పొత్తులు కాదు.. ఉద్యోగాలు, పరిశ్రమలు.. బీహార్ తక్షణ అవసరాలివే.!
Publish Date:Aug 5, 2026
Advertisement
దేశ రాజకీయాలలో ఎన్నికల వ్యూహకర్తగా తిరుగులేని గుర్తింపు పొంది.. ఇప్పుడు తన స్వరాష్ట్రంలో రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న ప్రశాంత్ కిశోర్ ఇటీవల రాష్ట్రంలోని బంకిపునా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించి ప్రత్యక్ష రాజకీయాలలో తొలి అడుగు వేశారు. బంకీపూర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం తొలి సారిగా మీడియా సమావేవంలో మాట్లాడిన ఆయన బీహార్ తక్షణావసరాలు పొత్తులు కాదనీ, పరిశ్రమలూ ఉద్యోగా లన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమి ప్రభుత్వం కేవలం పొత్తులు, రాజకీయ సమీకరణాలపైనే దృష్టి పెడుతోందని విమర్శించారు. అయితే రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు. తమ పార్టీకి ఇతర పార్టీలతో ఎటువంటి పొత్తూ ఉండదని కుండబద్దలు కొట్టిన ప్రశాంత్ కిశోర్.. జనసురాజ్ అలయెన్స్ బీహార్ ప్రజలతో మాత్రమేనన్నారు. స్వార్థ రాజకీయాల కోసం సిద్ధాంతాలను పక్కనబెట్టి కొలువుదీరే సంకీర్ణ ప్రభుత్వాల వల్లు రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం లేదన్నారు. జన సురాజ్ పార్టీ లక్ష్యం అధికారం కాదనీ, సుపరిపాలన, పారదర్శకత, సమగ్ర అభివృద్ధి మాత్రమేనని క్లియర్ కట్ గా చెప్పారు. అధకారం కంటే ప్రజాసంక్షేమం, అభివృద్ధే జనసురాజ్ పార్టీకి ముఖ్యమన్నారు. Prashant Kishor, Jan Suraaj Party, Bihar Jobs and Industrialization, Bihar Politics, Bankipur Bypoll Results
http://www.teluguone.com/news/content/prashant-kishor--jan-suraaj-party--bihar-politics--bankipur-bypoll-results--bihar-jobs-and-industrialization-25-228059.html





