యాక్టింగ్ లో తోపు, రైటింగ్ లో టాప్.. పోసాని బాప్ రే బాప్!

Publish Date:Mar 3, 2025

Advertisement

పోసాని కృష్ణ మురళి.. తనదైన విలక్షణ నటనతో సినిమాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రచయతగా ఇండస్ట్రీలోకి వచ్చిన పోసాని.. రచయతగా కంటే నటుడిగానే ఎక్కువ సక్సెస్ అయ్యారు. సినీమాలలో డిమాండ్ ఉన్న సమయంలోనే ఆయన దృష్టి రాజకీయాల వైపు మళ్లింది. దీంతో కొంత కాలం రెండు పడవలపై కాళ్లుంచి పయనం సాగించిన పోసాని.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న తరువాత పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమైపోయారు. మధ్యమధ్యలో అడపాదడపా  సినిమాలలో కనిపించినా.. వైసీపీ రాజకీయాలలోనే ఆయన ఎక్కవ సమయం గడిపారు. 

సినీమాలలో నటించడం కంటే.. వైసీపీ తరఫున మీడియా సమావేశాలలో ప్రత్యర్థులపై   విమర్శలు, తిట్టు కురిపిస్తే ఎక్కువ గిట్టుబాటు అవుతుందనుకున్నారో ఏమో ముఖానికి రంగు పూసుకోవలసిన అవసరం లేకుండా మైకుల ముందు నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆ క్రమంలో ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేనాని పవన్ కల్యాణ్ ల పైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో ఇష్టారీతిగా రెచ్చిపోయారు. అంతే కాకుండా సమాజంలో కుల విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. 

వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం పోసానీ అవాకులు, చెవాకులకు అంతు లేకుండా పోయింది. ఎప్పుడైతే వైసీపీ ఎన్నికలలో పరాజయం పాలై గద్దె దిగిపోయిందో.. అప్పుడే పోసాని రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. పరోక్షంగా తన వ్యాఖ్యలకు, చేష్టలకు క్షమాపణలు కోరారు. అయితే కర్మ వదలదుగా, ఆయన అనుచిత వర్తనపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఒక కేసులో మూడు రోజుల కిందట పోసాని కృష్ణమురళి అరెస్టయ్యారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో రాజంపేట జైలుకు తరలించారు. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ సోమవారం (మార్చి 3) విచారణకు రానుంది. మామూలుగా అయితే బెయిలు వచ్చే అవకాశం లేదని భావించిన పోసాని.. ఆరోగ్య కారణాలు చూపుతూ బెయిలు సాధించేందుకు గుండెపోటు డ్రామాకు తెరతీశారు. ఆయన గుండె పోటు అంటూ జైలు అధికారులకు చెప్పడానికి కొద్ది సేపటి ముందు రాజంపేట సబ్ జైలులో ఆయనను రాజంపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత అకెపాటి అమర్నాథ్ రెడ్డి ములాఖత్ ద్వారా కలిశారు. అలా అమర్నథ్ రెడ్డి పోసానితో భేటీ అయి వెళ్లారో లేదో ఇలా పోసాని గుండెల్లో నొప్పి అంటూ జైలు అధికారులకు చెప్పారు. అమర్నాథ్ రెడ్డి ములాఖత్ టైమ్ లోనే గుండెపోటు డ్రామాకు స్క్రిప్ట్ రెడీ అయ్యిందన్న అనుమానాలు ఉన్నాయి. స్వతహాగా రచయత అయిన పోసాని.. ఈ స్క్రిప్ట్ మాత్రం తనకోసం తానే రాసుకుని, ప్రాణం పెట్టి జీవించేశారని నెటిజనులు ట్రోల్  చేస్తున్నారు.  వెంటనే జైలు సిబ్బంది ఆయనను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ వైద్య పరీక్షలు చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం అంటూ కడప రిమ్స్ కు తరలిం చారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు పోసానికి గుండె పోటే కాదు.. అసలెలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని నిర్ధారించారు. దీంతో ఆయనను మళ్లీ రాజంపేట సబ్ జైలుకు తరలించారు. దీంతో పోసాని సినిమాలలోనే కాదు.. జీవితంలోనూ బ్రహ్మాండంగా నటించగలరని లోకానికి వెల్లడైపోయింది. బెయిలు కోసం గుండెపోటు డ్రామా ఆడారని నెటిజనులు ఒక రేంజ్ లో పోసానిని ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పోసాని బెయిలు సంగతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మరో 16 పోలీసు స్టేషన్లలో ఆయనపై నమోదైన కేసులలో అదుపులోనికి తీసుకోవడానికి ఆయా పీఎస్ లు పీటీ వారెంట్లతో రాజంపేట సబ్ జైలుకు క్యూకడుతున్నాయి. తొలుత పీటీ వారెంట్ తో వచ్చిన నరసరావు పేట పోలీసులు ఆయనను అదుపోలోనికి తీసుకున్నారు. ఇహనో ఇప్పుడో నరసరావు పేట కోర్టులో పోసానిని హాజరు పరుస్తారు.  గుండోపోటు నటనలో పోసాని జీవించేసినా.. ఫలితం లేకపోవడమే కాదు.. ఇప్పుడు పోసాని ఈ కేసు కాకపోతే మరో కేసు అంటూ వరుస అరెస్టులకు రంగం సిద్ధమైంది.  

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.