న్యాయవాది కేసులో రాజకీయ నేత అరెస్టు

Publish Date:May 29, 2026

Advertisement

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా రాజకీయ నాయకుడు మహబూబ్ ఆలంఖాన్‌, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్‌తో పాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భూ వివాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం పోరాడేవాడు. ఈ నేపథ్యం లో పలువురు భూకబ్జాదారులకు ఆయన అడ్డంకిగా మారాడు. ముఖ్యంగా కొన్ని భూముల వ్యవహారాల్లో మహబూబ్ ఆలంఖాన్‌కు మొయినుద్దీన్ అడ్డుగా నిలిచాడని పోలీసులు గుర్తించారు. కోట్ల రూపాయలు ఇస్తామని, భూ వ్యవహారాల నుంచి తప్పుకోవాలని మొయినుద్దీన్‌కు ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన తిర స్కరించినట్లు సమాచారం. అంతేకాకుండా కాజా మొయినుద్దీన్ న్యాయం కోసం పోరాటం కొనసాగించడంతో అతడిని ఎలాగైనా సరే హత్య చేయాలని ఆలంఖాన్ కుట్ర పన్నినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ హత్య కోసం రూ.25 లక్షల సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది.

ఈ కుట్ర అమలు కోసం సుపారీ కిల్లర్ కిషన్‌సింగ్‌ను రంగంలోకి దింపారు. హత్యను ప్రమాదంలా చూపించేందుకు స్టంట్ మాస్టర్ అభిజిత్‌ను కూడా ప్లాన్‌లో భాగం చేశారు. అలాగే వినయ్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఈ కుట్రలో పాలుపం చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఆరుగురు కలిసి మొయినుద్దీన్ హత్యకు పక్కా స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో బయటపడింది. పక్కా పథకం ప్రకారం, ఉదయం మొయినుద్దీన్ కోర్టుకు వెళ్తున్న సమయంలో హిట్ అండ్ రన్ తరహాలో వాహనంతో ఢీకొట్టి హత్య చేసి నట్లు పోలీసులు గుర్తిం చారు. మొదటగా ఇది రోడ్డు ప్రమాదంగా కనిపించినప్ప టికీ, సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా, సాంకేతిక ఆధారాల ఆధారంగా ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా తేలింది. 

హత్య అనంతరం నిందితులు తెలంగాణ బయట ఇతర రాష్ట్రాలకు పారిపోయారు. అయితే ప్రత్యేక పోలీసు బృందాలు వేగంగా స్పందించి వారిని గుర్తించి అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కిషన్‌సింగ్‌తో పాటు పరారీ లో ఉన్న మరో నలుగురిని కూడా పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.

ఈ కేసులో  రాజకీయ నేత మహబూబ్ ఆలంఖాన్‌, ఆయన కుమారుడు ముజాహిద్ ఆలంఖాన్‌, సుపారీ కిల్లర్ కిషన్‌సింగ్‌, స్టంట్ మాస్టర్ అభిజిత్‌, వినయ్‌, మరో సహ నిందితుడు మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.. అయితే ఇప్పటికే పోలీసులు హత్యకు ఉపయోగించిన వాహనాన్ని  స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆర్థిక లావాదేవీలు, సుపారీ చెల్లింపులు, కుట్రలో మరెవరైనా పాల్గొన్నారా అనే కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.  

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించిన మహిళా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త రవాణా విప్లవానికి వేదిక కాబోతోంది. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది.
ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లే శ్వర స్వామివారి దేవస్థానంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాల నాణ్యతపై ఆలయ ఈవో శీనా నాయక్ ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి తన రైతు మనసును చాటుకున్నారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి తీవ్రమైన ఉద్రిక్తతలకు వేదికగా మారాయి.
హైదరాబాద్ శివారులోని గండిపేట ప్రాంతంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ పత్రాలతో కాజేసి విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూ మోసాన్ని షేర్ లింగంపల్లి పోలీసులు ఛేదించారు.
ఉన్నత చదువులు, కుటుంబ ఆశయాలు, భవిష్యత్తుపై ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువకుడు
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలైన ఆధ్యాత్మిక క్షేత్రాల రూపురేఖలను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయం మరోసారి హీటెక్కింది.
ఉత్తరాఖండ్‌లో ఎంతో పవిత్రంగా భావించే చార్‌ధామ్ యాత్రకు భక్తులు ఊహించని స్థాయిలో పోటెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు ముందుకు వేసింది.
వేసవి సెలవులను ప్రశాంతంగా, ఆనందంగా గడపాలని ఆ కుటుంబాలు ఎన్నో కలలు కన్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌ పరామర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.