కల్వకుంట్ల కవిత.. ప్రశాంత్ కిషోర్ భేటీ.. ఏం జరుగుతోంది?

Publish Date:Jan 20, 2026

Advertisement

తెలంగాణ జాగృతి అధినేత్రి పొలిటికల్ జర్నీకి ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సహకారం అందించబోతున్నారా? అంటే ఔనన్న సమాధానమే వస్తున్నది. స్వల్ప వ్యవధిలో ప్రశాంత్ కిషోర్, కల్వకుంట్ల కవిత మధ్య రెండు సార్లు భేటీ జరిగిందన్న వార్తల నేపథ్యంలో కవితకు రాజకీయ సలహాదారుగా, వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పని చేయనున్నారని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల వ్యూహకర్తగా పలు రాష్ట్రాలలో ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిశోర్.. తన సొంత రాష్ట్రం బీహార్ లో మాత్రం సొంత పార్టీని ఎన్నికలలో విజయపథంలో నడిపించే విషయంలో ఘోరంగా విఫలమై బొక్కబోర్లా పడ్డారు. 

సొంత పార్టీ జన సురాజ్ ను ఏర్పాటు చేసి, బీహార్ లో సుదీర్ఘ పాదయాత్ర చేసి, విస్తృత ప్రచారం చేసి కూడా ఇటీవలి ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ తన పార్టీ నుంచి కనీసం ఒక్కరంటే ఒక్క అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయారు. జనసురాజ్ అభ్యర్థులెవరూ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. దీంతో ప్రత్యక్ష ఎన్నికలకు గుడ్ బై చెప్పేసి మళ్లీ వ్యూహకర్త అవతారం ఎత్తడమే ప్రశాంత్ కిశోర్ ముందు ఉన్న మార్గమని పరిశీలకులు గత కొంత కాలం నుంచీ చెబుతూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిశోర్ కల్వకుంట్ల కవిత భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  

మాజీ ఎమ్యెల్సీ, మాజీ ఎంపీ, అన్నిటికీ మించి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె అయిన కల్వకుంట్ల కవిత, తన తండ్రి నేతృత్వంలోని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో  ప్రశాంత్ కిశోర్ తో ఆమె భేటీ ఎనలేని రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది.  

ప్రశాంత్  రెండు నెలల వ్యవధిలో కవితతో రెండు సార్లు భేటీ అయ్యారనీ, వాటిలో రెండో భేటీ సంక్రాంతి సీజన్ లో జరిగిందనీ సమాచారం.   ఈ భేటీలలో వారిరువురి మధ్యా ప్రధానంగా తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, కొత్త పార్టీ అజెండా, ప్రచారం తదితర అంశాలపై చర్చ జరిగిందని చెబుతున్నారు.    ప్రశాంత్ కిషోర్  కు తెలుగు రాజకీయాలతో మంచి పరిచయం ఉంది.  గతంలో  అంటే  2019లో వైఎస్ జగన్  కు రాజకీయ, ఎన్నికల వ్యూహాలను అందించారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాల కారణంగానే 2019 ఎన్నికలలో జగన్ విజయం సాధించారని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ చెబుతుంటారు.  అలాగే  2023 ఎన్నికలకు ముందు కొద్ది కాలం పాటు ఆయన బీఆర్ఎస్ కు కూడా వ్యూహకర్తగా పని చేశారు.  

ఇక ప్రస్తుతానికి వస్తే... కవిత రాజకీయంగా సొంత మార్గం వేసుకుని సొంతగా నడక ప్రారంభిం చనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తన రాజకీయ   వ్యూహాలకు పదును పెట్టడమే కాకుండా, తాను ఏర్పాటు చేయనున్న కొత్త పార్టీని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేలా వ్యూహరచన చేయడానికి ప్రశాంత్ కిశోర్ ను నియమించుకున్నారన్న చర్చ ఈ భేటీల  అనంతరం రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.  

అయితే తాను కల్వకుంట్ల కవితకు రాజకీయ వ్యూహకర్తగా పని చేయనున్నట్లు వస్తున్న వార్తలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. తాను ఇప్పటికే రెండు సార్లు ఆమెతో భేటీ అయ్యి పార్టీ ఏర్పాటు గురించి చర్చించినట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు.  

