మాలేగావ్ పేలుళ్లలో ప్రగ్యా పాత్ర.. తేల్చిన ఫోరెన్సిక్
Publish Date:Aug 3, 2022
Advertisement
దేశ భక్తిలో అందరినీ మించినవారిలా భారీ ప్రచారాలు చేసుకుంటున్న బీజేపీ వారి చరిత్రకో మచ్చ పడిం ది. మహారాష్ట్ర మాలేగావ్ పట్టణంలో 2008లో జరిగిన బాంబుపేలుళ్ల కేసులో బీజేపీ ఎంపీ ప్రగ్యాసింగ్ ఠాకూర్ పాత్ర ఉందని తేలింది. అప్పట్లో మాలేగావ్ మసీదులో జరిగిన బాంబుపేలుళ్ల కేసు విచారణలో ఆమె పాత్ర ఉందన్నది ఫోరెన్సిక్ నిపుణుల బృందం తేల్చింది. మసీదులో ఉంచిన ఎల్ ఎంఎల్ వెస్పా స్కూటరు పోలీ సులకు లభించింది. ఈ స్కూటరు భోపాల్ బీజేపీ ఎంపీ పేరునే రిజిస్టర్ అయి ఉందని నిపుణులు ముంబయి ఎన్ ఐ ఏ ప్రత్యేక కోర్టుకు నివేదించారు. ఈ కేసుకు సంబంధించి 261మంది సాక్షు లను కోర్టు విచారిం చింది. నాసిక్ జిల్లా మాలేగావ్ పట్టణంలో 2008 సెప్టెంబర్ 29న స్కూటర్ బాంబు పేలుడు జరిగింది. ఆ దుర్ఘటన లో ఆరుగురు మరణించడగా మరో వందమంది గాయపడ్డారు. అక్కడ లభించిన ప్రగ్యా స్కూటరులో అమ్మోని యం నైట్రేట్ లభించిందని ఫోరెన్సిక్ నిపుణులు పేర్కొన్నారు. ఆ సంగతిని సాక్షులు కూడా అంగీకరించారని విచారణలో తేలింది. కాగా ఈ కేసులో అడ్డంగా దొరికిపోయిన ప్రగ్యాపై బీజేపీ సీనియర్లు ఏ చర్య తీసుకుంటారనేది చూడాలి. ఇటీవలి కాలంలో ఆర్ధిక నేరాలల్లో అనుమాతిలను సైతం విడిచిపెట్టకుండా ఈడీ, ఎన్ ఐఎలతో దాడి చేయిస్తున్న కేంద్ర ప్రభుత్వం తమ పార్టీవారు ఇంత దారుణానికి పాల్పడిన సంగతి తెలిసీ మౌనం వహిం చడం ఎంతవరకూ సమంజసమని విశ్లేషకుల మాట.
http://www.teluguone.com/news/content/pragya-key-role-in-mlegaon-blasts-39-141161.html





