ఉడుతకు పోస్టు మార్టం.. హెన్షన్ వైర్లను అదే కొరికేసిందని నిరూపించే యత్నం
Publish Date:Jul 1, 2022
Advertisement
ఉడుతా ఉడుతా ఉచ్.. ఎక్కడి కెడతా ఉచ్ కొమ్మమీద జాంపండు కోసుకొస్తావా అంటూ చిన్న పిల్లలు చిన్నప్పుడు పాడుకునే పాట. అయితే ఇప్పుడు ఏపీలో ఉడుతలు జాంపడ్లు కొరకడం మానేశాయి. అవి హైటెన్షన్ విద్యుత్ విద్యుత్ వైర్లు కొరికే పనిలో బిజిగా ఉన్నాయి. ఔను నిజమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం అదే చెబుతోంది. అదే నమ్మి తీరాలంటోంది. నమ్మకపోతే మీ ఖర్మ. కావాలంటే హైటెన్షన్ విద్యుత్ వైర్లు కొరికి చనిపోయిన ఉడుత పోస్టు మార్టం రిపోర్టు చూడండంటోది. ఏపీలో ప్రభుత్వం ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తోందో చెప్పడానికి ఇంత కంటే మరో ఉదాహరణ ఉండదు. సత్యసాయి జిల్లాలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడిన సంఘటనలో ఐదుగురు కూలీలు సజీవ దహనమయ్యారు. అయితే ఆ హైనెన్షన్ విద్యుత్ వైర్లు తెగిపడటానికి విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని జనాలను నమ్మించడం ఇప్పుడు ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైన విషయం అయిపోయింది. లేకపోతే.. విద్యుత్ శాఖకు కనీసం మెయింటెయినెన్స్ కు కూడా నిధులు కేటాయించని ప్రభుత్వాన్ని జనం నిలదీస్తారు. అందుకే ఆ వైర్లు తెగిపడటానికి కారణం ఉడేతేనని జనాన్ని నమ్మించడానికి మించిన ముఖ్యమైన పనేం లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. విద్యుత్ అధికారులు ఉడుత కొరికేయడం వల్లే హై టెన్షన్ వైర్లు తెగిపడ్డాయని చెప్పారు. అక్కడితో ఊరుకోకుండా కరెంట్ స్తంభంపై చచ్చి పడున్న ఉడుతకు పోస్టు మార్టం చేయడానికి సిద్ధమైపోయారు. అసలు ఉడుత కొరికితే తెగిపడేంత బలహీనంగా హైనెన్షన్ విద్యుత్ వైర్లు ఉంటాయా? ఒక వేళ ఉడుత వాటిని కొరికి షాక్ కొట్టి చచ్చి ఉంటే.. అది కరెంట్ స్తంభంపై ఎందుకు ఉంటుంది. కాలి బూడిదై ఉండదా? ఇంత చిన్న విషయాన్ని ప్రభుత్వం ఎందుకు ఉద్దేశ పూర్వకంగా విస్మరిస్తోంది? సరే ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు ఉడుతకు పోస్టుమార్టం నిర్వహించి, విద్యుత్ వైర్లను అదే కొరికేసిందని రిపోర్టు ఇవ్వడానికి ప్రభుత్వ ఆదేశాలతో విద్యుత్ శాఖ సిద్ధమైపోయింది. తామేం చెబితే అదే రైటు.. జనం నమ్మి తీరాలి అన్నతీరులో ప్రభుత్వం, విద్యుత్ శాఖ ఉన్నాయి. అందుకే అంటారు యథా రాజా తథా అధికారులూ అని. జగన్ హయాంలో ఏం జరిగినా, ప్రభుత్వాధికారులు ఎన్ని వింత వింత పోకడలకు పోయినా అంతా జగన్మాయ అని సరిపెట్టుకోవాల్సిందే.
http://www.teluguone.com/news/content/postmartum-to-aqurril-to-prove-it-is-the-culprit-39-138889.html





