పోసాని అరెస్ట్.. నెక్స్ట్ ఎవరు?.. జగన్ కు ఇక జైలు యాత్రలే!

Publish Date:Feb 26, 2025

Advertisement

వైసీపీ హ‌యాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో.. వారిని వదిలే ప్రసక్తే లేదు.. వెయిట్ అండ్‌ వాచ్.. మార్క్ మై వర్డ్స్‌.. టైం.. డేట్‌ కూడా రాసుకోండి అంటూ మంత్రి నారా లోకేశ్ మండ‌లిలో ప్ర‌తిప‌క్ష స‌భ్యుల‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. త‌ద్వారా త్వ‌ర‌లో మ‌రికొంత మంది వైసీపీ నేత‌లు అరెస్టు కాబోతున్నార‌ని లోకేశ్ క్లియర్ కట్ గా చెప్పారు. దీంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. ఎవ‌రు ఎప్పుడు క‌ట‌క‌టాల పాలుకావాల్సి వ‌స్తుందోన‌ని భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. ఇప్ప‌టికే వ‌ల్ల‌భ‌నేని వంశీపై వ‌రుస‌గా కేసుల మీద కేసులు నమోదౌతున్నాయి. సిట్ విచార‌ణ కొన‌సాగుతుంది. ఇప్ప‌ట్లో వంశీ బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. తాజాగా.. సినీ న‌టుడు, వైసీపీ నేత‌ పోసాని కృష్ణ‌ముర‌ళిని పోలీసులు అరెస్టు చేశారు.

 పోసాని కృష్ణ ముర‌ళిని  రాయ‌చోటి పోలీసులు అరెస్టు చేశారు. బుధ‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని రాయ‌దుర్గం మైహోం భూజా అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   త‌రువాత ఆయ‌న్ను ఏపీకి త‌ర‌లించారు. అరెస్టు స‌మ‌యంలో పోలీసులతో పోసాని వాగ్వివాదానికి దిగారు. బనీన్, నిక్కర్ మీదనే హడావుడి చేశాడు. డ్రెస్ వేసుకుని రావాలని చెప్పినా వినకుండా ఆయన ఓవరాక్షన్ చేస్తుండ‌టంతో.. అతి క‌ష్టంమీద పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిసింది. గురువారం (ఫిబ్రవరి 27) రాజంపేట కోర్టులో పోసానిని హాజ‌రుప‌రిచే అవ‌కాశం ఉంది.  పోసానిపై గ‌తంలో కేసులు న‌మోద‌య్యాయి. అన్న‌మ‌య్య జిల్లా ఓబుల‌వారిప‌ల్లె పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. చంద్ర‌బాబు, ప‌వ‌న్, లోకేశ్‌పై అనుచిత విమ‌ర్శ‌లు చేశార‌ని స్థానికుల ఫిర్యాదు మేర‌కు 196, 353(2), 111 రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌తంలో వారెంట్ ఇచ్చిన‌ప్ప‌టికీ పోసాని స్పందించ‌లేదు. దీంతో బుధ‌వారం రాత్రి సంబేప‌ల్లి ఎస్ఐ రాయ‌దుర్గం చేరుకొని పోసానిని అరెస్టు చేశారు 

వైసీపీ ప్ర‌భుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ చైర్మ‌న్‌గా పోసాని కృష్ణ ముర‌ళి ప‌నిచేశారు. ఆ స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు నారా లోకేశ్ ను అస‌భ్య‌క‌రంగా దూషించారు. వారి ఇంట్లో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని కూడా వదిలి పెట్టకుండా దూషించాడు. దీంతో ఏపీలోని ప‌లు స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో అభ్యంత‌ర‌క‌ర భాష‌తో కూట‌మి నేత‌ల‌ను దూషించారు. ఇటీవ‌ల కాలంలో టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడిపైనా అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ఆయ‌న‌పై బాప‌ట్ల‌, అనంత‌పురం, ప‌ల్నాడు జిల్లా న‌ర‌స‌రావుపేట, చిత్తూరు జిల్లా యాద‌మ‌రి, తిరుప‌తి జిల్లా పుత్తూరులో పోలీసుల‌కు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా ప‌లు అంశాల‌పై పోసానిపై 11 కేసులు న‌మోద‌య్యాయి. ఇదిలా ఉంటే.. రెండు నెల‌ల క్రితం పోసాని మీడియా స‌మావేశం పెట్టి తనకు జ్ఞానోద‌యం అయ్యిందనీ, ఇకపై రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో కూట‌మి ప్ర‌భుత్వం త‌న‌ను వ‌దిలేస్తుంద‌ని పోసాని భావించిన‌ట్లున్నారు. కానీ, బండ‌బూతులు తిట్టి రాజ‌కీయాలు వ‌దిలేశానంటే వ‌ద‌ల‌ర‌ని పోలీసులు ఆయనను అరెస్టు చేయడంతో క్లారిటీ వచ్చేసినట్లయింది. 

