Publish Date:Mar 13, 2025
గుండె నొప్పి డ్రామా ఫెయిలవ్వడంతో పోసాని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారా? అంటే సీఐడీ కోర్టులో బుధవారం (మార్చి 12) పోసాని చేసిన ఆత్మహత్యే శరణ్యం వ్యాఖ్యలను బట్టి ఔననే సమాధానమే వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. పీటీ వారంట్ పై పోసానిని కర్నూలు జైలు నుంచి అదుపులోనికి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచిన సందర్భంగా పోసాని న్యాయమూర్తి ఎదుట భోరు మన్నారు. బెయిలు ఇవ్వకుంటే తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ దాదాపు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసినంత పని చేశారు.
తన ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని, రెండు స్టంట్ లు వేశారనీ చెప్పుకున్నారు. తాను అడ్డూ అదుపూ లేకుండా చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించకుండా, తనపై వ్యక్తిగత కక్షతోనే ఫిర్యాదులు చేస్తున్నారంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఒకటి రెండు రోజులలో బెయిలు రాకుంటే ఆత్మహత్యే చేసుకుంటానని బెదరింపులకు దిగారు. అయితే న్యాయమూర్తి పోసానిని రిమాండ్ కు పంపారు. దీంతో పోసానికి గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వాస్తవానికి పోసానికి ఇతర కేసులలో బెయిలు లభించింది. అంతే కాదు ఆయనపై ఉన్న ఇతర కేసులలో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయన కర్నూలు జైలు నుంచి బుధవారం (మార్చి 12) విడుదల అవుతారని అంతా భావించారు.
అయితే అనూహ్యంగా సీఐడీ రంగంలోకి దిగింది. పీటీ వారెంట్ పై ఆయనను అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కోర్టులో ప్రవేశ పెట్టింది. బెయిలు, రిమాండ్ విషయాలను పక్కన పెడితే.. పోసాని తన నటనతో ప్రేక్షకులను మెప్పించినట్లుగానే చట్టాన్ని, న్యాయవ్యవస్థను కూడా మెప్పించేయగలనని భావిస్తున్నట్లు కనిపిస్తోందని నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. గుండెనొప్పి డ్రామాను కడప రిమ్స్ వైద్యులు బట్టబయలు చేసిన తరువాత ఆయన ఇప్పుడు ఆత్మహత్య శరణ్యం అంటూ కన్నీళ్ల డ్రామాకు తెరతీసినట్లుందని అంటున్నారు. అయినా ఆత్మహత్యే శరణ్యం అంటూ ఏకంగా కోర్టులోనే చెప్పిన పోసాని కృష్ణ మురళిపై మరో కేసు నమోదు చేయాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/posani-new-drama-in-court-39-194328.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది