టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రాజకీయ నేతలు? ఈడీ విచారణలో తేలిపోనుందా? 

Publish Date:Sep 6, 2021

Advertisement

తెలుగు రాష్ట్రలతో పాటు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. నాలుగేండ్ల క్రితం వెలుగుచూసిన ఈ కేసులో తాజాగా ఈడీ విచారణ జరుపుతోంది. గతంలో తెలంగాణ సిట్ విచారణకు హాజరైన వారందరిని ప్రశ్నిస్తోంది. గతంలో విచారణకు హాజరు కాని అగ్రతారలను ఈడీ ప్రశ్నిస్తుండటం కలకలం రేపుతోంది. డ్రగ్స్ కేసులో రాజకీయ నాయకుల పాత్ర ఉందని, అందుకే గతంలో కేసు విచారణకు తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా నిలిపివేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను బలం చేకూరేలానే ప్రస్తుతం పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2017లో జరిపిన ఎక్సైజ్‌ విచారణ జాబితాలో లేని లేని.. రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుబాటి రానాను ఈడీ విచారణకు పిలవడం సంచలనంగా మారింది. 

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ఇటీవలే కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఆందోళనలో ఉన్నారని… కేటీఆర్ దగ్గరి వారికి… డ్రగ్స్  కేసులో ఈడీ నోటీసులు వచ్చాయన్నారు. ప్రభుత్వ పెద్దలు డ్రగ్స్ కేసుపై భయపడుతున్నారని.. ఈడీ విచారణ చేస్తే ప్రభుత్వ పెద్దలకు ఇబ్బంది ఏంటి ? అని ప్రశ్నించారు రేవంత్‌ రెడ్డి. అసలు డ్రగ్స్‌ కేసులో కేటీఆర్ పాత్ర ఉందా.. ? రకుల్ పాత్ర ఉందా అనేది అసలు సమస్యే కాదని కామెంట్ చేశారు కేటీఆర్‌ కు రకుల్ సన్నిహితులా..? కాదా ? అనేది తనకు సంబంధం లేదని..డ్రగ్స్‌ కేసుపై విచారణ చేయాలని డిమాండ్‌ చేశారు. గోవాకి ఎందుకు కేటీఆర్ వెళ్ళాడని దానిపై దర్యాప్తు చేయాలన్నారు. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపగా.. ఈ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ ను ఈడీ ప్రశ్నించడం సంచలనంగా మారింది. సెప్టెంబర్ 3న ఈడీ విచారణకు హాజరయ్యారు రకుల్ ప్రీత్ సింగ్. డ్రగ్‌ పెడ్లర్‌ కెల్విన్‌ ఇచ్చిన సమాచారంతో ఆమె బ్యాంకు అకౌంట్లను పరిశీలించింది. నిజానికి సెప్టెంబర్‌ 6న విచారణకు హజరుకావాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాల వల్ల తాను ఈడీ సూచించిన తేదిన హజరు కాలేనని రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. సెప్టెంబర్‌3న విచారణకు హాజరవుతానని రకుల్‌.. ఈడీకి మెయిల్‌ ద్వారా  తెలిపింది. దీంతో డాక్యుమెంట్స్‌తో పాటు విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ను ఈడీ విచారించడంతో  పీసీసీ చీఫ్ వంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై చర్చ జరుగుతోంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ, బండి సంజయ్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని అన్నారు. ఈ యాత్ర సక్సెస్ అయితే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు. బండి సంజయ్ కు అడ్డు వస్తే పగిలిపోతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణలో రాజకీయ నాయకుల పేర్లు కూడా వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో రాజకీయ నాయకులు ఉన్నారని, త్వరలోనే వారి పేర్లు బయటికి వస్తాయని రాజాసింగ్ చెప్పడం చర్చగా మారింది. 

2017లో డ్రగ్స్ కేసు వెలుగులోనికి వచ్చింది. 12 మంది సినీ ప్రముఖులను ఎక్సైజ్‌ శాఖ విచారణ జరిపింది. విచారణకు హాజరైన 12 మంది సినీ ప్రముఖుల్లో ఇద్దరు మాత్రమే తమ రక్త నమూనాలను ఇచ్చారు.దర్శకుడు పూరీ జగన్నాథ్, నటుడు తరుణ్‌ మినహా మిగిలిన వారంతా తమ రక్త నమూనాలు ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. రక్త నమూనాలను తీసుకునే విషయంలో సంబంధిత వ్యక్తి అంగీకారం గానీ లేదంటే కోర్టులు అనుమతి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో మిగిలిన వారి నుంచి శాంపిల్స్‌ తీసుకోకుండా ఎక్సైజ్‌ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వదిలేసింది. ఇద్దరి రక్త నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపగా, వారి రక్తంలో డ్రగ్స్‌ ఆనవాళ్లు లేవని తేలినట్లు సమాచారం. మిగిలిన వారు డ్రగ్స్‌ తీసుకున్నట్లుగానీ లేదా డ్రగ్స్‌ వ్యాపారంతో సంబంధం ఉందనే ఆధారాలు లభించకపోవడంతో ఈ కేసుతో సినీతారలకు సంబంధం లేదని ఎక్సైజ్‌ శాఖ అప్పట్లోనే తేల్చేసింది. ఈ కేసుకు సంబంధించిన చార్జిషీటును మూడేళ్ల తర్వాత 2020 డిసెంబర్‌లో కోర్టుకు సమర్పించింది. 

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.