మూడు నెలల్లో లోకేష్‌కు తెలుగుదేశంలో కీలక బాధ్యతలు?

Publish Date:Jun 11, 2025

Advertisement

తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మంత్రి నారా లోకేష్‌కు పార్టీపరంగా ప్రమోషన్ ఎప్పుడు?..అనే ప్రశ్న ఇప్పుడు అటు పార్టీలోను...ఇటు రాజకీయ వర్గాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్‌గా మారిపోయింది.  లోకేష్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌ గా ప్రకటించాలని మహానాడు వేదికగా టీడీపీ నేతలు ప్రతిపాదనలు పెట్టారు. అయితే మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. దాంతో మహానాడు ముగిసినా లోకేష్‌ ప్రమోషన్‌కు సంబంధించిన చర్చ పార్టీలో ఇంకా నడుస్తునే ఉంది.

లోకేష్ పట్టాభిషేకం ఆలస్యమవ్వడం వెనుకఅనేక అంశాలు ముడిపడి ఉన్నాయని టీడీపీలో సీనియర్ నేతలు అంటున్నారు. కూటమి నేతృత్వంలో ప్రభుత్వం నడుస్తుండడం.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడం.. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తీసుకురావడానికి చంద్రబాబు తీవ్రంగా శ్రమిస్తుండటం కారణాలుగా చెబుతున్నారు. చంద్రబాబు పాలనలో బీజీగా ఉంటున్న నేపథ్యంలో పార్టీ బాధ్యతలు లోకేష్‌‌కు అప్పగించాలనే డిమాండ్‌ టీడీపీ నేతల నుంచి చాలా కాలంగా వస్తున్నది.  ఓ వైపు టీడీపీ నేతల నుంచి డిమాండ్‌ పెరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు దీనిపై స్పందించాల్సిన పరిస్ధితి వచ్చింది. 

లోకేష్‌ని ఎప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ గా  చేయబోతున్నారు.. 2029 ఎన్నికల్లోగా లోకేష్‌ని సీఎంగా చేస్తారా అనే ప్రశ్నలు చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రశ్నలకు చంద్రబాబు జవాబిస్తూ లోకేష్ కి టీడీపీతో పాటు ప్రజల మద్దతు పూర్తిగా ఉందన్నారు. ఇక యువతను ప్రోత్సహించడంలో తెలుగుదేశం ఎపుడూ ముందుంటుందనీ,  తన పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా అతి పిన్న వయస్కుడు అయిన రామ్మోహన్ నాయుడు ఉన్నారని గుర్తు చేశారు. అలాగే తెలుగు పార్లమెంట్ సభ్యులలో  అత్యధిక శాతం యువకులేననీ చెప్పారు. ఏపీ అసెంబ్లీని యూత్ అసెంబ్లీగా అభివర్ణించారు. 

ఆ క్రమంలో యువత రాజకీయ అవకాశాలు అందుకోవడం ఒక పరిణామ క్రమంలో జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ తరువాత తాను సీఎం కావడం... తరువాత లోకేష్ పేరు వినిపించడం మీద బాబు స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో నామినేట్ చేయడం కుదర దన్నారు. ప్రజల అనుమతి ఉండాలని స్పష్టం చేశారు.  తనకు నాలుగు సార్లు సీఎంగా ప్రజలు అవకా శం ఇచ్చారని అంటూనే... లోకేష్‌కి కూడా జనాల మద్దతు ఉందంటూ అన్యాపదేశంగా లోకేష్‌ ప్రమోషన్‌పై స్పందించారు.

తెలుగుదేశం యూత్ పార్టీగా విస్తరిస్తూ ముందుకు సాగుతోందని చంద్రబాబు అంటుండటంతో.. లోకేష్‌కు తర్వలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నారనే చర్చ టీడీపీలో మళ్లీ మొదలైంది. కాస్త అటూ ఇటూ  కావచ్చు, ఆలస్యం అయినా అవ్వొచ్చు..  కానీ లోకేష్ కచ్చితంగా టీడీపీలో కీలక భూమిక పోషించబోతున్నారని టీడీపీ నేతలంటున్నారు. తాజాగా పార్వతీపురంలో పర్యటించిన లోకేష్‌ పొలిట్ బ్యూరోలో సంస్కరణ తేవాలంటే  కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. అందరినీ ఒప్పించడానికి 3నెలల సమయం పడుతుందనే హింట్‌ ఇచ్చారు. 

ఆ క్రమంలో మరో మూడు నెలల్లో లోకేష్‌కు ప్రమోషన్‌ దక్కబోతుందనే చర్చ పార్టీ నేతల్లో నడుస్తోందంట. టీడీపీ సిద్ధాంతాలను మార్చకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా మహానాడులో ఆరు శాసనాలను ప్రకటించడం జరిగింది.  వాటిని రూపొందించడంలో లోకేష్ ముఖ్యభూమిక పోషించా రని స్వయంగా చంద్రబాబే ప్రకటించారు.  మహానాడు విధానం మార్చడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిం దన్న లోకేష్‌... మిగిలిన విషయాలపై స్పందించనప్పటికి.. తర్వలో ఆయన ప్రమోషన్ గ్యారెంటీ అని పార్టీ సీనియర్లు అంటున్నారు.

By
en-us Political News

  
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు.
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.