అతి చేశాను.. విచారణలో ప్రశ్న రావణ్ కన్ఫెషన్.!
Publish Date:Sep 21, 2026
Advertisement
డిజిటల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వ్యవహరించి, ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు వారిలో పశ్చాత్తాపం కలిగేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వివాదాస్పద యూట్యూబర్ బాచలకురి జోసెఫ్, అలియాస్ ప్రశ్న రావణ్ తాను సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించడమే ఇందుకు నిదర్శనం. మతపరమైన మనోభావాలను గాయపరచడం, దేవుళ్లను దూషించడం, రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఏపీ పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వ్యాఖ్యల తీవ్రతను బట్టి అధికారులు ఈ కేసులో కఠినమైన చట్టాలను ప్రయోగించారు. ముఖ్యంగా దేశ భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాల కింద ఉపా చట్టంతో పాటు దేశద్రోహ సెక్షన్లను కూడా అతడిపై నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అనుకున్న అతడికి, చట్టం చేతికి చిక్కిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా అర్థమయ్యాయి. పోలీస్ కస్టడీలో భాగంగా అధికారులు జరిపిన విచారణలో ప్రశ్న రావణ్ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. తాను గతంలో చేసిన తప్పులకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అనేక సున్నితమైన అంశాలపై తాను అనవసరంగా అతిగా స్పందించానని, దానివల్ల అనూహ్య సమస్యలను కొనితెచ్చుకున్నానని విచారణాధికారుల ఎదుట అతడు వాపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇలాంటి వివాదాస్పద ధోరణులకు దూరంగా ఉండాల్సిందని, ఈ పరిణామాలు తన జీవితంలో పెద్ద గుణపాఠం నేర్పాయని ప్రశ్నరావణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దేవుళ్లపై అభ్యంతకరమైన వీడియోలపై పోలీసుల ప్రశ్నలకు.. అతడు చేశానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలా విషయాల జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని ప్రశ్న రావణ్ కన్ఫెస్ అయినట్లు సమాచారం. అయితే.. ఈ విచారణలో భాగంగా అధికారులు అతడి ఆర్థిక లావాదేవీలు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనపై కూపీ లాగారు. ఛానెల్ ఆదాయం, బ్యాంకు లావాదేవీల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలలో చాలా వాటికి అతడు సరైన సమాదానం ఇవ్వలేదని తెలుస్తోంది. [Prashna Ravan, Bachalakuri Joseph, AP Police UAPA Cases, YouTube controversial videos,Social Media Misuse, Confess]
http://www.teluguone.com/news/content/prashna-ravan-25-232030.html