మండ‌లిలో లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ త‌రువాత చాలా మంది వైసీపీ నేత‌లు ర‌హ‌స్య ప్రాంతాల‌కు వెళ్లి త‌ల‌దాచుకుంటున్నార‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. వంశీ అరెస్టు త‌రువాత ఎవ‌ర్ని అరెస్టు చేస్తారోన‌ని వైసీపీ నేత‌లు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. అయితే ముందుగా పోసాని వంతు వ‌చ్చింది. పోసానిని అరెస్టు చేసిన త‌రువాత నెక్ట్స్ ఎవ‌రు..? అనే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. అయితే, ఈసారి ప‌క్కాగా కొడాలి నాని అరెస్టు ఉంటుంద‌ని వైసీపీ నేత‌లు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే కొడాలి నానిపై పోలీసులు దృష్టిసారించిన‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో ఆయ‌న‌పై కేసులు, ప్ర‌స్తుతం ప‌లు స్టేష‌న్‌ల‌లో ఆయ‌న‌పై న‌మోదైన కేసుల వివ‌రాల‌ను సేక‌రిస్తున్నార‌ట‌. దీంతో కొడాలి నానిసైతం హైద‌రాబాద్ తోపాటు బెంగ‌ళూరు వంటి న‌గ‌రాల్లోనే ఎక్కువ‌గా ఉంటున్నార‌ని టాక్ న‌డుస్తోంది. ఇటీవ‌ల వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వంశీని ప‌రామ‌ర్శించేందుకు విజ‌య‌వాడ జైలుకు వెళ్లారు. ఆ స‌మ‌యంలో జ‌గ‌న్ వెంట కొడాలి నాని ఉన్నాడు. మ‌రుస‌టి రోజు గుంటూరు మిర్చి యార్డుకు జ‌గ‌న్ వెళ్లిన స‌మ‌యంలోనూ కొడాలి నాని ఉన్నాడు. ఆ వెంట‌నే కొడాలి నాని త‌న అనుచ‌రుల‌కు కూడా చెప్ప‌కుండా ర‌హ‌స్య ప్రాంతానికి వెళ్లిపోయిన‌ట్లు టాక్ న‌డుస్తోంది. వైసీపీ నేత‌లు సైతం అధిక‌ శాతం మంది పోసాని త‌రువాత కొడాలి నాని అరెస్టు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. 

పోసాని కృష్ణముర‌ళి అరెస్టుతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ళ్లీ బెంగ‌ళూరు నుంచి ఏపీకి రావాల్సిన ప‌రిస్థితి త‌లెత్తింది. అధికార మ‌దంతో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించిన వైసీపీ నేత‌లను పోలీసులు అరెస్టులు చేసి జైళ్ల‌కు పంపిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ బెంగ‌ళూరు నుంచి నేరుగా జైలుకు వెళ్లి వైసీపీ నేత‌ల‌ను ప‌రామ‌ర్శిస్తున్నారు. ఇటీవ‌లే విజ‌య‌వాడ జైలుకెళ్లి వ‌ల్ల‌భ‌నేని వంశీతో జ‌గ‌న్ ములాఖ‌త్ అయ్యాడు. ప్ర‌స్తుతం పోసాని ముర‌ళీ కృష్ణ కోసం జ‌గ‌న్ మ‌ళ్లీ బెంగ‌ళూరు నుంచి నేరుగా జైలుకెళ్లి ప‌రామ‌ర్శించే అవ‌కాశం ఉంది. అంతే ముందు ముందు జగన్   మ‌రిన్ని జైలు యాత్రలు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌ని వైసీపీ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తున్నది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.