ఏపీలో పోటాపోటీ యాత్రలు

Publish Date:Nov 16, 2022

Advertisement

వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత.. జనవరి 27 నుంచి ఏపీ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. దాదాపు ఏడాది పాటు పాదయాత్ర చేసి ప్రజలలో మమేకం కావాలని లోకేష్ కొనసాగే లోకేష్ పాదయాత్రను ఆయన తండ్రి, మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పంలో జనవరి 27న ప్రారంభిస్తారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తం 4 వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను, రోడ్ మ్యాప్ ను లోకేష్  సిద్ధం చేసుకుంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. జనం నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకతలు, సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసంతృప్తులు, విపక్షాల నుంచి దూసుకు వస్తున్న విమర్శల నేపథ్యంలో పరువు మరింతగా దిగజారిపోకుండా ఉండాలంటే జగన్ రెడ్డి ముందస్తు ఎన్నికలు తీసుకొస్తే.. ఆ పరిస్థితి వేరే.

ఏపీలో రాజకీయ నేతలు పాదయాత్రలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ అధికారంలో ఉండి, కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి  ప్రజా ప్రస్థానం  పేరుతో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు  వస్తున్నా.. మీకోసం  పేరిట ఏపీలో పాదయాత్ర చేశారు. తర్వాత వైఎస్ జగన్ కూడా  ప్రజా సంకల్ప యాత్ర  యాత్ర చేశారు. అక్రమ ఆస్తుల కేసులో జగన్ అరెస్టయి జైలులో ఉండడంతో ఆయన సోదరి షర్మిల  మరో ప్రజా ప్రస్థానం  అంటూ పాదయాత్ర కొనసాగించారు.

అయితే.. తాజాగా నారా లోకేశ్ చేస్తున్న పాదయాత్ర చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీలు కూడా పాదయాత్రలు, బస్సు యాత్రలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తుండడం విశేషం. తొలుత పాదయాత్ర చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నా.. తర్వాత దాన్ని బస్సు యాత్రగా మార్చుకున్నారు. వాస్తవానికి అయితే.. ఈ సంవత్సరం అక్టోబర్ లోనే జనసేనాని  యాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. సంక్రాంతి తర్వాత ఏపీలో బస్సు యాత్ర చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అవడం గమనార్హం.

మరో పక్కన ఏపీని అడ్డగోలుగా విభజించిందనే కోపంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పారు. అలాంటి పార్టీ ఒకటి ఉందనే ఏపీ లో ఆ పార్టీ పరిస్థితి తయారైంది.  ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిని కాపాడుకునేందుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కూడా పాదయాత్రకు  సిద్ధం అవుతున్నారు.   వచ్చే డిసెంబర్ నుంచి  రాష్ట్రంలో పాదయాత్ర చేయనున్నట్లు  శైలజానాథ్ ప్రకటించారు. ఏపీకి మేలు చేయడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం అనేది శైలజానాథ్ చెబుతుండడం విశేషం. అందుకే తన పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రాష్ట్ర ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

విభజిత ఆంధ్రప్రదేశ్ కు తాను అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేళల్లో ఒక్కటంటే ఒక్క మేలు   కూడా చేయని బీజేపీ కూడా పాదయాత్ర చేసేందుకు ముందుకొస్తోంది. బీజేపీకి ఏపీలో ఓటింగ్ శాతం అతి తక్కువ.  గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సాయంతో కొన్ని అసెంబ్లీ సీట్లలో బీజేపీ గెలిచింది. అయినప్పటికీ ప్రజలకు ఆ పార్టీ వల్ల ఏమి ఒరిగింది అంటే గాల్లో లెక్కలు వేసుకోవాల్సిందే. అలాంటి బీజేపీ ఇప్పుడు ఏపీలో ఉనికి కోసం పాదయాత్ర చేస్తానంటోంది. కానీ.. మిగతా పార్టీల మాదిరి వ్యక్తిగత పాదయాత్ర కాదంటోంది. ఒక్కో ప్రాంతంలో కొందరు బీజేపీ నేతలు కలిసి రాష్ట్రం అంతా పాదయాత్రగా పర్యటిస్తామని ఆ పార్టీ నేత సత్యకుమార్ వెల్లడించారు. బీజేపీ పాదయాత్ర సంక్రాంతి తర్వాత ఆరు నెలల పాటు సాగుతుందని ఆయన తెలిపారు. ఏపీలో   పట్టణాల్లో అంతంత మాత్రంగా  బీజేపీకి ఉనికి ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ పెద్ద జీరో అని చెప్పొచ్చు. అందుకే పట్టణ ప్రాంత ఓటర్లను పాదయాత్ర సందర్భంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.ఈ ఏడాది చివరి నుంచి వచ్చే సంవత్సరం ఆఖరి దాకా ఏపీలో రాజకీయ పార్టీల పాదయాత్రలతో సందడిగా మారబోతోందనేది వాస్తవం.

By
en-us Political News

  
ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనానికి బానిసైన ఓ యువకుడు తన విలాసవంతమైన జీవితం కోసం ఏకంగా కిడ్నాప్ నాటకానికి తెరలేపాడు.
ఉద్యోగాల ఆశ చూపించి విదేశీ మహిళలను భారత్‌కు రప్పించడం.. ఆపై వారితో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహించడంతో మాదాపూర్‌లో వెలుగుచూసిన ఈ వ్యవహారం కలకలం రేపుతోంది.
సీఎం రేవంత్‌తో దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ.. 152 మీటర్ల ఎత్తుపై ముందడుగు.!
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి
ప్రస్తుత సాంకేతిక విప్లవంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం అన్ని రంగాలపై పడుతోంది.
పెరిగిన నిత్యావసరాలు నిర్మాణ సామగ్రి ధరలతో సామాన్యులకు సొంతింటి కల నెరవేర్చుకోవడం అనేది ఒక కష్టతరమైన సవాలుగా మారుతున్న తరుణంలో
తెలంగాణలో రూ.96 కోట్ల ప్రభుత్వ నిధులకు గండి.!
ప్రయాణికులతో నిత్యం రద్దీగా ఉండే ఆర్టీసి బస్సులో చిన్నపాటి చిల్లర గొడవ కాస్తా ఊహించని సంఘటనకు దారితీసింది.
గంటకు 140 కి.మీ వేగంతో పెనుగాలులు..అప్రమత్తమైన యంత్రాంగం.!
ఒకవైపు ధరల మంట.. మరోవైపు కృత్రిమ కొరతలు..!
హైదరాబాద్ మహానగరంలో మరోసారి తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.