పెట్టారు. పిల్లా పాపలతో సహ, ఎనిమిది మంది సజీవ దహన మయ్యారు.నిజానికి, బెంగాల్లో నిత్యకృత్యంగా జరుగుతున్న హింసకు ఇది పరాకాష్ట కావచ్చును, కానీ, మమతా బెనర్జీ పాలనలో రక్తం చిందని రోజు లేదని, రాజకీయ విశ్లేషకులు పలు సందర్భాలలో పేర్కొన్నారు ఇలాంటి హేయమైన నేరాలు నిత్యకృత్యంగా జరుగుతూనే ఉన్నాయి. గత మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి, రాష్ట్రంలో 37 మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు. గత ఐదేళ్లలో మొత్తం 166 మంది బిజెపి కార్యకర్తలుహత్యకు గురయ్యారని, పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ పేర్కొన్నారు.నిజానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని, అంటున్నారు. మరోవంక, బీర్భూమ్ మారణకాండ నేపధ్యంలో రాష్ట్ర గవర్నర్ జగదీష్ ధన్ ఖర్’ సైతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆవేదన వ్యక్త పరిచారు. ఇది ‘అత్యంత భయంకర, అనాగరిక, అప్రజాస్వామిక చర్య’ అని పేర్కొంటూ, గవర్నర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవంక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ సంఘటనపై వెంటనే నివేదిక పంపమని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఓ వంక రాజకీయ హత్యలు హింస కొనసాగుతుంటే, మరో వంక, సిటిజెన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్ (సీఏఏ) అమలులో, రాష్ర్ా ప్రభుత్వం సృష్టిస్తున్న అవరోధాలు, బంగ్లాదేశ్’ నుంచి అక్రమంగా వచ్చి రాష్ట్రంలో స్థిరపడిన రొహింగ్యాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, తద్వారా తలెత్తుతున్న సమస్యల విషయంగానూ, కేంద్ర హోమ్ శాఖ సమాచారన్ని సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపధ్యంలో పశ్చిమ బెంగాల్’ లో రాష్ట్రపతి పాలన అనివార్యంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/president-rule-chances-in-west-bengal-39-133610.html





