Publish Date:Mar 17, 2025
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలం పేరు మార్చనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చెప్పారు. తెలుగు రాష్ట్రాలలో యూనివర్సిటీలు, సంస్థలు ఒకే పేరుపై ఉండటం వల్ల పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయనీ, అందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణ కు సంబంధించిన పేర్లే పట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ చెప్పారు.
ఇందుకు సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ చట్ట సరవణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో మంగళవారం (మార్చి 17) ప్రవేశపెట్టారు. అనంతరం ఈ బిల్లుపై జరిగిన చర్చలో రేవంత్ మాట్లాడుతూ తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నట్లు చెప్పారు. ఇక చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పొట్టి శ్రీరాములు పేరు పెడతామని, ఇందు కోసం కేంద్రానికి ప్రతిపాదన పంపుతామని చెప్పారు. ఇక బల్కంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పేరు పెడతామని చెప్పారు.
తెలుగువర్సిటీ పేరు మార్పు ప్రతిపాదనను బీజేపీ వ్యతిరేకించింది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ పేరు మార్చకుండా.. ఉస్మానియా యూనివర్సిటీకి సురవరం ప్రతాప రెడ్డి పేరును పెట్టాలని ప్రతిపాదించారు అనంతరం తెలుగు వర్శిటి పేరు మార్పు చేసే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pottisreeramulu-telugu-university-name-change-25-194534.html
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.