పొంగులేటి పయనమెటు ?

Publish Date:Jan 21, 2023

Advertisement

అంతా అయిపోయింది, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీజేపీలో చేరడం ఖాయమని ప్రచారం జరిగింది. ఇక  కండువాలు కప్పుకోవడమే మిగిలుందని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జనవరి 18న ఇక్కడ ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరుగుతున్న సమయంలోనే, అక్కడ ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో పొంగులేటి, ‘కడువా’ మార్పిడి వేడుకకు ముహూర్తం ఖరారైందనే ప్రచారం జరిగింది.

అఫ్కోర్స్, బీజేపీ ముఖ్యనాయకులు ఎవరూ అధికారికంగా అలాంటి ప్రకటన ఏదీ చేయక పోయినా, సోషల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే పెద్ద ఎత్తునే ప్రచారం జరిగింది. అయితే జనవరి 18 వచ్చింది వెళ్ళింది. పొంగులేటి అయన వర్గం సభకు హాజరు కాలేదు కానీ, అనుకున్నవిధంగానే ధూం ..దాంగా బీఆర్ఎస్  ఆవిర్భావ సభ జరిగింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ఆశించినంత కాకపోయినా జన సమీకరణ కూడా భారీగానే జరిగింది. కానీ  పొంగులేటి బీజేపీ కండువా కప్పుకోలేదు. అసలు ఢిల్లీ వెళ్ళనే లేదు. అంతే కాదు, ఆతర్వాత ఆ ఊసే ఎక్కడ వినిపిచడం లేదు. 

మరోవంక పొంగులేటి మనసు మార్చుకున్నారని, బీజేపీలో చేరడమా, కాంగ్రస్ లో కలవడమా అనే మీమాంసలో ఉన్నారని అంటున్నారు. బీజేపీలో చేరితే రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుదనే విషయంలో పొంగులేటికీ కొన్ని అనుమానాలున్నాయని అంటున్నారు. భారాసలో ఎదురైన చేదు అనుభావాలే అక్కడా ఎదురవుతాయనే భయంతోనే వెనకడుగు వేశారని అంటున్నారు. అలాగని, కాంగ్రెస్ లో చేరితే రాజకీయంగా ఢోకా ఉండదు. కానీ, ఇంతవరకు వచ్చి వెనకడుగు వేస్తే  మోడీ, షా నిముషం ఆలస్యం చేయకుండా ఐటీ, ఈడీ గొలుసులు విప్పుతారనే భయం పొంగులేటిని వెంటాడుతోంది. ఇప్పడు ఈ రెండు భయాల మధ్య ఆయన అటూ ఇటూ ఉగుతున్నారని, అంటున్నారు. 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీల బలాబలాలను బేరీజు వేసుకుంటే, బీజేపీ కంటే కాంగ్ర్రేస్ పార్టీ పుష్టిగా, పటిష్టంగా వుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మంచి పట్టుంది. గట్టి నాయకులున్నారు. కమిట్మెంట్ తో పనిచేసే క్యాడర్ వుంది. అదే సమయంలో గత ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఒక్క భట్టి మినహా మిగిలిన వారంతా కట్టకట్టుకుని భారాసలోకి దూకేశారు.  సో..పొంగులేటి తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోగలుగుతారు. అఫ్కోర్స్ టిక్కెట్ల వరకు బీజేపీలో అయితే అసలు ఆ మాత్రం  సమస్య కూడా లేదు. కానీ జిల్లాలో బీజేపీకి కనీస ఉనికి లేదు. లీడర్లు లేరు.. క్యాడర్ లేరు. సో  రాజకీయ లెక్కలు బేరీజు వేసుకుంటే, కాంగ్రెస్ లో చేరడమే ఉత్తమం. 

నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయనకు ఆఫర్లు వచ్చాయి. తమ పార్టీలో చేరాలని కాంగ్రెస్ నేతలు  పిలుపునిచ్చారు. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డైలమాలో పడిపోయారని అంటున్నారు. అయితే, బీజేపీ నాయకులు మాత్రం పొంగులేటి తమ పార్టీలో చేరడం ఖాయమని, అయితే, ఢిల్లీలో కాకుండా, రాష్ట్రంలో తెలంగాణ ప్రజల సమక్షంలో బీజేపీలో చేరాలని భావిస్తున్నారని, అందుకే చేరిక  పోస్ట్ పోన్ అయ్యిందని  అంటున్నారు. ముందు   ఈనెల ( జనవరి) 28 అమిత్ షా రాష్ట్ర పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరతారని అనుకున్నా, ఇప్పుడు షా పర్యటన రద్దవడంతో, ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి పార్టీలో చేరడం ఖాయమని అంటునారు.

ఇక అప్పుడు కూడా పొంగులేటి బీజేపీలో చేరలేదంటే..ఆయన యూ  టర్న్   తీసుకున్నట్లే అవుతుందని అంటున్నారు. అయితే, ముందు నుంచి కూడా పొంగులేటి బీజేపీలో చేరడం ఒక ప్రహసనంగా సాగుతోంది. ముందుగా  జనవరి 15 న ప్రధాని హైదరాబాద్ పర్యటన సందర్భంగా పొంగులేటి బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది,అయితే మోడీ పర్యటన్ రద్దవడంతో సీన్ ఢిల్లీకి మారింది, అది జరగలేదు. మళ్ళీ జనవరి 28 న అమిత్ షా రాష్ట్ర  పర్యటన సందర్భంగా అనుకుంటే అదీ రద్దయింది .ఇక ఇప్పుడు ఫిబ్రవరి 13వ ప్రధానిమోడీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా అంటున్నారు .. ఇలా వినాయకుడి పెళ్ళికి వేయి విఘ్నాలు అన్నట్లు, పొంగులేటి పార్టీ మారే ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని, అంటున్నారు. అయితే.. ఆలస్యం అయినా, పొంగులేటికీ మాత్రం లెక్కలు సరిచూసుకునేందుకు కావలసినంత సమయం అయితే చిక్కింది.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.