అతి చేశాను.. విచారణలో ప్రశ్న రావణ్ కన్ఫెషన్.!

Publish Date:Sep 21, 2026

Advertisement

డిజిటల్ మీడియా వేదికగా ఇష్టానుసారంగా వ్యవహరించి, ప్రజల మనోభావాలను దెబ్బతీసే వారిపై పోలీసులు తీసుకుంటున్న చర్యలు వారిలో పశ్చాత్తాపం కలిగేలా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన వివాదాస్పద యూట్యూబర్ బాచలకురి జోసెఫ్, అలియాస్  ప్రశ్న రావణ్ తాను సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలకు పశ్చాత్తాపం ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.  మతపరమైన మనోభావాలను గాయపరచడం, దేవుళ్లను దూషించడం,  రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 

  వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా ఏపీ పోలీసులు ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడి వ్యాఖ్యల తీవ్రతను బట్టి అధికారులు ఈ కేసులో కఠినమైన చట్టాలను ప్రయోగించారు. ముఖ్యంగా దేశ భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించే అంశాల కింద ఉపా  చట్టంతో పాటు దేశద్రోహ సెక్షన్లను కూడా అతడిపై నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడవచ్చు అనుకున్న అతడికి, చట్టం చేతికి చిక్కిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏమిటో స్పష్టంగా అర్థమయ్యాయి.

పోలీస్ కస్టడీలో భాగంగా అధికారులు జరిపిన  విచారణలో ప్రశ్న రావణ్ కన్నీటి పర్యంతమైనట్లు సమాచారం. తాను గతంలో చేసిన తప్పులకు తీవ్రంగా పశ్చాత్తాపపడుతున్నట్లు అతడు అంగీకరించినట్లు తెలుస్తోంది. అనేక సున్నితమైన అంశాలపై తాను అనవసరంగా అతిగా స్పందించానని, దానివల్ల అనూహ్య సమస్యలను కొనితెచ్చుకున్నానని విచారణాధికారుల ఎదుట అతడు వాపోయినట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఇలాంటి వివాదాస్పద ధోరణులకు దూరంగా ఉండాల్సిందని, ఈ పరిణామాలు తన జీవితంలో పెద్ద గుణపాఠం నేర్పాయని ప్రశ్నరావణ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా దేవుళ్లపై   అభ్యంతకరమైన వీడియోలపై పోలీసుల ప్రశ్నలకు.. అతడు చేశానంటూ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అసలా విషయాల జోలికి వెళ్లకుండా ఉండాల్సిందని ప్రశ్న రావణ్ కన్ఫెస్ అయినట్లు సమాచారం.   అయితే..  ఈ విచారణలో భాగంగా అధికారులు అతడి ఆర్థిక లావాదేవీలు, యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చిన సంపాదనపై కూపీ లాగారు. ఛానెల్ ఆదాయం,  బ్యాంకు లావాదేవీల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలలో చాలా వాటికి అతడు సరైన సమాదానం ఇవ్వలేదని తెలుస్తోంది.   

[Prashna Ravan, Bachalakuri Joseph, AP Police UAPA Cases, YouTube controversial videos,Social Media Misuse, Confess]

By
en-us Political News

  
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.