కేంద్రంలో, రాష్ట్రాల్లో అధికారం.. అదే బీజేపీ లక్ష్యం

Publish Date:Jan 18, 2023

Advertisement

ప్రధాని నరేంద్రమోడీ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వేదికగా పార్టీ శ్రేణులకు ఎన్నికల దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది జరగనున్న తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నదే ఆ దిశా నిర్దేశం. ఇప్పటికే వరుసగా రెండు సార్లు తన నాయకత్వంలో పార్టీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడమే కాకుండా, దేశంలోని మోజారిటీ రాష్ట్రాలలో అధికారం చేజిక్కించుకునే లా విజయవంతంగా వ్యూహాలు పన్నిన మోడీ.. ముచ్చటగా హ్యాట్రిక్ విజయం కోసం ఇప్పటి నుంచే వ్యూహాలను అమలు చేయడమే కాకుండా.. పార్టీ శ్రేణులకు కార్యాచరణ ప్రాణాళికను కూడా ఇచ్చేశారు.  

మరో 400 రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో విజయం కోసం పని చేయాలని పిలుపు నిచ్చారు. ముఖ్యంగా యువ ఓటర్ల వద్దకు పార్టీ చేరుకోవాలని మోడీ పార్టీ కార్యవర్గ సమావేశాలలో ఉద్బోధించారు.  18-25 ఏళ్ల మధ్య ఉన్న ప్రజలందరినీ పార్టీ రీచ్ అవ్వాలనీ.. యువతను పార్టీ చేరుకోగలిగితే విజయం సులభ సాధ్యమౌతుందని ప్రధాని మోడీ  ప్రభోదించటం వెనుక భారీ స్కెచ్ ఉందంటున్నారు.

పరిశీలకులు. దేశంలో యువ జనాభా, యువ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు. వీరిలో అత్యధికులు ఫస్ట్ టైం ఓటర్లే..కాబట్టి యువతను ఆకట్టుకుంటే ఆ కుటుంబాన్నంతా గంపగుత్తగా ఆకట్టుకున్నట్టేనన్నది మోడీ  ఉద్దేశంగా చెబుతున్నారు. యువతకు రాజకీయాలంటే ఆసక్తి ఉన్నా పెద్దగా పట్టుండదని పైగా చరిత్ర, సమకాలీన పరిస్థితులపై సరైన అవగాహనా ఉండదు కాబట్టి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇందుకు సామాజిక మాధ్యమాన్ని మించిన వేదిక, సాధనం లేదని మోడీ విస్పష్టంగా చెప్పారు.

ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఎకానమీగా భారత్ ను తీర్చిదిద్దిన ఘనత తమదేనంటూ ప్రజల్లో ఊదరగొట్టడాన్ని బీజేపీ తన అజెండాలో పెట్టుకోవడం వెనుక ఉన్న కారణం కూడా ఇదేనని పరిశీలకులు వివ్లేషిస్తున్నారు. రామ మందిర నిర్మాణాన్ని విజయవంతంగా చేపట్టడం మొదలు.. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 360ని ఉపసంహరించటం వరకూ గత రెండు దఫాలుగా మోడీ సర్కారు చేపట్టిన   నిర్ణయాలను ప్రచారంలోకి తేవాలని డిసైడ్ అయినట్టు మోడీ మాటలను బట్టి అవగతమౌతోంది.   సంతృప్తికరమైన పాలన అన్న నినాదంతో 2024 లోక్ సభ ఎన్నికలకు బీజేపీ రెడీ అవుతోందన్నది వారి విశ్లేషణల సారాంశం.

అందుకే మోడీ బీజేపీ ఇప్పుడు కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక సామాజిక ఉద్యమం అని మోడీ అంటున్నారు.  ప్రత్యర్థుల ఎత్తులను ఆదిలోనే చిత్తులు చేసేలా ఆస్త్రాలను సంధించే పని బీజేపీ ఇప్పటి నుంచే మొదలెట్టేసింది.  దేశ భవిష్యత్తు   గొప్పగా, ఉజ్వలంగా ఉంటుందని భరోసా కలిగేలా, విపక్షాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని నమ్మేలా ప్రజలలో ప్రచారాన్ని ఊదరగొట్టేయడమే బీజేపీ తాజా వ్యూహం అని పార్టీ కార్యవర్గ సమావేశంలో మోడీ ప్రసంగాన్ని బట్టి అర్థమౌతుంది.  

బీజేపీ ప్రతిపక్షంలో ఉన్న రాష్ట్రాలు అన్నీ తెలంగాణ బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలన్న మోడీ మాటలు తెలంగాణ బీజేపీకి పెద్ద టానిక్ లా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ చేపట్టిన యాత్ర బాగుందని.. దీన్ని మిగతా రాష్ట్రాలు రోల్ మోడల్ గా తీసుకోవాలని మోడీ చెప్పటం మిగతా రాష్ట్రాలపై గట్టి ప్రభావం చూపటం ఖాయం. ఇంత భారీ యాత్రను బండి ఎలా చేపట్టారో అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యుల బృందాన్ని పంపాలన్న మోడీ నిర్ణయం దక్షిణాదిలో బీజేపీకి మరింత ఉత్సాహాన్ని, ఊపునూ తీసుకువస్తుందన్నది ఆయన ఉద్దేశం, ఎత్తుగడగా కనిపిస్తోంది. దేశంలో మోడీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రభావమంతంగా ప్రచారం చేసుకోవడంలో పార్టీ సఫలం కాలేదన్నది రెండు రోజుల పాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయం.  అందుకే అన్నిరకాల ప్రచార, ప్రసార సాధనాలను గరిష్ఠంగా ఉపయోగించుకునేలా సన్నద్ధం కావాలన్నది మంగళవారం ముగిసిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయంగా చెప్పాలి.

