Publish Date:Apr 16, 2022
జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అసంతృప్తులను చల్లర్చేందుకు ఏకంగా కొత్త మంత్రుల అధికారాల్లో కోత విధించారు. మంత్రి పదవులను కోల్పోయిన వారిని సంతృప్తి పరిచేందుకు వారికి అనధికార మంత్రులుగా కొత్త మంత్రుల అధికారాల్లో, దర్జాల్లో సగభాగం కట్టబట్టేందుకు సిద్ధమయ్యారు.
ఏపీ సీఎం జగన్ స్థాయినీ, శక్తినీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు...తరువాతగా చూడాల్సి ఉంటుంది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టడానికి ముందు జగన్ వైకాపా అధినేతే కాదు...కను సైగతో మొత్తం పార్టీని శాసించేంత శక్తిమంతుడిగా కనిపించారు. కానీ ఎప్పుడైతే పునర్వ్యవస్థీకరణకు నడుం బిగించారో....మంత్రుల ఉద్వాసన, చేరికలకు జాబితా తయారు చేశారో...అప్పటి నుంచి ఇంత కాలం అత్యంత శక్తిమంతుడిగా కనిపించిన ఆయన ఇంత బలహీనుడా అని అంతా అశ్చర్యపోయేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మూడేళ్ల కిందట ప్రమాణ స్వీకారం రోజునే రెండున్నరేళ్ల తరువాత మొత్తం కేబినెట్ మార్చేస్తానని ప్రకటించిన జగన్ కారణాలేమైతేనేం ఆ పనికి మూడేళ్ల తరువాత శ్రీకారం చుట్టారు. మూడేళ్ల కిందటే వేసుకున్న ప్రణాళికను అమలు చేయడంలో ఆయన తడబాటే...కార్యాచరణ విషయంలో ఆయన బలహీనతలను ఎత్తి చూపింది.
పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఉద్వాసనకు గురౌతున్న మంత్రులలో వారి అనుచరులలో పెల్లుబికిన ఆగ్రహావేశాలు, నిరసన జ్వాలలు గమనిస్తే ఇంత కాలం జగన్ బిల్డప్ అంతా రాజుగారి దేవతా వస్త్రం అని తేలిపోయింది. సరే ఏదో విధంగా బుజ్జగింపుల ద్వారా పునర్వ్యవస్థీకరణను మమ అనిపించిన ముఖ్యమంత్రి ఆ తరువాత కేబినెట్ నుంచి తొలగించిన మంత్రులను సంతృప్తి పడటానికి పడుతున్నపాట్లు చూస్తే పార్టీ అధినేతగా అయన వైఫల్యం ప్రస్ఫుటమౌతుంది. అందుతున్నసమాచారం మేరకు తొలగించిన మంత్రులకు ఆయన కేబినెట్ లోకి తీసుకున్న కొత్త మంత్రుల అధికారాలలో కోత పెట్టి మరీ అధికారిక పదవులు కట్టబెడుతున్నారు.
ఇందుకు కొత్త జిల్లల సంఖ్యను ఆయన ఉపయోగించుకుంటున్నారు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఇటీవలే 26 జిల్లాల రాష్ట్రంగా మారిన సంగతి తెలసందే. అదే ఇప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయిన వారికీ, పదవులు ఆశించి భంగపడి అసమ్మతి రాగం ఆలపించిన వారికీ....అధికార షెల్టర్ కానుంది. 26 జిల్లాలకూ 26 అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేసి వాటి చైర్మన్లుగా అసంతృప్తులను నియమంచ వారికి కేబినెట్ హోదా కట్టబెట్టాలన్నది జగన్ యోచనగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే అభివృద్ధి మండళ్ల చైర్మన్లు ఆయా జిల్లలకు ఇన్ చార్జి మంత్రులుగా వ్యవరిస్తారన్నమాట. ఇప్పడున్న జిల్లా ప్రణాళికా మండళ్ల స్థానాన్నిజిల్లా అభివృద్ధి మండళ్లు భర్తీ చేస్తాయన్న మాట. జిల్లా ప్రణాళికా మండళ్లకు జిల్లా మంత్రులే ఇన్ చార్జిలుగా ఉండేవారు. ఇప్పుడా అధికారం జిల్లా అభివృద్ధి మండళ్ళ చైర్మన్ లకు దఖలు పడుతుంది. ఈ విధంగా జగన్ అసమ్మతిని చల్లార్చి వ్రతం చెడ్డా ఫలం దక్కిందని సంతృప్తి పడాలని చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/powercut-to-new-ministerspramotion-to-ex-ministers-39-134494.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.