హాట్ హాట్‌గా టి-పాలిటిక్స్‌.. ఏప్రిల్‌లో ఫుల్ హీట్‌..

Publish Date:Mar 29, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఢిల్లీ వెళ్లి జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించేందుకు తహతహలాడి పోతున్నారు. ఎప్పుడెప్పుడు హైదరాబాద్ వదిలి ఢిల్లీలో వాలిపోదామా అనే ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారు. అందుకోసం ఆయన ఏకంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్’ కిశోర్’తో డీల్ సెట్ చేసుకున్నారు. ఆ విషయం కూడా ఆయనే చెప్పారు. అయితే, పీకేతో మనీ డీల్ ఏమీ లేదని, ఆయన ఫ్రీ’గా సేవలు అందిస్తున్నారని చెప్పుకొచ్చారు అనుకోండి అది వేరే విషయం. 

కేసీఆర్ అలా ఢిల్లీ వైపు చూస్తుంటే, ఢిల్లీ నేతలు తెలంగాణ మీద కన్నేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి మొదలు రోజురోజుకు బలహీనమవుతున్నతెరాసని ఓడించి, అధికారాన్ని, సొంతం చేసుకునేందుకు ఎప్పటినుంచో తెలంగాణపై కన్నేసిన బీజేపీ నాయకత్వం ఇక ఇప్పుడు మరింత జోరుగా రాష్ట్రంలో పాగావేసే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఓ వంక సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన కమల దళం జాతీయ నాయకత్వం త్వరలో జనంలోకి దూసుకు పోయేందుకు సిద్డంమవుతోంది. ముఖ్యంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిని పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి, ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అమిత్ షా తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా తెలంగాణపై దృష్టి కేంద్రీకరిస్తారని పార్టీ నాయకులు ఎప్పటినుంచో చెపుతూనే ఉన్నారు.ఇప్పడు అందులో భాగంగానే, అమిత్ షా, ఏప్రిల్‌లో రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించేందుకు ప్రణాళిక సిద్దమైంది. 

బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్, ఏప్రిల్ 14 నుంచి రెండో విడత పాదయాత్రను ప్రారంభిస్తున్నారు. ఈ యాత్రను అమిత్ షా ప్రారంభిస్తారు. అలాగే, శ్రీరామనవమి రోజు భద్రాచలంలో స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. అదే రోజున అయన హైదరాబాద్’ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని కూడా సందర్శించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం. ఏప్రిల్‌ పర్యటనలో అమిత్ షా బీజేపీ తెలంగాణ మిషన్’ విషయంలో అందరికీ క్లారిటీ ఇస్తారని, ఇక అక్కడి నుంచి కార్యాచరణ ప్రారంభమవుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత బీజేపీ జాతీయ నాయకులూ, కేంద్ర మంత్రులు తెలంగాణ పై దండయాత్ర కొనసాగుతుందని, బండి యాత్ర సాగినంత కాలం ఒకరి వెంట ఒకరుగా కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది.
 
బీజేపీ విషయం అలా ఉంటే, అంతర్గత కుమ్ములాటలతో సతమత‌మ‌వుతున్న, టీపీసీసీ అధుక్షుడు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ అధిష్టానం సర్వాధికారాలు ఇచ్చిన నేపధ్యంలో, ఆయన ఏప్రిల్ నెలలో రైతు సమస్యలతో పాటు, విద్యార్ధులు, నిరుద్యోగుల సమస్యల్పి పెద్ద ఎత్తున ఆందోళనలు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టింది మొదలు, పార్టీలో జోష్ పెంచేందుకు, శ్రమిస్తూనే ఉన్నారు. అయితే, సీనియర్లు కొందరు, అసమ్మతి కార్యక్రమాలకు తెర తీయడంతో, లంక మేత గోదావరి ఈత’ నట్లుగా ఫలితం లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి ప్రజల్లో, పార్టీ క్యాడర్’లో విశ్వాసం పెంచేందుకు, ఒక భారీ కార్యక్రమం తీసుకున్న వెంటనే సీనియర్, నాయకులూ అసమ్మతి రాగం ఎత్తుకోవడంతో, రేవంత్ పడిన కష్టం పలచనై పోయింది. అయితే ఇప్పుడు అధిష్టానం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో, సీనియర్ల ‘సెగ’ సగం అయినా తగ్గుతుందని, అంటున్నారు. అలాగే, ఏప్రిల్’లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియ గాంధీ, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడమే కాకుండా, రేవంత్ రెడ్డికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. అలాగే, అసమ్మతి సెగలు రాజేస్తున్న సీనియర్ లీడర్స్’కు సోనియా, రాహుల్ కనీసం అప్పాయింట్మెంట్ అయినా ఇవ్వకుండా, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో రేవంత్ వర్గంలో  ఉత్సాహం మరింత పెరిగింది. ఏప్రిల్ యుద్దానికి సై అంటున్నాయి. 

మరోవంక, పంజాబ్’ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా, తెలంగాణ పై దృష్టిని కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ నెల 14 న రాష్ట్రంలో పార్టీ  నాయకురాలు ఇందిర శోభన్ పాదయాత్రను కేజ్రి వాల్ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. సో ఏప్రిల్ నెలలో ఎండలే కాదు, రాజకీయ వేడి మండి పోవడం ఖాయంగా కనిపిస్తోంది.

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.