మాజీ మంత్రి రోజాకు నోటీసులు.. అరెస్టే తరువాయా?

Publish Date:Jul 27, 2026

Advertisement

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు,  మాజీ మంత్రి,  ఆర్.కె. రోజా అరెస్టు కాక తప్పదా? తాజాగా పోలీసులు రోజాకు నోటీసులు జారీ చేయడంతో రాజకీయవర్గాలలో రోజా అరెస్టు అవుతారా అన్న చర్చ జోరందుకుంది.   ఒక పాత కేసు విషయంలో విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు ఆమెకు తాజాగా నోటీసులు జారీ చేశారు.  ఆ నోటీసులలో  ఈ నెల 30 న విచారణాధికారుల ఎదుట  హాజరుకావాలని, లేనిపక్షంలో  అరెస్ట్ చేస్తామనీ పేర్కన్నారని అంటున్నారు.  రోజా ఇటీవల కొంత కాలంగా రాజకీయంగా పెద్దగా క్రియాశీలంగా ఉండటం లేదు. 

తాజాగా పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేయడానికి, వైసీపీ హయాంలో పర్యాటక, సాంస్కృతిక, యువజన సంక్షేమం, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సంగతి విదితమే.. ఆ సమయంలో   రాష్ట్రవ్యాప్తంగా ఆడుదాం ఆంధ్ర  క్రీడా పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా   క్రీడా పరికరాల కొనుగోల విషయంలో  భారీ స్థాయిలో అక్రమాలు, నిధుల మళ్లింపు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.  ఆ తరువాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధకారంలోకి వచ్చాకా, ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై   వివిధ పోలీస్ స్టేషన్లలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదయ్యాయి. ఆ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో  అప్పటి మంత్రి రోజాను ప్రశ్నించడం కోసం నోటీసులు జారీ చేశారు.  ;

పోలీసు నోటీసుల మేరకు రోజా ఈ నెల 30న విచారణకు హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరు కాకున్నా, విచారణలో అధికారులకు సహకరించకున్నా అరెస్టు తప్పదని ఆ నోటీసులలోనే పేర్కొన్నట్లు తెలుస్తోంది. 

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి మాజీ మంత్రి రోజా రాజకీయంగా పెద్దగా క్రీయాశీలంగా వ్యవహరించడం లేదు. కానీ గతంలో ఆమె విపక్షాలపై మీడియా సమావేశాల్లో, సభల్లో పెద్ద ఎత్తున విమర్శలతో విరుచుకుపడేవారు. ఆ సందర్భంగా ఆమె అనుచిత భాషా ప్రయోగం చేసేవారన్న ఆరోపణలున్నాయి. అయితే 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి, తాను కూడా స్వయంగా నగరి నుంచి పరాజయం పాలైన తరువాత నుంచి ఆమె మీడియా ముందుకు రావడం బాగా తగ్గించారు. పైగా ఎక్కువ సమయం తమిళనాడు రాజధాని చెన్నైకే పరమితమౌతూ వస్తున్నారు. ఒక సందర్భంలో ఆమె టీవీకేలో చేరేందుకు తెగ ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. సరే కేసుల భయతోనే రోజా రాజకీయంగా దూకుడు తగ్గించారని పరిశీలకులు విశ్లేషణనలు కూడా చేశారు.  గత కొంత కాలంగా చెన్నైకే పరిమితమైన రోజా.. నగరి నియోజకవర్గానికి వచ్చిన రెండు రోజులలోనే పోలీసులు ఆమె ఇంటికి వచ్చి మరీ నోటీసులు అందించారు.  

కాగా రోజాకు పోలీసులు అందజేసిన నోటీసులలో  ఆడుదాం ఆంధ్ర అవకతవకలతో పాటుగా, అప్పట్లో రోజా మంత్రిగా వ్యవహరించిన  పర్యాటక  శాఖ ఆధ్వర్యంలో జరిగిన పలు కాంట్రాక్టులు, నిర్వహణ నిధుల వ్యయంలో జరిగిన కేటాయింపులపై కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ గతంలోనే దాఖలైన ఫిర్యాదుల ఆధారంగా విచారణ అధికారులు కీలక ఆధారాలు సేకరించారని తెలుస్తోంది. క్రీడా సామాగ్రి కొనుగోలు టెండర్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ప్రాథమిక నివేదికల ఆధారంగానే ఇప్పుడు రోజాకు నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు.  

By
en-us Political News

  
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్‌ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్‌ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.