Publish Date:Jun 29, 2026
భారతీయ రాజకీయాలలొప్రశాంత్ కిషోర్ (పీకే) పేరుకు పరిచయం అక్కర్లేదు. రాజకీయ వ్యూహకర్తగా పీకే ఎన్నో చారిత్రాత్మక విజయాల వెనుక పీకే ఉన్నారు. అయితే సొంత రాష్ట్రం బీహార్ లో సొంత రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగి బొక్కబోర్లా పడ్డారు. అయితే ఇప్పుడు ఆయన మరో సారి ఎన్నికల బరిలోకి దిగనున్నారు. సొంత పార్టీ పెట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని స్థానాలలోనూ తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ కిశోర్ అప్పుడు తాను స్వయంగా పోటీ చేయలేదు. పార్టీ ఘోర పరాజయం తరువాత ఇప్పుడు ఆయన బీహార్ అసెంబ్లీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నారు.
బిహార్‌లో ఆయన స్థాపించిన జన్ సూరజ్ పార్టీకి ఏ మాత్రం ఆదరణ లభించలేదు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. అయినా వెనుకడుగు వేయని ప్రశాంత్ కిశోర్.. ఇప్పుడు బీహార్ కొత్త పాట్నా పరిధిలోని బాంకీపూర్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో తానే స్వయంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు. దీంతో బాకింపూర్ కు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. బీజేపీకి బలమైన నియోజకవర్గమే అయినప్పటికీ.. పీకే ఇక్కడ నుంచి పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన సూచన ప్రాయంగా వెళ్లడడించారు. బాంకీపూర్‌లో బీజేపీ ఆధిపత్యాన్ని ఎలాగైనా తగ్గించడమే తన ప్రధాన లక్ష్యమనీ.. అవసరమైతే తానే స్వయంగా బరిలోకి దిగుతానని ఆయన ప్రకటించారు.
ఇప్పటివరకు పొలిటికల్ స్క్రీన్‌ప్లే లకే పరిమితమైన ప్రశాంత్ కిషోర్.. ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అదీ బీజేపీకి గట్టిపట్టున్న బాంకీపూర్ నియోజకవర్గం నుంచి. బీజేపీ కోటలాంటి బాంకీపూర్ లో పీకే గెలుపు కష్టసాధ్యమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ప్రాశాంత్ కిశోర్ మాత్రం దశాబ్దాల బీజేపీ కోటను బద్దలు కొడతానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prashant-kishor-in-the-fray-for-bankipur-byelection-39-224438.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!