బీటీ వ‌ర్సెస్ యూటీ.. కేసీఆర్‌కు పీకే స‌ర్వే షాకింగ్‌..

Publish Date:Mar 8, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఊహించినట్లే జరుగుతోంది. ముచ్చటగా మూడో సారి సీఎం పీఠం ఎక్కేందుకు ఆయన చేసే ప్రయత్నాలకు గతంలో ఆయన వెంట నడిచిన వారే చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాజాగా ఇదే విషయాన్ని ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. తన సర్వే నివేదికలో పేర్కొన్నారు. ఇది ఒక్కటే కాదు.. తన టీమ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సర్వే జరిపింది. ఈ సందర్భంగా కేసీఆర్‌ ప్రభుత్వానికి.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు గల కారణాలను తన నివేదికలో ప్రశాంత్ కిషోర్ సోదాహరణగా వివరించినట్లు తెలుస్తోంది. సదరు సర్వే నివేదికను ఇటీవల సీఎం కేసీఆర్ ఎదుట ప్రశాంత్ కిషోర్ ఉంచడం.. దీంతో ఈ అంశాలను చూసి కేసీఆర్ కంగుతిన్నట్లు తెలుస్తోంది. 
  
అధికార టీఆర్‌ఎస్‌పై తెలంగాణ ఉద్యమకారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందట. ఎన్నో ఏళ్లుగా వారు కారు పార్టీలో కొనసాగుతున్నప్పటికీ వారు సంతోషంగా లేరని సమాచారం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందట. ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?  ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా?  ప్రజలు పాజిటివ్‌గా ఉన్నారా లేదా?  ఉద్యమకారులు, పార్టీ స్థాపించిన నాటి నుంచి ఉన్న వారు తాజాగా యాక్టివ్‌గా ఉన్నారా లేదా? తదితర అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందించి.. ప్రజల నుంచి ప్రశాంత్ కిషోర్ టీమ్ సమాధానాలు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ వైఖరిపై ఉద్యమకారులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడిన తర్వాత 2014లో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది.

నాటి నుంచి బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా కాంగ్రెస్‌, టీడీపీ నుంచి పెద్దయెత్తున చేరికలను గులాబీ బాస్ కేసీఆర్ ప్రోత్సహించారు. ఈ క్రమంలో బీటీ (బంగారు తెలంగాణ) బ్యాచ్‌తో పోల్చుకుంటే యూటీ(ఉద్యమ తెలంగాణ) బ్యాచ్‌కు చాలా తక్కువ పదవులు దక్కాయని లెక్క తేలింది. కొందరినైతే ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పీకే టీమ్ గుర్తించింది. 

మరోవైపు ఆనాడు కేసీఆర్‌ చెప్పారని ఉద్యమ సమయంలో భారీగా నగదు ఖర్చు పెట్టిన వారికి... నేటికి కేసీఆర్ పార్టీ పరంగా కానీ, ప్రభుత్వం పరంగా కానీ ఎలాంటి సాయం అందలేదట. ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌ తరఫున పోరాడినందుకు పదవిలో ఉండి కేసులు పెట్టిన వారు.. ఇప్పుడు సొంత పార్టీలో తమ కంటే ఉన్నత స్థాయిలో ఉండడాన్ని నాటి తెలంగాణ ఉద్యమకారులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. చిన్న పనుల కోసం వారి వద్దకు  వెళ్లాల్సి రావడం పట్ల వారంతా అవమానకరంగా భావిస్తున్నారట. పార్టీ కోసం కొట్లాడి, కేసులు ఎదుర్కొని తెలంగాణ సాధించుకుంటే.. ఇప్పుడు సొంత పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్న తీవ్ర ఆవేదనలోకి వారంతా జారిపోయారట.  

ప్రత్యేకంగా ఉద్యమకారులు, మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న వారి గురించి ప్రశాంత్‌ కిషోర్‌ బృందం క్షేత్రస్థాయిలో ఆరా తీసింది. ‘‘ఉద్యమ కారులకు న్యాయం జరిగిందా? మొదటి నుంచి ఉన్నవారు పార్టీలోనే ఇప్పటికీ కొనసాగుతున్నారా? వారికెందుకు న్యాయం జరగలేదు? ఇప్పటివరకు వారికెందుకు పదవులు రాలేదు...’’ వంటి ప్రశ్నలకు పీకే టీమ్ సమాధానాలను రాబట్టింది.

ఈ నేపథ్యంలో ఉద్యమకారులంతా పార్టీలో ఉన్నప్పటికీ వారంతా యాక్టివ్‌గా లేరని తేలింది. తమ కోసం పార్టీ అధిష్ఠానం ఏం చేయలేదని, కనీసం పార్టీ కార్యక్రమాలకు సైతం పిలవట్లేదని క్షేత్రస్థాయి నుంచి సమాధానాలు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల ఉద్యమకారులనే పీకే బృందం స్వయంగా కలిసి వారి నుంచే వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. 

అలాగే, చురుగ్గా ఉన్న నాయకులకు పదవులు అందించడంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఘోరంగా విఫలమైనట్లు సర్వేలో గుర్తించారు. ఇక.. ద్వితీయ శ్రేణి నాయకులు అధికారులను ఇబ్బంది పెడుతూ, వారిపై పెత్తనం చేస్తూ క్షేత్ర స్థాయిలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయం చేయలేకపోతున్న విషయాన్ని కూడా పీకే టీమ్‌ తమ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అలాగే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీ పరిస్థితి ఏంటన్న అంశాలపైనా కూడా  సర్వే చేపట్టారు. మొత్తంగా పార్టీలో వర్గాలు, ఉద్యమకారుల తిరుగుబాటు, కుల సమీకరణాలు తదితర అంశాలపై పూర్తి స్థాయి నివేదిక అందించినట్లు తెలుస్తోంది. 

కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రశాంత్ కిషోర్ తాజా సర్వే.. బయటకు పొక్కడంతో.. ఇదంతా వాస్తవమేనని తెలంగాణ సమాజం స్పష్టం చేస్తోంది. ఉద్యమ సమయంలో శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతి అయి.. మరణించారు. అతని తల్లి.. శంకరమ్మ.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని ఇక్కట్లు పడిందో అందరికి తెలుసునని ఈ సందర్భంగా తెలంగాణ సమాజం గుర్తు చేస్తుంది. అయితే ప్రశాంత్ కిషోర్ టీమ్ సర్వే రిపోర్ట్ నేపథ్యంలో కేసీఆర్... రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.

By
en-us Political News

  
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్‌లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కాంట్రాక్టుల కుంభకోణం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.