నితీష్ టార్గెట్ గా పీకే పొలిటికల్ ఎంట్రీ

Publish Date:Jan 22, 2023

Advertisement

నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ ఈ ఇద్దరిలో ఏ ఒక్కరికీ పరిచయం అవసరం లేదు. ఒకరు, కుర్చీలోంచి కదలకుండా  అలవోకగా కూటములు మార్చడంలో మాస్టర్స్ డిగ్రీ చేసిన జేడీయు నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. రెండవ వ్యక్తి, ఒక దశాబ్ద కాలంగా  దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న, రాజకీయలలో ప్రముఖంగా వినిపిస్తున్న, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు కావడం ఒకటైతే, ఇద్దరికిద్దరూ, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు చురుగ్గా పావులు  కదుపుతున్నారు.

అలాగే, ఇద్దరికిద్దరూ, రాజకీయాలను ఆవపోసన పట్టిన ఉద్దండ పిండాలు. అంతే కాదు రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే నానుడికి నిలువెత్తు నిదర్శనం ఈ బీహారీ జోడీ. రాజకీయాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో ఇద్దరికిద్దరూ అందె వేసిన చెయ్యిగా గుర్తింపు పొందారు. అఫ్కోర్స్, ఆ ప్రయత్నాలలో అన్ని వేళలా సక్సెస్  కాకపోవచ్చును, అయినా, ప్రయత్నాలు అయితే విరమించుకోలేదు. ఈ ఇద్దరి మధ్య, (ఇక్కడ అసందర్భమే అయినా)  మరో సారూప్యం కూడా వుంది. ఈ ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుట్ల చంద్రశేఖర రావుకు మంచి మిత్రులు. మంచి శత్రువులు.  అయితే ఇప్పడు విషయం అది కాదు. సో   ఆ విషయాన్ని పక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే ...  

బీహార్ సీఎం నితీష్ కుమార్  'సమాధాన్ యాత్ర' పేరిట బీహార్లో యాత్ర చేపట్టారు. మరో వంక, ఒకప్పుడు జేడీయు ఉపాధ్యక్షుడిగా  కీలక బాధ్యతలు నిర్వహించిన ప్రశాంత్ కిశోర్ ఆ తర్వాతి కాలంలో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాలు తన వంటికి పడవని ప్రకటించుకున్నారు. నేనొక విఫల రాజకీయ వేత్తనని చెప్పుకున్నారు. ఇక పై క్రియాశీల రాజకీయాల్లో వేలు పెట్టనని ప్రకటించుకున్నారు.అయితే, ఒపీనియన్ మార్చుకుని, ప్రత్యక్ష రాజకీయాల్లో వేలు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్త అవతారానికి ఫుల్ స్టాప్ పెట్టిన ప్రశాంత్ కిశోర్  ఇప్పటికే, జన సూరజ్  యాత్ర పేరిట బీహార్ లోని చంపరాన్ జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్నారు. 

అయితే, ఎవరి మానాన వారు ఎవరి యాత్ర వారు చేసుకుంటే ఏమో కానీ, ఒకప్పుడు జిగ్నీ దోస్తులుగా ఉన్న ఆ ఇద్దరి మధ్య ఇప్పడు మాటాల యుద్ధం నడుస్తోంది. నిజానికి  ఇప్పుడే కాదు చాల కాలంగా ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగింది. ఈ నేపధ్యంలో నితీష్ కుమార్ ప్రారంభించిన యాత్రపై ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు, బీహార్ రాష్ట్ర రాజకీయాలలోనే కాదు జాతీయ రాజకీయాల్లోనూ  వేడి  పుట్టిస్తున్నాయి.  పీకే విపక్ష్ల ఐక్యతకు గండి కొట్టే ప్రయత్నాలకు  ఆయన శ్రీకారం చుట్టినట్లుగా భావిస్తున్నారు. 

ప్రజలను మరోమారు మోసం చేసేందుకే నితీష్ యాత్ర చేపట్టారని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు ప్రశాంత్ కిశోర్  కోరి కోరి కాలు దువ్వుతున్నట్లు ఉందని అంటున్నారు. నితీష్ గతంలో అనేక యాత్రలు చేసిన విషయాన్నిగుర్తు చేసిన ప్రశాంత్ కిషోర్.. వాటి వల్ల రాష్ట్రానికి ఏం లాభం చేకూరిందని ప్రశ్నించారు. కేవలం ప్రజలను మభ్యపెట్టే  ప్రయత్నంలో భాగంగానే నితీష్ ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు. అలాగే, రాహుల్ భారత్ జోడో యాత్రలో ముఖ్యమంత్రి నితీష్ పాల్గొనకపోవడంపై కూడా ప్రశాంత్ కిషోర్ స్పందించారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ యాత్రకు హాజరవుతున్నా, నితీష్ మాత్రం రాహుల్ యాత్రకు దూరంగా ఉన్నారని అన్నారు. 'మహాఘట్ బంధన్' ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయినప్పటికీ ఆ పార్టీ యాత్రపై ముఖ్యమంత్రి ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నించారు.అలాంటప్పుడు ఆయన ప్రతిపక్షాల ఐక్యత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

అయితే, ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలను నితీష్ కుమార్ అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ, జేడీయు నేతలు మాత్రం ప్రశాంత్  కిశోర్ కు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. నితీష్ కుమార్ ని విమర్శించే ముందు, ప్రశాంత్ కిశోర్  ఆత్మ విమర్శ చేసుకోవాలని అంటున్నారు. మరో వంకఎన్నికలు దగ్గరవుతున నేపధ్యంలో బీహార్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని, అందులో ప్రశాంత్ కిశోర్ ఫాక్టర్ కుడా ఒకటి పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 సీజేపీ నిరసన తెలిపేందుకు అనుమతి కోరిన తర్వాత, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశంగా డీనోటిఫై చేయడం నుండి నీట్ పేపర్ లీక్ సమస్యల వరకు అన్నామలై కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు.
కాన్వాయ్ భద్రతా సిబ్బంది లేకుండా, ప్రోటోకాల్స్ ను కాదని మరీ సీఎం చంద్రబాబు అధికారిక నివాసానికి చేరుకుని ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ భేటీలో ఇరువురూ, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు  స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగిందని అంటున్నారు.  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.