తిరుమల లడ్డూ వ్యవహారంలో నటుడు ప్రకాశ్ రాజ్ పవన్ కల్యాణ్ టార్గెట్ గా ట్వీట్లు కురిపిస్తూనే ఉన్నారు. ఈ వివాదం జాతీయ సమస్యగా పరిణమించడమే కాకుండా సుప్రీం వద్దకు కూడా వెళ్లింది. లడ్డూ వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం సాగుతోంది. ఈ విషయంలో దోషులెవరు, వారిని ఎలా శిక్షిస్తారు అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇంకో పక్క ప్రకాష్‌రాజ్ ఈ విషయంలో పవన్ కల్యాణ్ టార్గెట్ గా వరుస ట్వీట్లు పెడుతున్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ సామాజిక మాధ్యంలో ఆయన పవన్ కల్యాణ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నేరుగా పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయనకే ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.
ప్రకాష్‌రాజ్ మొదట పెట్టిన ట్వీట్‌పై పవన్‌కళ్యాణ్ తీవ్రంగా స్పందించడంతో తన రెండో ట్వీట్లో నేను చెప్పింది ఏమిటి, మీరు అర్థం చేసుకున్నదేమిటి.. అంటూనే తాను విదేశాల్లో ఉన్నాననీ, వచ్చిన తర్వాత అన్నింటికీ సమాధానం చెప్తానని అన్నారు. ఇది జరిగిన రెండు రోజులకే కార్తీ వ్యాఖ్యల విషయంలో పవన్‌కళ్యాణ్ సీరియస్ కావడం, దాంతో కార్తీ.. పవన్‌కి సారీ చెప్పడంపై స్పందిస్తూ ప్రకాశ్ రాజ్ చేయని తప్పుకు క్షమాపణలు చెప్పించారు.. హ్యాపీనా అంటూ ట్వీటారు.
తాజాగా మరో వివాదాస్పదమైన ట్వీట్‌తో మరో సారి పవన్ ను నిలదీశారు ప్రకాష్‌రాజ్. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ కదా? ఇక చాలు. ప్రజల కోసం చేయవలసిన పనులు చూడండి అంటూ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇటీవల పవన్‌కళ్యాణ్ 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టార్గెట్ చేస్తూ దీక్షలు మానేసి ప్రజలకు చెయ్యాల్సిన పనులు చూడండి అని అర్థం వచ్చే పెట్టిన ట్వీట్ వైరల్ అయ్యింది. నెటిజనులు ప్రకాశ్ రాజ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. అనవసర వివాదాలను రేపడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/prakashraj-again-targets-pawan-39-186026.html
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.
తాను ఒక్కసారి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రత్యర్థులు ఎవరూ నిలబడలేరని ఆయన హచ్చరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఎన్నికల్లో ఓటు వేయడం అంటే ఆ అక్రమాలను అంగీకరించడమే అవుతుందని భావించి, తాను ఓటు హక్కును వినియోగించుకోకుండానే పులివెందుల నుంచి వెనుదిరగారు.
Publish Date:Oct 31, 2026
రేపే మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. ప్రశాంతంగా సాగేనా.?