By
en-us Political News

  
మంత్రివర్గ విస్తరణ మాత్రమే అంటే కేబినెట్ లోకి ఒకరిని మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. అలా కాకుండా.. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి రెండేళ్లు కావస్తున్నందున మంత్రివర్గంలో సమూల మార్పులు చేసే దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు. తన కేబినెట్ నుంచి కొందరికి ఉద్వాసన పలికి కొత్తవారికి అవకాశం ఇవ్వాలన్న దిశగా చంద్రబాబు యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
రాజ్యసభ ఎన్నికలకు 9 మంది అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.
స్వామివారికి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే, తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. అయితే ప్రొటోకాల్ ప్రకారం ఒకరికే ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు, ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ చేతిలోని పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు.
జగన్ హయాంలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగిందన్న మంత్రి, రాష్ట్ర వ్యాప్తంగా 198 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ ఇస్తే, వాటిలో 102 ప్రాజెక్టులు రాయలసీమలోనే ఉన్నాయని గుర్తుచేశారు.
వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా, బూతుల నానిగా అనితర సాధ్యమైన గుర్తింపు ఉన్న కొడాలి నాని, 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం, గుడివాడ నియోజకవర్గంలో తాను స్వయంగా ఓడిపోవడంతో వెనక్కు తగ్గారు. కేసుల భయంతో మౌనాన్ని ఆశ్రయించారు. అసలు రాజకీయాలలో ఉన్నారా లేరా అన్నంతగా సైలెంట్ అయిపోయారు.
జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వచ్చి అత్యధికంగా బెంగళూరులోనే మకాం ఉంటుండం ఒక కారణమైతే.. రాష్ట్రానికి, సొంత జిల్లాకు వచ్చినప్పుడు కూడా కార్యకర్తలు, నాయకులకు అప్పాయింట్ మెంట్ దొరకని పరిస్థితి మరో కారణంగా చెబుతుంటారు. ముఖ్యంగా జగన్ అందుబాటులో లేకపోవడం ప్రభావం ఆయన సొంత జిల్లా కడపలో మరీ తీవ్రంగా ఉంది.
కవిత సైతం త‌న వ‌ల్ల పార్టీ ఎలా ఓడిపోయిందని ప్రకటించి చేతులు దులుపుకోవడం కాదు.. అందుకు సంబంధించి వివరణ ఇవ్వాలనీ, లెక్కలు తేల్చాలనీ డిమాండ్ చేయడం ద్వారా మొత్తం బీఆర్ఎస్ నే డిఫెన్స్ లో పడేశారు. దాని నుంచి బయటపడడానికి ఇప్పుడు బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ రంగంలోకి దిగి.. అప్పటి కేటీఆర్, కేసీఆర్ ల ప్రసంగాలు, ప్రకటనలను రీ పోస్టు చేస్తూ హడావుడి చేస్తున్నది.
తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఐదు రోజుల కిందట దుబాయ్ వెళ్లారు. మంత్రి కుటుంబ సభ్యులలో ఒకరు అనారోగ్యంతో ఉండటంతో మెరుగైన చికిత్స అందించడం కోసం ఆయన దుబాయ్‌కు వెళ్లినట్లు సమాచారం. చికిత్స అనంతరం తిరిగి రావాలని భావిస్తున్న తరుణంలో పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చి, ఆ ప్రభావంతో దుబాయ్ విమానాశ్రయం మూతపడింది.
అదొక మార్ఫింగ్ వీడియో, ఏఐ జ‌న‌రేటెడ్ వీడియో అన్నారు. ఇందులో త‌న ప‌రువు తీసే కుట్ర దాగి ఉంద‌న్న బీఆర్ నాయుడు.. త‌న‌తో పాటు టీటీడీ ప్ర‌తిష్ట మంట‌గ‌లిపే య‌త్నం ఉంద‌ని ఆరోపించారు. అందుకే తాను సైబ‌ర్ క్రైమ్ ని ఆశ్ర‌యించానన్నారు.
ఆ పార్టీ అగ్రనాయకత్వం అప్పట్లో ప్రదర్శించిన ఉదాశీనత.. కవిత అవినీతిని సర్టిఫై చేసినట్లైందని అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదే విషయాన్ని కల్వకుంట్ల కవిత కోర్టు తీర్పు అనంతరం మీడియా సమావేశంలో ఎత్తి చూపారు. పార్టీ కోసం కాకుండా.. పార్టీలో ఉన్న కొందరి స్వార్థం కోసం తనను బలిపశువును చేశారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేశాయి.
2047నాటికి ఆంధ్రప్రదేశ్ ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యం అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట ఇస్తే అది జరిగి తీరుతుంది. ఆయన ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడమే తన ముందున్న కర్తవ్యమని చెప్పారు.
లిక్కర్ పాలసీపై తప్పుడు కేసు పెట్టి ఆమ్ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోడీ, అమిత్ షాలు కుట్ర పన్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ నమోదు చేసిన కేసులో తనతో పాటు అందరికీ క్లీన్ చిట్ ఇస్తూ న్యాయస్థానం చారిత్రక తీర్పు ఇచ్చిందన్నారు.
వైవీ తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగంలో ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదు కానీ, మిగిలిన వ్యవహారాల్లో మాత్రం ఆయన బాగానే సంపాపదించారని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గం నుంచి తాను ఇంత వరకూ ఏడు సార్లు పోటీ చేసి ఐదు సార్లు గెలిచానన్నబాలినేని, ఆ ఓడిపోయిన రెండు సందర్భాలలోనూ కూటమి చాలా బలంగా ఉందని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.