కాలుష్యం పర్యావరణానికి చేస్తున్న హాని ఇంతా అంతా కాదు. మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న కాలుష్యం.. పశుపక్ష్యాదుల ఉసురు కూడా తీస్తున్నది. ముఖ్యంగా జలాలలోకి పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా విడుదల చేస్తుండటంతో వలస పక్షులు బలి అవుతున్నాయి. ప్రతి శీతాకాలంలో విదేశాల నుంచి వలస వచ్చి హైదరాబాద్ శివారు కిష్టారెడ్డి పేట్ సరస్సును ఆవాసంగా చేసుకునే విదేశీ పక్షులు జల కాలుష్యం కాటుకు బలి అవుతున్నాయి. కిష్టారెడ్డిపేట్ సరస్సులోకి పరిశ్రమల వ్యర్థాలను యథేచ్ఛగా విడుదల చేస్తుండటమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వలస పక్షుల కిలకిలారావాలతో వీనులకు, కన్నులకు విందుగా విలసిల్లాల్సిన కిష్టారెడ్డి పేట్ సరస్సు నేడు ఆ వలస పక్షులకు అంతిమ విడిదిగా మారిపోయింది. సంగారెడ్డి- మేడ్చల్ జిల్లాల మధ్యలో ఉన్నఈ సరస్సులోకి చుట్టుపక్కల ఉన్న ఫార్మా, కెమికల్ కంపెనీల నుంచి వ్యర్థ కలుషిత జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఈ సరస్సు వలస పక్షుల పాలిట శాపంగా మారిన పరిస్థితులు దాపురించాయి.
పరిశ్రమల వ్యర్థాలను సరస్సులోకి విడుదల చేయకుండా నియంత్రించాల్సిన కాలుష్య నియంత్రణ మండలి ఆ పని చేయకపోవడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని పర్యావరణ ప్రేమికులు విమర్శిస్తున్నారు. పెద్ద సంఖ్యలో వలస పక్షులు మరణించడంతో చేతులు కాలాకా ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలి అధికారులు రంగంలోకి దిగారు. పరిశ్రమల నుంచి వెలువడిన కాలుష్యం ఒక్కటే కాదు, గృహాల నుంచి వ్యర్థాలను తీసుకొచ్చి సరస్సులో కలపడం వల్ల కూడా సరస్సు జలం కలుషితమైందనీ, అందుకే పక్షులు పెద్ద సంఖ్యలో మరణించాయనీ అంటున్నారు. కిష్టారెడ్డిపేట్ సరస్సులోని నీటి నమూనాలను సేకరించారని, పరీక్షల్లో నీరు కలుషితమైందని తేలితే అందుకు కారణమైన పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు.
అసలు పటాన్ చెరు ప్రాంతంలోని పలు పరిశ్రమలు నిబంధనలను తుంగలోకి తొక్కి యథేచ్ఛగా వ్యర్థాలను సరస్సులోకి విడుదల చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు అంటున్నారు. ఈ పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం కారణంగా జనం కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు కాలుష్య నియంత్రణ మండలికి ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యమని ఆరోపిస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/pollution-became-a-curse-to-migratory-birds-39-190773.html
ఫార్ములా ఈ రేసు కేసులో ఎసిబి విచారణకు కెటీఆర్ హజరైవెనుదిరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఉదయం ఎసిబి ఆఫీసు గేటు ముందు వరకు వెళ్లిన కెటీఆర్ ఎసిబి ఆఫీసులోకి ఎంటర్ కాలేదు.
ప్రముఖ క్రికెటర్ యజువేంద్ర చాహల్ ,కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ మధ్య విడాకుల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. భార్య ధనశ్రీతో దిగిన ఫోటోలను యజువేంద్ర డిలీట్ చేశాడు.
గత కొంత కాలంగా ఛత్తీస్ గఢ్ కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్నది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్ తో మావోయిస్టుల కంచుకోట బద్దలౌతున్నది.
సంధ్య థియేటర్ ఘటనలో నిందితుడైన , నటుడు అల్లు అర్జున్ కు రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించనున్నట్లు రాంగోపాల్ పేట పోలీసులకు సమాచారమందింది.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం (జనవరి 6) ఏసీబీ విచారణకు తన న్యాయవాదులతో హాజరయ్యారు. ఏసీబీ కార్యాలయం వరకూ వచ్చిన ఆయన అక్కడ మాత్రం హైడ్రామా ఆడారు. ఏసీబీ కార్యాలయంలోకి ఒంటరిగా హాజరయ్యే ప్రశ్నే లేదనీ, తన న్యాయవాదులను కూడా అనుమతించాలని పట్టుబట్టారు. అందుకు సహజంగానే ఏసీబీ అధికారులు నిరాకరించారు.
కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. కలెక్టర్ సుమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ ఇప్పటికే ఏర్పాట్లను సమీక్షించారు. మధ్యాహ్నం ద్రవిడ యూనివర్శిటీ చేరుకుని ఆడిటోరియంలో కుప్పం 2029 విజన్ ఆవిష్కరించారు
నటుడు మంచు మోహన్ బాబు బెయిలు కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో బీజేపీ పయనం బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రస్థానం ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతోంది. అధికారమే తరువాయి అన్నట్లుగా ఒక సమయంలో బలంగా కనిపించిన ఆ పార్టీ ఆ తరువాత బలహీనపడింది. దక్షిణాదిన బలోపేతం కావడానికి ఆశాదీపంగా తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ భావిస్తోంది.
దేశంలో నల్లధనాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోడీ 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంతో దేశంలో ఒక్కసారిగా సామాన్యుల నుంచి సంపన్నుల వరకూ నానా ఇబ్బందులూ పడ్డారు. 2016 నవంబర్ 8న ప్రధాని పెద్ద నోట్లు రద్దు చేసినట్లు ప్రకటించారు.
చైనాలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ ను ప్రపంచ దేశాలు ఎంత మాత్రం తేలికగా తీసుకోవడానికి వీలులేదు. శీతాకాలంలో అత్యంత వేగంగా విస్తరిస్తూ మానవాళి మనుగడకు ఈ కొత్త వైరస్ సవాల్ విసురుతోంది.
తెలంగాణ మాజీ మంత్రి కెటీఆర్ సోమవారం ఎసిబి ఆఫీసుకు హాజరయ్యారు. కెటీఆర్ రాక సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడే అరెస్ట్ లు చేస్తున్నారు.
గిట్టుబాటు ధర లేక రైతులు,నిత్యావసరాల ధరలు పెరిగి వినియోగదారులు దోపిడీకి గురవుతున్నారు. ఇందుకు కారణం దేశంలో సరైన మార్కెట్ వ్యవస్థ లేకపోవడమే. ఈ కారణంగానే ఇటు ప్రజలు, అటు ప్రభుత్వాలూ కూడా నష్టపోతున్నాయి.
అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను గడగడలాడిస్తోంది. దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత తీవ్రతతో విరుచుకుపడుతున్న మంచు తుపాను ధాటికి అమెరికా వణికి పోతున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రోడ్లు, భవనాలపై మంచు పేరుకుపోయింది.