కర్నాటక, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, మిజోరం, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో జరుగనున్న ప్రతి అసెంబ్లీ ఎన్నికనూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటే 2024లోక్ సభ ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద బండి నడకేనన్నది మోడీ ప్రసంగ సారాంశం. 

2023 ఏడాది పార్టీ దృష్ట్యా అత్యంత ముఖ్యమైన సంవత్సరమని పదేపదే నద్దా, మోడీ-షాలు పేర్కొంటుండటం వెనుక ఉన్న కారణం కూడా ఇదే. అలాగే బీజేపీకి  కొరకరాని కొయ్యలుగా మారిన 160 లోక్ సభ స్థానాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి ఆయా నియోజకవర్గాలలో పాగా వేసేలా  కార్యచరణను చేపట్టాలని మోడీ ఆదేశం. సబ్కా సాథ్ సబ్కా వికాస్ తోపాటు సబ్కా ప్రయాస్ కూడా అవసరం అంటూ మోడీ కొత్త నినాదాన్ని పార్టీకి అందించారు.  ఓబీసీలను మరింత మచ్చిక చేసుకుని, ఎస్సీ, ఎస్టీలను తమ పార్టీ వైపుకు పెద్ద ఎత్తున మళ్లించేలా కమలనాథులు చేస్తున్న కృషి సరిపోదని.. అన్ని రాష్ట్ర శాఖలు మరింత కృషి చేయాలంటూ ఎండ్ టు ఎండ్ ఎన్నికల సిద్ధాంతాన్ని వల్లె వేస్తూ బీజేపీ లీడర్లందరికీ కార్యవర్గ సమావేశం టార్గెట్లు నిర్దేశించింది.

 ఈ ఏడాది జరిగే 9 అసెంబ్లీ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేస్తే తప్ప వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం అన్న పార్టీ లక్ష్యం సాకారదన్న ఉద్దేశంతో బీజేపీ కార్యవర్గ సమవేశం వేదికగా నిర్ణయించింది. 

By
en-us Political News

  
ర్నాబ్ తుపానుతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను సత్వరమే పునరుద్ధరించడానికి తమిళనాడు సహాయాన్ని కోరింది. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు ప్రభుత్వాన్ని  రాష్ట్రంలో తుపాను ప్రభావిత ప్రాంతాలలో విద్యుత్ పునరుద్ధరణ  వేగవంతం చేయడానికి  అదనపు విద్యుత్ శాఖ సిబ్బందిని, పరికరాలను కోరారు.
సాధారణంగా వైసీపీ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుందంటే.. ఎవరైనా సరే  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని , ఆయన పాలనా విధానాలను పొగిడితే వెంటనే ఆ పొగిడిన వారిపై విమర్శలు గుప్పించేస్తుంది. ఇందుకు గతంలో చాలా చాలా ఉదాహరణలు ఉన్నాయి.
పులివెందుల మునిసిపోల్ రణరంగంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పోలీసులూ అప్రమత్తమయ్యారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకూ తావులేకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అవసరమైతే  ఇటు తెలుగుదేశం కూటమి, అటు వైసీపీకి చెందిన ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేసేందుకైనా వెనుకాడబోమని పోలీసులు విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు.
గతంలో రాష్ట్ర రాజకీయాలలో  కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యక్తిగత విమర్శలు  దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పిన కొండా సురేఖ వాటిని ఉపసంహరించుకున్నారు.   గతంలో కేటీఆర్ పై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను  పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా  పేర్కొన్నారు. 
తెలంగాణ రాజకీయాలలో ఏ పార్టీతోనూ పొత్తు లేదు లేదంటూనే జనసేనతో పొత్తుకు తహతహలాడుతోంది. తెలంగాణలో స్వంతంగానే బరిలోకి దిగుతామని కుండబద్దలు కొట్టిన బీజేపీ ఇప్పుడు జనసేనతో అంతర్గత పొత్తు కుదుర్చుకుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 
నియోజకవర్గంలో రాబోయే మున్సిపల్ చైర్మన్ ఎన్నికలను తెలుగుదేశం కూటమి గెలుచుకుంటుందన్న ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పులివెందుల ఇంకెంత మాత్రం కంచుకోట కాదని విస్పష్టంగా పేర్కొన్నారు.  దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న పులివెందులలో కూటమి నేతలు నేరుగా సవాళ్లు విసురుతుండటం పులివెందులలో మసకబారిన వైసీపీ ప్రతిష్ఠకు, పలుకుబడికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
అయితే, ప్రస్తుతం సిద్ధమవుతున్న చార్జ్‌షీట్‌ను మరింత పటిష్టంగా రూపొందించేందుకు ఉన్నతాధికారులు ఢిల్లీలోని ప్రముఖ సుప్రీంకోర్టు న్యాయవాదులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. సాంకేతిక సాక్ష్యాలు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ అదనపు చార్జిషీట్ ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.